సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణపై ఆ పార్టీకి స్పష్టత లేకపోవడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఏ పార్టీలోకి వెళతాననేది ఇప్పుడే చెప్పలేనన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పదవులకు రాజీనామా చేయడంతోపాటు విజయవాడలో విజయమ్మ దీక్ష కూడా చేపడుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో కొనసాగడం సరికాదనే ఉద్దేశంతోనే రాజీనామా చేశానన్నారు.