సర్పంచ్‌ల పవర్‌కు చెక్!
Published Thu, Aug 22 2013 1:58 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
విజయనగరం కంటోన్మెంట్ న్యూస్‌లైన్ : రెండేళ్లపాటు వారు రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయారు. తరువాత ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తమ శక్తియుక్తులన్నీ ఉపయోగించి, వ్యయప్రయాసలకు ఓర్చి విజయం సాధించారు. సర్పంచ్ పీఠాన్ని అధిరోహించారు. ఇక గ్రామాలను ఏకఛత్రాధిపత్యంగా ఏలేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇంతలో వారికి ప్రభుత్వం ‘చెక్’ చెప్పింది. ఏకఛత్రాధిపత్యానికి అడ్డుకట్టవేసింది. ఏ చిన్న ఖర్చు చేసినా దాని కోసం నిధులు డ్రా చేసే చెక్‌పై కార్యదర్శి సంతకం కూడా తప్పని సరి అని మెలిక పెట్టింది. దీంతో వారి ఆనందం ఆవిరైంది.
కొత్త విధానంతో అభివృద్ధికి గండి
ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో గెలుపొందిన వారంతా ఎంతో ఆనందోత్సాహాలతో పదవులను ఆధిరోహించారు. దీంతో రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న పల్లెలకు ఎట్టకేలకు మోక్షం లభించినట్టయింది. పంచాయతీల పాలనాపరమైన బాధ్యతలు సర్పంచ్‌ల చేతుల్లోకి వెళ్లడంతో పల్లె ప్రజల ఇబ్బందులు తొలగుతాయని భావిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా విముఖత వ్యక్తమవుతోంది.
గతంలో సర్పంచ్‌లకు నిధుల వినియోగంపై సర్వాధికారాలు ఉండే వి. నిధులను డ్రా చేసే అధికారం వారికే ఉండేది. కార్యదర్శులు పరిపాల నపరమైన విధులు, బాధ్యతలు నిర్వర్తించేవారు. అయితే ఇప్పుడు వివిధ పద్దుల కింద పంచాయతీకి కేటాయించే నిధుల వినియోగంలో సర్పంచ్‌తో పాటు, కార్యదర్శిసంతకాన్ని తప్పని సరిచేయడంతో అభివృద్ధి మందగించే అవకాశం ఉందని రాజ కీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి ఈ విధానం పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసినప్పటి నుంచి ప్రారంభమైం ది. రెండేళ్ల క్రితం సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో పాటు అప్పట్లో ఎన్నికలు నిర్వహించలేని ప్రభుత్వం ప్రత్యేకాధికారులకు పాలన బాధ్యతలు అప్పగించింది. ఈ నేపధ్యంలో పంచాయతీలోని నిధులు వినియోగంపై ప్రత్యేకాధికారులతో పాటు, గ్రామ కార్యదర్శికి సంయుక్తంగా చెక్‌పవర్‌ను ఇస్తూ అప్పట్లో ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. అయితే అదే విధానాన్ని సర్పంచ్‌ల ఎన్నిక అయిన తరువాత కూడా అమలు చేయడం మింగుడుపడని విషయంగా మారింది. అన్ని పథకాల నిధుల వ్యయానికి ఇదే విధానం అమల్లోకి రానుంది.
పంచాయతీలకు వచ్చే నిధుల వివరాలు
జిల్లాలో 921 పంచాయతీలకు ఏడాదికి సరాసరిన మొత్తం రూ 65 కోట్ల వరకూ నిధులు మంజూరవుతాయి. ఇందులో బీఆర్‌జీఎఫ్ కింద రూ15కోట్లు, 13వ ఆర్ధిక సంఘం నిధుల కింద రూ 15 కోట్లు, స్టేట్ ఫైనాన్స్ కమిటీ నుంచి రూ 15 కోట్లు, సీనరీస్ ఫీజ్ కింద రూ 10కోట్లు, షేర్‌క్యాపిటల్ గ్రాంట్స్ కింద మరో 10 కోట్ల వరకు నిధులు మంజూరు అవుతా యి. వీటిని జిల్లాలోని పంచాయతీలకు జనా భా ప్రతిపాదికన మేజర్ పంచాయతీలకు ఎక్కువగాను, మైనర్ పంచాయతీలు సాధారణంగా కేటాయిస్తారు. ఈ లెక్కన చూసుకుంటే మేజర్ పంచాయతీలకు సుమారు రూ. కోటి వరకూ, మైనర్ పంచాయతీలకు రూ 60 లక్షల వరకు నిధులు మంజూరవుతాయని అంచనా...
ఎమ్మెల్యేల పెత్తనం...
పంచాయతీరాజ్ శాఖ నూతనంగా జారీ చేసిన ఉత్తర్వలో కొంచెం మోదం.. కొంచె ఖేధంగా మారింది. గతంలో అధికారం మొత్తం సర్పంచ్‌లకు ఇవ్వడంతో నిత్యం గ్రామంలో ఉండే వారు.ప్రజా సమస్యలను అర్థం చేసుకుని తక్షణ చర్యలు తీసుకునేవారు.
అయితే కొంతమంది సర్పంచ్‌లు అభివృద్ధి పనులు చేయకున్నా నిధులు డ్రా చేసి తమ జేబులు నింపుకున్నారన్న ఆరోపణలూ లేకపోలేదు. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే నూతన నిర్ణయంతో పంచాయతీ నిధులపై మంత్రులు, ఎమ్మెల్యే పెత్తనం పెరుగే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.
Advertisement
Advertisement