ancient Architecture
-
ఇది.. 'మట్టిదిబ్బ' అనుకుంటున్నారా!?
దూరం నుంచి చూస్తే భారీ మట్టిదిబ్బలా కనిపిస్తుంది గాని, ఇది పురాతన రాతి కట్టడం. ఇది సామూహిక సమాధి. కొత్తరాతి యుగం నాటి ఈ భారీ సమాధి ఐర్లండ్‌లోని డ్రోహడా పట్టణానికి చేరువలో బోయన్ నదీ తీరాన ఉంది. దీనిని క్రీస్తుపూర్వం 3200 ప్రాంతంలో నిర్మించి ఉంటారని అంచనా.ఈ పురాతన నిర్మాణాన్ని యునెస్కో చారిత్రక వారసత్వ కట్టడంగా గుర్తించింది. న్యూగ్రేంజ్ మాన్యుమెంట్ పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ కట్టడాన్ని 1.1 ఎకరాల విస్తీర్ణంలో 39 అడుగుల ఎత్తున నిర్మించారు. దీని లోపలకు చేరుకోవడానికి ప్రవేశ ద్వారం, అక్కడి నుంచి అరవై అడుగుల నడవ దారి ఉంటాయి. లోపలి భాగంలో ఉన్న మూడు గదుల్లో పురాతన మానవ అస్థికలు కనిపిస్తాయి.ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ కాలంలోనే నిట్టనిలువుగా రాళ్లను నిలిపి, వాటిని కలుపుతూ వృత్తాకారంలో ఈ సమాధిని నిర్మించడం విశేషం. పురాతత్త్వ శాస్త్రవేత్తలు దీనిలోపల జరిపిన తవ్వకాల్లో దహనం చేసిన మానవ అస్థికలు, దహనం చేయని మానవ అస్థికలు కూడా దొరికాయి. వాటితో పాటు ఆనాటి మానవులు ఉపయోగించిన పలు వస్తువులు కూడా దొరికాయి.ఇవి చదవండి: పూర్వం 'ధ్రువసంధి' అయోధ్యకు.. రాజుగా.. -
నరకానికి ప్రవేశ ద్వారం.. 2200 సంవత్సరాలుగా!
నరకానికి ప్రవేశద్వారం భూమ్మీదే ఉంది. గ్రీకు నగరం హీరాపోలిస్లో దాదాపు 2200 సంవత్సరాలుగా ఈ నరక ప్రవేశద్వారం చెక్కు చెదరకుండా ఉంది. అప్పట్లో ఈ నగరం రోమన్ సామ్రాజ్య పరిధిలో ఉండేది. ఫొటోల్లో ఒక కొలను, దానికి పక్కనే పొగలు చిమ్ముతూ ఒక గుహలాంటి మార్గం కనిపిస్తున్నాయి కదా, గుహలాంటి మార్గమే, నరకానికి ప్రవేశద్వారం. ఈ కొలను ఒక వేడినీటి బుగ్గ. హీరాపోలిస్ నగరంలో ఇలాంటి వేడినీటి బుగ్గలు చాలానే కనిపిస్తాయి. ఈ నగరంలోని పురాతన కట్టడమైన ‘ప్లూటో’ ఆలయంలో ఉంది ఈ నరక ప్రవేశద్వారం. ఈ ద్వారం దాటుకుని లోపలకు అడుగుపెట్టాలనుకుంటే, ఎలాంటి జీవి అయినా ప్రాణాలు కోల్పోవాల్సిందే! అందుకే దీనికి ‘గేట్‌వే టు హెల్’ (నరకానికి ప్రవేశద్వారం) అని పేరు వచ్చింది. రోమన్ సామ్రాజ్యకాలంలో అప్పటి పూజారులు ఈ ప్రవేశద్వారం ముందే ఎద్దులను బలి ఇచ్చేవారట. జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ డ్యూయిస్‌బర్గ్–ఎసెన్కు చెందిన శాస్త్రవేత్తలు నాలుగేళ్ల కిందట ఈ కట్టడంపై పరిశోధనలు జరిపారు. ఈ నరక ప్రవేశద్వారానికి చేరువగా ఎగిరే పక్షులు ఇక్కడకు వచ్చే సరికి కుప్పకూలి, చనిపోతుండటాన్ని వారు గమనించారు. ఈ గుహ అడుగు భాగాన అగ్నిపర్వతం ఉండవచ్చని, దాని నుంచి నిరంతరం వెలువడే విషవాయువుల కారణంగానే, దీనికి చేరువగా వచ్చే జీవులు ప్రాణాలు కోల్పోతుండవచ్చని డ్యూయిస్‌బర్గ్–ఎసెన్ వర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ గుహ ద్వారం నుంచి వెలువడే వాయువుల్లో 91 శాతం కార్బన్ డయాక్సైడ్ ఉన్నట్లుగా నిర్ధారించారు. గుహ లోపలి రసాయనిక వాయువుల ఫలితంగానే, ఇక్కడి కొలనులోని నీటి మట్టం ఇక్కడి వేదిక మట్టాని కంటే దాదాపు 16 అంగుళాలు ఎత్తుగా ఉన్నట్లు తేల్చారు. -
వేటాడుతూ.. నేలకొరుగుతూ..!
సాక్షి, హైదరాబాద్: ఓ కథ.. ఓ శిల్పం.. అందులో కథనం.. ఇతివృత్తంలోని ఘట్టాలను వరుసగా పేర్చిన దృశ్య రూపం. పై నుంచి చూస్తూ వస్తే నాలుగు వరుసల్లో దృశ్య మాలిక. రెండు అడుగుల శిల్పం.. ఓ వీరగల్లు కథను చెప్పేసింది. స్పష్టమైన చిత్రాలు.. అవి పలికించిన భావాలు.. అందునా భావోద్వేగాలు. దాదాపు వెయ్యేళ్ల నాటి ఓ అద్భుత శిల్ప సౌందర్యం. చక్రవర్తుల రాచరికపు దర్పం మనకు ఎన్నో శిల్పాల్లో కనిపిస్తుంది. వాటికి సమాంతరంగా వీరగల్లుల వీరోచితం కూడా ప్రస్ఫుటమవుతుంది. యుద్ధంలోనో, వేటలోనో చనిపోయిన వారి పోరాటాన్ని వారి గుర్తుగా శిల్పంలో పాదుకొల్పటం నాటి ఆనవాయితీ. ఈ శిల్పాన్ని వీరగల్లు అంటారు. వారికి గుర్తుగా వేయించిన ఎన్నో శిల్పాలు వెలుగుచూస్తూనే ఉంటాయి. అలా ఓ వీరగల్లు శిల్పం ఇప్పుడు కొత్తగా కనిపించింది. తాజాగా దొరికిన శిల్పంలో ఓ కథను చెబుతున్నట్లు నాలుగు వరుసల్లో వేట దృశ్యాలను నిక్షిప్తం చేసిన తీరు ఆకట్టుకుంటోంది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెట్ట ప్రాంతంలో ఎక్కడ చూసినా అలనాటి చరిత్రకు సాక్ష్యాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ ఊరి పొలిమెరలో ఉన్న శిల్పం తాజాగా వెలుగు చూసింది. దాన్ని ఓ దేవుడి విగ్రహం తరహాలో స్థానికులు ఆరాధిస్తున్నారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ ఇటీవల దాన్ని పరిశీలించి వీరగల్లు శిల్పంగా గుర్తించారు. దాన్ని ఔత్సాహిక పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ పరిశీలించి వీరగల్లుగా నిర్ధారించారు. వేటాడుతూ.. నేలకొరుగుతూ..! ఓ వీరుడు తన సహాయకులు, వేట కుక్కలతో కలసి వేటకు వెళ్లటం, అడవి పందులను వేటాడే క్రమంలో గాయపడటం, ఆ తర్వాత నేలకొరగటం, అతడిని బతికించాలన్నట్లు ఓ మహిళ (భార్య కావొచ్చు) అమ్మ వారిని వేడుకోవటం, ఆ తర్వాత భటులు అడవి పందులపై విరుచుకుపడి వాటిని వధించటం.. ఇలా వరుసగా చిత్రాలు ఆ శిల్పంలో కనిపిస్తున్నాయి. నాలుగు వరసల్లో ఉన్న ఆ చిత్రాలను చూస్తే ఈ గాథ కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఆ కథకు ఎలాంటి ఆధారం లేకున్నా.. ఆ చిత్రాలు దాన్ని చెబు(చూపు)తున్నాయి. ఆ చిత్రాల్లోని కొన్ని గుర్తులు అవి జైన మతానికి సంబంధించినవన్న అభిప్రాయం కలుగుతోందని, ఈ శిల్పం దాదాపు 11వ శతాబ్దం నాటిది అయి ఉంటుందని హరగోపాల్ అంటున్నారు. ఈ ప్రాంతంలో జైనం వర్ధిల్లిన దాఖలాలుండటం కూడా దీనికి బలం చేకూరుస్తోందన్నది ఆయన మాట. గతంలో వీరగల్లు శిల్పాలు దొరికినా.. ఇలా ఓ కథ చెబుతున్నట్టు వరుసలుగా చిత్రాలుండటం మాత్రం అరుదేనని పేర్కొన్నారు. గుర్రంపై వేటకు బయల్దేరిన వీరుడు పైవరుసలో దర్పంగా కనిపిస్తున్నాడు. ఆ వెనక ఛత్రం పట్టుకున్న సైనికుడు, కింద వేట కుక్కలు లంఘిస్తున్న తీరు కనిపిస్తున్నాయి. అతడు ఓ పక్కకు ఒరుగుతున్న చిత్రం, ఆ పక్కనే ఓ మహిళ తన ఎడమ చేతిని నడుముపై ఉంచుకుని కుడి చేతితో దేవతకు ఏదో అర్పిస్తున్న చిత్రం, రెండు చేతుల్లో ఫలాలు పట్టుకుని, తలపై సర్పాకృతి ఉన్న దేవత రూపం, పక్కన వేట కుక్క, అడవిపందిపై కుక్క దాడి రెండో వరుసలో ఉన్నాయి. మూడో వరసలో.. చెట్టెక్కిన భటుడు, అతడి పక్కన విల్లంభులతో మరొకరు, ముందు లేడి, దానిపక్కన అడవి పందిపై వేటకుక్కల దాడి చిత్రాలున్నాయి. నాలుగో వరుసలో నాలుగు కుక్కలు ఓ అడవి పందిని చుట్టుముట్టిన చిత్రముంది. -
భయం.. భయం
ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట : ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థకు చేరాయి. ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ అందులోనే విధులు నిర్వహిస్తున్నారు. అసలే వర్షకాలం.. చిరుజల్లులకే పైకప్పుల నుంచి నీళ్లు కారుతున్నాయి.. పెచ్చులూడి పడుతున్నాయి. వరుస వర్షాలతో ఎప్పుడూ కూలుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. గాంధారి మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయ భవనం ప్రమాదకరంగా మారింది. పైకప్పు పెచ్చులూడి వర్షం నీళ్లు కిందకు కారుతున్నాయి. పుస్తకాలను ఎలా భద్రపరచాలో అర్థం కాక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని పాత భవనం శిథిలమైంది. దీన్ని తొలగించడం లేదు. ఉత్తునూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల, ఎల్లారెడ్డి పట్టణంలోని ఎస్టీవో కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం కూలేందుకు సిద్ధంగా ఉంది. వరండాలో పైకప్పు నుంచి పూర్తిగా పెచ్చులూడిపోయాయి. సదాశివగనర్ మండల కేంద్రంలోని హైస్కూల్‌తో పాటు భూంపల్లి, అడ్లూర్ ఎల్లారెడ్డి హైస్కూళ్ల భవనాలు ప్రమాదకరంగా మారాయి. తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్, క్రిష్ణాజివాడి, నందివాడ తదితర పాఠశాలలకు చెందిన తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. 70 ఏళ్ల క్రితం కట్టిన భవనంలోనే ఎర్రపహాడ్ ప్రాథమిక పాఠశాల నిర్వహిస్తున్నారు. ఇది ఎప్పుడు కూలుతుందో తెలియక విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనతో గడుపుతున్నారు. బాల్కొండ మోర్తాడ్/కమ్మర్పల్లి/వేల్పూర్ : బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పాత భవనాలు కూలేందుకు సిద్ధమయ్యాయి. వీటిని తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మోర్తాడ్ మండలంలోని పాలెం ప్రాథమికోన్నత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుత వర్షాలతో అది మరింత ప్రమాదకరంగా మారింది. పశువైద్యశాల భవనం కూడా శిథిలావస్థకు చేరింది. కమ్మర్పల్లి మండలంలోని చౌట్పల్లి జెడ్పీ హైస్కూల్ భవనం ప్రమాదకరంగా మారింది. తరగతి గదుల్లో స్లాబు పెచ్చులూడి ఇనుప చువ్వలు తేలాయి. గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. భారీ వర్షాలకు కూలిపోయే ప్రమాదం ఉంది. వేల్పూర్ మండల కేంద్రంలో చాలా ఏళ్ల క్రితం నిర్మించిన పశు వైద్యశాల కూలేందుకు సిద్ధమైంది. ప్రమాదకరంగా మారిన ఈ భవనంలోనే ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ అర్బన్ : నగరంలో పురాతన భవనాలు ప్రమాదకరంగా మారాయి. ఏళ్ల కిందట నిర్మించిన నివాస గృహాలు శిథిలావస్థకు చేరాయి. కోటగల్లి, గాజులపేట, మార్వాడి గల్లీ, కసాబ్‌గల్లీ, అశోక్ వీధి, జెండా గల్లీ, మైసమ్మవీధి, పెద్దబజారు ప్రాంతాల్లో ఎక్కువగా పురాతన కట్టడాలు ఉన్నాయి. అప్పట్లో మట్టితో నిర్మించిన ఇళ్లు కాలం చెల్లాయి. ప్రస్తుత వర్షాలకు అవి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవల ఆశోక్వీధిలో ఓ పురాతన భవనం కూలిపోయింది. ఇలాంటి ఇళ్లను ఇప్పటికే గుర్తించిన అధికారులు వాటిని ఖాళీ చేయించారు. అయితే, వాటిని తొలగించడంలో మాత్రం జాప్యం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల భవనాలు శిథిలావస్థకు చేరాయి. కలెక్టరేట్లోని పలు భవనాలు సహా నిజామాబాద్ తహసీల్దార్ కార్యాలయం ప్రమాదకరంగా మారింది. ఉద్యోగులు భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు. పెద్దబజారులోని యూనాని ఆసుపత్రి పాత భవనంలోనే కొనసాగుతోంది. ఆర్మూర్.. ఆర్మూర్అర్బన్/మాక్లూర్/నందిపేట : నియోజకవర్గంలోని పలు మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ప్రమాకరంగా మారాయి. ఆర్మూర్ మండలంలోని ఇస్సాపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. 1968లో నిర్మించిన ఈ భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. ఆర్మూర్‌లోని ఎన్ఆర్ఈజీఎస్, వీఆర్వో కార్యాలయాలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియక ఉద్యోగులు భయంభయంగా విధులు నిర్వహిస్తున్నారు. మాక్లూర్ మండల కేంద్రంలోని ట్రాన్స్‌కో కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దీంతో అధికారులు ఆ కార్యాలయంలో పనులు చేయాలంటే జంకుతున్నారు. నందిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల భవనాలు ప్రమాదకరంగా మారాయి. మండలంలోని వెల్మల్ గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం శిథిలావస్థకు చేరి ఏళ్లు గడుస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అలాగే శాపూర్‌లోని ప్రాథమిక పాఠశాల, నందిపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల తరగతి గదులు కూలేందుకు సిద్ధమయ్యాయి. కామారెడ్డి.. కామారెడ్డి : నియోజకవర్గంలో చాలా భవనాలు కూలే దశకు చేరాయి. నిజాం కాలంలో నిర్మించిన కట్టడాల్లో ఇంకా కార్యాలయాలు కొనసాగిస్తున్నారు. ఆ భవనానికి కాలం చెల్లిందని ఎప్పుడో నిర్ధారించారు. అందులో ఉన్న తహసీల్ కార్యాలయాన్ని మార్చారు కూడా. కానీ అదే భవనంలో ఓ మూలన ఉప కోశాధికారి (సబ్ ట్రెజరీ) కార్యాలయం మాత్రం కొనసాగుతోంది. నిజాం కాలంలో నిర్మితమైన ఈ భవనాన్ని కాలం చెల్లిన భవనాల జాబితాలో చేర్చారు. అందుకే తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని క్లబ్ భవనంలోకి మార్చారు. అయితే సబ్ ట్రెజరీ కార్యాలయం విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదు. వర్షం కురిసినప్పుడు కార్యాలయంలోని గదుల్లోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. కూలిపోతుందనే వాస్తవం తెలిసినప్పటికీ కార్యాలయాలను కొనసాగిస్తుండడం మనోళ్లకే చెల్లింది. పైగా, ప్రమాదకరంగా మారిన ఈ భవనంలోకే కొత్తగా ఎక్సైజ్ కార్యాలయాన్ని మార్చనున్నారని సమాచారం. బోధన్ : నియోజకవర్గంలో పలు కట్టడాలు అవసాన దశకు చేరాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని ఈ కట్టడాల్లోనే ఇంకా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బోధన్‌లోని శక్కర్‌నగర్ నిజాంషుగర్ ఫ్యాక్టరీ గేట్‌కు ఎదురుగా దశాబ్దాల క్రితం నిర్మించిన జనరల్ ఆస్పత్రి బహుళ అంతస్తుల భవనం కూలిపోయే దశలో ఉంది. ఈభవనంలోనే ప్రస్తుతం ఎన్ఎస్ఎఫ్ కోర్ కమిటీ కార్యాలయం కొనసాగుతోంది. శక్కర్‌నగర్‌లోని ఎంవీఐ కార్యాలయం భవనం రాకాసీపేట్ ప్రాంతంలో పశువైద్యశాల భవనం, పాత మున్సిపల్ ఆఫీసు భవనం, ఆర్‌డబ్ల్యూస్ డివిజన్ కార్యాలయంతో పాటు పలుచోట్ల ప్రభుత్వ పాఠశాలల భవనాలు, కళాశాలల భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఆర్టీసీ కొత్త బస్టాండ్‌లో నిజామాబాద్ వెళ్లే ప్లాట్ ఉన్న రేకుల షెడ్డు కూలిపోయే దశకు చేరింది. నియోజకవర్గంలో 82 గ్రామ పంచాయతీలుండగా, ఇందులో సగానికి పైగా పంచాయతీ కార్యాలయాలు శిథిలావస్థకు చేరాయి. నవీపేట మండల కేంద్రంలో పీహెచ్సీ భవనం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా ఉంది. పలు గ్రామాల్లో పురాతన కాలంలో నిర్మించిన మట్టి బురుజులు ప్రమాదకరంగా మారాయి. 2014లో బోధన్ మండలంలోని హున్సాలో జనావాసాల మధ్య ఉన్న మట్టి బురుజు సగభాగం విరిగి పడింది. మట్టి బురుజులను తొలగిస్తామని అప్పట్లో హామీ ఇచ్చిన అధికారులు ఇంతవరకు అమలు చేయలేదు. మరోవైపు, ప్రమాదకరంగా మారిన పాత భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలను సర్వే ద్వారా గుర్తించారు కానీ, ఇంతవరకు తొలగించే ప్రక్రియ చేపట్టలేదు. -
పురాతన భవనాల కూల్చివేత
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని శిథిలావస్థలో ఉన్న పురాతన భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఈ ప్రాంతంలోని కూలిపోయే దశలో ప్రమాదకరంగా ఉన్న భవనాలను జీహెచ్ఎంసీ అధికారులు కొన్ని రోజులుగా కూల్చివేస్తున్నారు. గురువారం సర్కిల్-18 పరిధిలోని చిలకలగూడలో జేసీబీలతో పురాతన కట్టడాల కూల్చివేత ప్రారంభించారు. వారికి రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సాయపడుతోంది. -
చినుకు పడితే గుండె దడ దడ
వర్షాలు, గాలులకు తోడు భయపెడుతున్న పురాతన భవనాలు నగరంలో అధికారులు గుర్తించినా కూల్చనివి 274 నిర్లక్ష్యం వీడకపోతే ప్రాణనష్టం తప్పదంటున్న నిపుణులు సిటీబ్యూరో: క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో నగరంలో బుధవారం మళ్లీ గాలివాన బీభత్సం సృష్టించింది. ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 100 కి.మీ ప్రచండ వేగంతో ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల భారీ వృక్షాలు విరిగిపడడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. విద్యుత్ తీగలు తెగిపడడంతో పలు శివారు ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. ఎస్.ఆర్.నగర్ బీకేగూడాలో ఓ భారీ వృక్షం కూలి ఆటో ధ్వంసమైంది. సనత్‌నగర్ బస్టాప్ వద్ద ఓ దుకాణంపై భారీ వృక్షం కూలింది. అశోక్‌నగర్ కాలనీలో ఓ భవనంపై ఉన్న రేకులు ఎగిరి పక్కనే ఉన్న పెంకుటిల్లుపై పడడంతో ఆ ఇల్లు ధ్వంసమైంది. బేగంపేట్ రసూల్‌పురా భరణి కాంప్లెక్స్ వద్ద ఓ భారీ వృక్షం కూలి మూడు కార్లు ధ్వంసమయ్యాయి. సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులో ఓ భారీ వృక్షం కూలి రెండు కార్లు ధ్వంసమయ్యాయి. గాలివాన బీభత్సం నేపథ్యంలో బుధవారం సాయంత్రం జీహెచ్ఎంసీ మేయర్, వివిధ విభాగాల నోడల్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. జీహెచ్ఎంసీ అత్యవసర కాల్ సెంటర్‌కు అందిన ఫిర్యాదుల్లో.. విద్యుత్ సరఫరాలో అంతరాయంపై 26 ఫిర్యాదులు, చెట్లుకూలిన ఘటనపై 27 ఫిర్యాదులు అందినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. తక్షణం ఆయా సమస్యలను పరి ష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్ధన్‌రెడ్డి సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. కాగా సాయంత్రం 8.30 గంటల వరకు1.06 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. ట్రాఫిక్ జాంఝాటం.. