‘సాక్షి మైత్రీ మహిళ’కు విశేష ఆదరణ | sakshi maithree very good response | Sakshi
Sakshi News home page

‘సాక్షి మైత్రీ మహిళ’కు విశేష ఆదరణ

Published Wed, Jun 25 2014 2:19 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

‘సాక్షి మైత్రీ మహిళ’కు విశేష ఆదరణ - Sakshi

‘సాక్షి మైత్రీ మహిళ’కు విశేష ఆదరణ

తిరుపతి కల్చరల్:  సాక్షి దినపత్రిక, టీవీ, పిడిలైట్, ఉషా కంపెనీల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం తిరుపతి నగరంలో నిర్వహించిన సాక్షి మైత్రీ మహిళ కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది. కార్యక్రమంలో భాగంగా బైరాగిపట్టెడలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జ్యువలరీ అండ్ ఫ్యాషన్ డిజైన్ సంస్థ కార్యాలయంలో  గృహిణులకు స్వయం ఉపాధికై చేతి వృత్తులపై ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలోని సుమారు 80 మంది మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాక్షి మైత్రీమహిళ రాయలసీమ ప్రోగ్రామ్ ఇన్‌చార్జి జే.ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించి తద్వారా వారు ఆర్థికంగా ఎదిగి తమవంతు కుటుంబానికి ఆదరణగా నిలపాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తం గా సాక్షి మైత్రీ మహిళ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. జిల్లాలో చిత్తూరులో కూడా నిర్వహించామని, తిరుపతి నగరంలో ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆయన పేర్కొన్నా రు.  ఐదు రోజుల పాటు మహిళలకు ఉచితంగా హస్తకళల తయారీ, టైలరింగ్, పెయింటింగ్ వంటి చేతివృత్తులకు సంబంధించిన శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. శిక్షణలో పాల్గొనే మహిళలకు ఎలాంటి విద్యాప్రామాణికం లేదన్నారు. అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అంద జేయడంతో పాటు సాక్షి మైత్రీ మహిళలో సభ్యత్వం కార్డులు పంపిణీ చేస్తామన్నారు. ఆసక్తి గల మహిళలు 9505555020, 9640131153ను సంప్రదించాలని ఆయన కోరారు. అనంతరం ఎన్‌ఎఫ్‌ఐ సంస్థ డెరైక్టర్ మాదిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సాక్షి మైత్రీ మహిళ ద్వారా ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం పడిలైట్, ఉషా కంపెనీ ప్రతినిధు లు మహిళలకు హస్తకళలు, టైలరింగ్ వృత్తులపై శిక్షణ కల్పించారు.

చిత్తూరులో రెండోరోజూ ‘సాక్షి’ మైత్రీమహిళ

చిత్తూరు(సిటీ) : పిడిలైట్ సంస్థ, సాక్షి దినపత్రిక-టీవీ సంయుక్త ఆధ్వర్యంలో గృహిణుల కోసం నిర్వహిస్తున్న సాక్షి మైత్రీమహిళ కార్యక్రమం రెండో రోజు మంగళవారం కూడా కొనసాగింది. స్థానిక పీసీఆర్ ప్రభుత్వ వృత్తివిద్యా కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి నగరంలోని పలువురు మహిళలు హాజరై పెయింటింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, ఇతర హేండీక్రాఫ్ట్స్‌పై శిక్షణ తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రో గ్రామ్ కో-ఆర్డినేటర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ గృిహ ణులకు స్వయం ఉపాధి కల్పించేందుకు వీలుగా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పా రు. మరో మూడు రోజుల పాటు చిత్తూరు నగరంలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పిడిలైట్ సంస్థకు చెందిన ఇన్‌స్ట్రక్టర్లు పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement