పంచలోహ విగ్రహాలు చోరీ
వాచ్‌మెన్‌ను నిర్బంధించి చోరీకి పాల్పడిన దుండగులు
బద్వేలుఅర్బన్:
మున్సిపాలిటీ పరిధిలోని చెన్నం పల్లె సమీపంలో ఉన్న పురాతన ఆది చెన్నకేశవ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. దుండగులు ఆలయంలోని వాచ్‌మెన్‌ను నిర్బం ధించి భూదేవి, శ్రీదేవి సమేత చెన్నకేశవస్వామి పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారు. వివరాలిలా ఉన్నాయి. మట్లిరాజుల కాలంలో 15వ శతాబ్దంలో నిర్మించబడి పురాతన ఆలయంగా ప్రసిద్ధికెక్కిన ఆది చెన్నకేశవస్వామి ఆలయంలో భూదే వి, శ్రీదేవి సమేత ఆదిచెన్నకేశవస్వామి పంచలోహ ఉత్సవ విగ్రహాలు ఉన్నా యి. ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాలలో విగ్రహాలను బయట ఉంచి కల్యాణోత్సవం జరిపిస్తారు. అంతేగాకుండా రథోత్సవంలో ఊరేగిస్తారు.
మిగిలిన రోజులలో ఆలయంలోని మూల విరాట్ సమీపంలో పంచలోహ విగ్రహాలను ఉంచుతారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఆలయంలో ప్రవేశించిన కొం దరు దుండగులు వాచ్‌మెన్ నరసింహులును నిర్బంధించి ఆలయంలోని ఉత్సవ విగ్రహాలను ఎత్తుకెళ్లారు. తెల్లవారిన తర్వాత ఆలయం తలుపులు తెరచి ఉండడంతో అనుమానం వచ్చిన స్థానికులు లోనికి వెళ్లి చూశారు. వాచ్‌మెన్ నిర్బం దించి ఉండడంతో వెంటనే అతని చేతుల కు తాళ్లను ఊడదీసి విచారించగా జరిగిన విషయం తెలిపారు. స్థానికులు ఆలయ చైర్మన్ పెద్దిరెడ్డి పద్మనాభరెడ్డికి సమాచారం అందజేయడంతో వెంటనే ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సీఐ వెంకటప్ప, ఐడి పార్టీ సిబ్బందితో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే విజయ మ్మ కూడా పరిశీలించి చోరీ జరిగిన తీరును సీఐని అడిగి తెలుసుకున్నారు.
డాగ్‌స్క్వాడ్ పరిశీలన
చోరీ జరిగిన ఆలయ పరిసరాలను కర్నూలుకు చెందిన పోలీసు జాగిలం పరిశీలించినట్లు సీఐ వెంకట ప్ప తెలిపారు. తొలుత ఆలయంలోకి ప్రవేశించి అక్కడి నుంచి నేరుగా ఆలయం వెనుకభాగంలో ఉన్న ప్రదేశంలో తిరిగి అక్కడి నుంచి చెరువుకట్ట వెంబడి కొద్ది దూరం వెళ్లి తిరిగి ఆలయంలో విగ్రహాలు ఉంచే ప్రాంతానికి చేరుకున్నట్లు ఆయన తెలిపారు. దేవాదాయ శాఖ మేనేజర్ ఎం. శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.