
వానరాలకు ఆహారం పెడుతున్న సాయి
పశ్చిమ గోదావరి, భీమడోలు: భీమడోలు శ్రీసత్యసాయి సేవా సమితి సభ్యుడు వర్ధినీడి సాయి మానవత్వాన్ని చాటారు. దూబచర్ల నుంచి జి.కొత్తపల్లి వెళ్లే రహదారి వెంట ఉన్న వానరాలకు దాహార్తి తీర్చడంతో పాటు అరటిపండ్లు, జామకాయలు ఆహారంగా అందించారు. సు మారు 50 కిలోమీటర్ల మేర వాటర్ ట్యాంకుతో ప్రయాణించి ఆయా ప్రాంతాల్లో ఉన్న 20కు పైగా తొ ట్టెలను నీటితో నింపారు. లాక్‌డౌన్‌తో మూగజీవాలకు ఆహారం దొరకడంతో కష్టమైందని, ప్రతిఒక్కరూ వా టిని ఆదరించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment