సాక్షి, టెక్కలి: ఏకంగా మంత్రితోనే ఆయన ఢీకొనబోతున్నారు. కానీ ఆ బెరుకు ఏ కోశానా లేదు. జనం కోసం తాను పోరాడుతున్నానని, ప్రత్యర్థి బలాన్ని చూసే పనిలేదని అంటున్నారు. వైఎస్సార్‌సీపీ టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాడ తిలక్ మంత్రి అచ్చెన్నాయుడితో సై అంటే సై అంటున్నా రు. ఐదేళ్లు చూసిన అక్రమాలను జనా నికి గుర్తు చేస్తానంటున్న తిలక్ ‘సాక్షి’ తో ఇలా మాట్లాడారు.
సాక్షి: ఈ సారి ఎన్నికలు ఎలా జరగనున్నాయి?
తిలక్: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసగించడమే కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగించారు. అందుకే జనం తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు.
సాక్షి: అచ్చెన్నాయుడు టెక్కలిలో అభివృద్ధి పనులు చేశారా.?
తిలక్: నియోజకవర్గ అభివృద్ధి కంటే ఆయన సొంత అభివృద్ధి ఎక్కువ జరిగింది. గతంలో జరిగిన పనులకు షో చేసుకుంటూ జేబులు నింపుకున్నారు. ఆఫ్‌షోర్ ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు. నియోజకవర్గ కేంద్రంలో ఆస్పత్రి నిర్మాణం పూర్తి కాలేదు. మినీ స్టేడియం అసంపూర్తిగా వదిలేశారు. మహిళా కళాశాల ఊసే లేదు. టెక్కలి నుంచి తరలిపోయిన ప్రభుత్వ కార్యాలయాలు తీసుకురాలేకపోయారు. భావనపాడు పోర్టు కడతామనే హామీ గాల్లో కలిసిపోయింది. ఉప్పు కా ర్మికులు, మత్స్యకారులు, యాదవుల సంక్షేమానికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. ప్రతి ప్రభుత్వ పథకంలో లంచాలను మేసే విధంగా జన్మభూమి కమిటీలు ప్ర జలను హింసించాయి. కక్ష సాధింపుతో డీలర్లు, ఉపాధి హామీ సిబ్బందిని తొలగించారు. వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శులను దూరంగా బదిలీలు చేశారు. నియోజకవర్గంలో నియంత పాలన కొనసాగింది.
సాక్షి: మీ ప్రాంత సమస్యలపై మీకు ఏ విధమైన అవగాహన ఉంది?
తిలక్: మూడేళ్లుగా పల్లెపల్లెకూ తిరుగుతున్నాను. అంద రి సమస్యలను కళ్లారా చూశాను. ప్రధానంగా రైతులు, సామాన్య ప్రజలు, నిరుద్యోగ యువత సమస్యలపై అవగాహన కలిగింది. నియోజకవర్గ ప్రజలకు ఏ విధమైన అభివృద్ధి చేస్తే వారు సంతోషంగా ఉంటారో వాటితో ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నాను.
సాక్షి: టెక్కలిలో వైఎస్సార్ సీపీ ప్రభావం ఎలా ఉంది?
తిలక్: అచ్చెన్నాయుడితో పాటు ఆ పార్టీ నాయకుల నిరంకుశ వైఖరితో టెక్కలి విసిగిపోయింది. వైఎస్సార్ సీపీ జెండానే వారికి ఆ ఊరట కలిగిస్తోంది. స్వచ్ఛమైన రాజకీయాలతో ప్రజా పోరాటాలు చేస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై ప్రజ లకు పూర్తి నమ్మకం ఏర్పడింది. నవరత్నాల పథకాలపై ప్రజలు ఎంతో ఆసక్తులయ్యారు.
సాక్షి: మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు?
తిలక్: జనం ప్రేమ చూపితే అసంపూర్తిగా ఉన్న ఆఫ్ షోర్‌ను పూర్తి చేయంతో పాటు ప్రతి ఎకరాకు సాగునీరు అందే విధంగా చూస్తాను. ఉప్పు కార్మికులు, మత్స్యకా రుల సమస్యలను పరిష్కరిస్తాను. నియోజకవర్గ కేం ద్రంలో మహిళా జూనియర్ కళాశాలను ఏర్పా టు చేస్తాను. ప్రతి ఇంటికి మినరల్ వాటర్ అందే విధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాను. గిరిజ న ప్రాంతాల్లో వైద్య సేవలు అందే విధంగా ప్రత్యేక దృష్టి సారిస్తాను. పవర్‌ప్లాంట్ కేసుల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాను. రావివలస ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమ కార్మికులను ఆదుకునే విధంగా చూస్తాను. భావనపాడు ప్రాంతంలో మత్స్యకారులకు అవసరమయ్యే విధంగా హార్బర్ నిర్మాణానికి కృషి చేస్తాను. ముఖ్యంగా సంక్షేమ పథకాల అందజేతలో కొనసాగుతున్న వివక్షకు చరమ గీతం పాడుతాను.
Comments
Please login to add a commentAdd a comment