సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్, తిరుపతి సహా దేశవ్యాప్తంగా 24 ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తేనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి అధిర్‌రంజన్ చౌధురి తెలిపారు. ఈ మేరకు ఆయన లోక్‌సభలో లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
అదేవిధంగా రైల్వేస్టేషన్లున్న ప్రదేశాల చారిత్రక నేపథ్యం, పర్యాటక ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని పర్యాటక మంత్రిత్వశాఖ భాగస్వామ్యంతో ప్రయాణికులకు మరిన్ని సదుపాయాలు కల్పించనున్నట్టు తెలిపారు. ఆధునీకరణ, సదుపాయాల వ్యయాన్ని రైల్వే, పర్యాటక శాఖలు భరిస్తాయన్నారు.