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా గాలివాన రావడంతో అబిడ్స్, కోఠి, నాంపల్లి, లక్డికాపూల్, పంజగుట్ట, ఖైరతాబాద్, ఎస్.ఆర్.నగర్, అమీర్‌పేట్, సికింద్రాబాద్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో వర్షపునీరు రహదారులపై నిలిచి ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. వాహనదారులు, ఉద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు ట్రాఫిక్‌లో చిక్కుకొని విలవిల్లాడారు. ఆలస్యంగా ఇళ్లకు చేరుకున్నారు. కాగా మధ్యాహ్నం గరిష్టంగా 40.5 డిగ్రీలు, కనిష్టంగా 28.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ 89 శాతంగా నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రాగల 24 గంటల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఎమర్జెన్సీ కంట్రోల్‌రూమ్‌కు ఫిర్యాదులు బుధవారం సాయంత్రం కురిసిన వాన, ఈదురుగాలుల వల్ల 30 ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలిగినట్లు, 25 చెట్లు కూలిపోయినట్లు జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ కంట్రోల్‌రూమ్‌కు ఫిర్యాదులందాయి. దాంతో వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణశాఖ ద్వారా అందిని హెచ్చరికలతో ఎమర్జెన్సీ కంట్రోల్‌రూమ్‌కు చేరుకోవాల్సిందిగా ఆయా విభాగాల నోడల్ అధికారులకు సమాచారమిచ్చారు. కేవలం పదినిమిషాల్లోనే తక్షణ చర్యలు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించారని పేర్కొన్నారు. సీతాఫల్మండి, జూబ్లీహిల్స్, చిలుకలగూడ, లోయర్‌ట్యాంక్‌బండ్, ముషీరాబాద్ ఎమ్మార్వో కార్యాలయం, బంజారాహిల్స్ రోడ్డునెంబర్ 12 తదితర ప్రాంతాల్లో కూలిన చెట్లను వెంటనే తొలగించినట్లు పేర్కొన్నారు. ఓయూ క్యాంపస్‌లో కూలిన చెట్లు గాలివానతో బుధవారం ఓయూ క్యాంపస్ అతలాకుతలం అయింది. విపరీతమైన గాలికి పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగి కిందపడగా, కరెంట్ తీగలు తెగి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. టెక్నాలజీ విద్యార్థుల హాస్టల్ పైకప్పుపై చెట్టు విరిగిపడడంతో సిమెంట్ రేకులు విరిగిపోయాయి. దీంతో వర్షం నీరు హాస్టల్ గదుల్లోకి ప్రవేశించి విద్యార్థుల పుస్తకాలు, దుస్తులు, ఇతర వస్తులు తడిచిపోయాయి. -
మహాబలిపురానికి మహర్దశ
చెన్నై: తమిళనాడులోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా నిలిచి చారిత్రాత్మక నేపధ్యం కలిగిన మహాబలిపురానికి మహర్దశ పట్టనుంది. సముద్రతీరంలో వెలిసిన మహాబలిపురంలోని ప్రకృతి రమణీయ దృశ్యాలకు ప్రపంచస్థాయి గుర్తింపురానుంది. బండరాళ్లపై చెక్కిన అద్భుత శిల్ప సౌందర్యానికి అందలమంతటి గౌరవం దక్కనుంది. చెన్నైకి దక్షిణాన 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాబలిపురం కాంచీపురం జిల్లా పరిధిలో ఉంది. ఒకప్పుడు మామల్లపురంగా ఉండి క్రమేణా మహాబలిపురంగా మారింది. భారతీయులు తమ వర్తక, వాణిజ్య కార్యకలాపాలకు ఇక్కడి సముద్రమార్గం గుండా వెళ్లేవారు. 7వ దశాబ్దంలో దక్షిణభారతదేశాన్ని ఏలిన ప్రముఖ మహారాజులైన పల్లవులు మహాబలిపురాన్ని నిర్మించనట్లు చరిత్ర చెబుతోంది. ఎంతో కళాత్మక దృష్టి కలిగిన పల్లవరాజులు ఎందుకూ పనికిరాని బండరాళ్ల నుండి అధ్బుత శిల్ప సౌందర్యాన్ని వెలికితీసారు. నృత్యభంగిమలు, ఏనుగులు, గుహలు, ఆలయ గోపురాలు ఇలా వేలాదిగా శిల్ప సౌందర్యం పల్లవరాజుల కళాతృష్టకు అద్దం పడుతుంది. ఒక బ్రిటీష్ రాజు ఇక్కడి ప్రాచీన శిల్పసౌందర్యాలకు 1827లో మరింతగా మెరుగులు దిద్దారని తెలుస్తోంది. ప్రస్తుత 21 వ శతాబ్దంలోనూ ఇక్కడికి చేరుకునే సందర్శకులను అబ్బురపరుస్తోంది. సముద్ర తీరంలో ఉండటం వల్ల అక్కడి అలల ఘోష శ్రావ్యమైన సంగీతంగా మారిపోతుంది. విదేశాల నుండి వచ్చే పర్యాటకుల్లో అధికశాతం మహాబలిపురాన్ని సందర్శించకుండా వెళ్లరు. విదేశీయులు ఇక్కడి హోటళ్ల రోజుల కొద్దీ బసచేసి మహాబలిపురం ఆందాలను తమ కెమారాల్లో బంధిస్తుంటారు. దేశ విదేశాల నుండి వచ్చే పర్యాటకులతో మహాబలిపురం ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటుంది.ప్రపంచంలోని అతిముఖ్యమైన హెరిటేజ్ ప్రాంతంగా మహాబలిపురాన్ని యునెస్కో చేర్చింది. ప్రపంచ ప్రజలను ఆకర్షించేస్థాయిలో మెచ్చదగిన పర్యాటక ప్రదేశంగా యునెస్కో గుర్తించింది. అంతేగాక దీనికి మరింత మెరుగులు దిద్ది అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించేందుకు సిద్దం అయింది. శిల్పకళా సౌందర్యం వెల్లివిరిసే ప్రాంతాలను గుర్తించేందుకు చైనా, బంగ్లాదేశ్, కువైట్ దేశాలను పర్యటించిన యునెస్కో లోని 8 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి బృందం ఇటీవల భారత్‌కు వచ్చిన సమయంలో మహాబలిపురాన్ని సంద ర్శించింది. ఒక ప్రయివేటు సంస్థకు చెందిన థియేటర్లో మహాబలిపురంపై చిత్రీకరించిన త్రీడీ యానిమేషన్ చిత్రాన్ని తిలకించింది. -
ప్రాచీన కట్టడాలను పరిశీలించిన సినీ సమీక్షకులు రంగారావు
ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలలో ఉన్న ప్రాచీన కట్టడాల చరి త్రను పరిశీలించి వివరాలు సేకరించడంలో భాగంగా భారతీయ సినీ, లలిత, సంగీత సుప్రసిద్ధ సమీక్షకులు చైన్నైవాసి వీఏకే రంగారావు సోమవారం ఆర్మూర్ పట్టణాన్ని సందర్శించారు. సిద్దుల గుట్ట చరిత్రను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని మహాలక్ష్మి కాలనీ లో ఉన్న నవలా రచయిత డాక్టర్ నందిని రామరాజు దంపతుల ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రముఖ కట్టడాలను సందర్శించి వాటి చరిత్ర, ప్రాముఖ్యతను తెలుసుకున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని ఖిల్లా కోట, బాల్కొండ కోట, దోమకొండ కోటలతో పాటు చారిత్రక కట్టడాల గురించిన సమాచారాన్ని సేకరించామన్నారు. అదే విధంగా ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ కోట, కుంటాల, పొచ్చెర జలపాతాలను సందర్శించామన్నారు. అనంతరం నందిని రామరాజు దంపతులు, జిల్లా క్లాసిక్ సినిమా, కల్చరల్ సొసైటీ ప్రతినిధులు మేక రామస్వామి, వీపీ చందన్ రావు, చిటిమల విద్యాసాగర్ ఆయనను ఘనంగా సన్మానించారు. -
పంచలోహ విగ్రహాలు చోరీ
వాచ్‌మెన్‌ను నిర్బంధించి చోరీకి పాల్పడిన దుండగులు బద్వేలుఅర్బన్: మున్సిపాలిటీ పరిధిలోని చెన్నం పల్లె సమీపంలో ఉన్న పురాతన ఆది చెన్నకేశవ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. దుండగులు ఆలయంలోని వాచ్‌మెన్‌ను నిర్బం ధించి భూదేవి, శ్రీదేవి సమేత చెన్నకేశవస్వామి పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారు. వివరాలిలా ఉన్నాయి. మట్లిరాజుల కాలంలో 15వ శతాబ్దంలో నిర్మించబడి పురాతన ఆలయంగా ప్రసిద్ధికెక్కిన ఆది చెన్నకేశవస్వామి ఆలయంలో భూదే వి, శ్రీదేవి సమేత ఆదిచెన్నకేశవస్వామి పంచలోహ ఉత్సవ విగ్రహాలు ఉన్నా యి. ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాలలో విగ్రహాలను బయట ఉంచి కల్యాణోత్సవం జరిపిస్తారు. అంతేగాకుండా రథోత్సవంలో ఊరేగిస్తారు. మిగిలిన రోజులలో ఆలయంలోని మూల విరాట్ సమీపంలో పంచలోహ విగ్రహాలను ఉంచుతారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఆలయంలో ప్రవేశించిన కొం దరు దుండగులు వాచ్మెన్ నరసింహులును నిర్బంధించి ఆలయంలోని ఉత్సవ విగ్రహాలను ఎత్తుకెళ్లారు. తెల్లవారిన తర్వాత ఆలయం తలుపులు తెరచి ఉండడంతో అనుమానం వచ్చిన స్థానికులు లోనికి వెళ్లి చూశారు. వాచ్మెన్ నిర్బం దించి ఉండడంతో వెంటనే అతని చేతుల కు తాళ్లను ఊడదీసి విచారించగా జరిగిన విషయం తెలిపారు. స్థానికులు ఆలయ చైర్మన్ పెద్దిరెడ్డి పద్మనాభరెడ్డికి సమాచారం అందజేయడంతో వెంటనే ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సీఐ వెంకటప్ప, ఐడి పార్టీ సిబ్బందితో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే విజయ మ్మ కూడా పరిశీలించి చోరీ జరిగిన తీరును సీఐని అడిగి తెలుసుకున్నారు. డాగ్‌స్క్వాడ్ పరిశీలన చోరీ జరిగిన ఆలయ పరిసరాలను కర్నూలుకు చెందిన పోలీసు జాగిలం పరిశీలించినట్లు సీఐ వెంకట ప్ప తెలిపారు. తొలుత ఆలయంలోకి ప్రవేశించి అక్కడి నుంచి నేరుగా ఆలయం వెనుకభాగంలో ఉన్న ప్రదేశంలో తిరిగి అక్కడి నుంచి చెరువుకట్ట వెంబడి కొద్ది దూరం వెళ్లి తిరిగి ఆలయంలో విగ్రహాలు ఉంచే ప్రాంతానికి చేరుకున్నట్లు ఆయన తెలిపారు. దేవాదాయ శాఖ మేనేజర్ ఎం. శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
కాలు కదిపితే కాసులు రాల్చే కెరీర్.. డ్యాన్సింగ్
నాట్యం, నృత్యం.. ప్రాచీన కళలు. ఆదిమ మానవుల కాలంలోనే ఇవి ప్రాణం పోసుకున్నాయి. మనిషి జ్ఞానవంతుడిగా మారాక మరింత అభివృద్ధి చెందాయి. కాలానుగుణంగా ఆధునిక హంగులద్దుకున్నాయి. ప్రపంచంలో అన్ని మానవ జాతుల్లో నృత్యం విడదీయలేని భాగం. మనసుకు ఆనందం, ఉత్తేజం కలిగించే శక్తి డ్యాన్స్‌కు ఉంది. అందుకే కళాతృష్ణ ఉన్న ప్రతిఒక్కరూ నృత్యంపై మక్కువ కనబరుస్తుంటారు. నేడు ఎన్నో రకాల వేడుకల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థల కార్యక్రమాల్లోనూ వీటికి చోటు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నృత్యకారులకు అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు సినిమా, టీవీ రంగాలు ప్రతిభావంతులకు స్వాగతం పలుకుతున్నాయి. నృత్యంపై ఆసక్తి ఉన్నవారు దీన్ని కెరీర్‌గా ఎంచుకుంటే జీవనానికి ఢోకా ఉండదని కచ్చితంగా చెప్పొచ్చు. మెండుగా అవకాశాలు, ఆదాయం కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడిస్సీ వంటి సంప్రదాయ నృత్యరీతులతోపాటు సల్సా, జాజ్, వెస్ట్రన్ క్లాసికల్, హిప్హాప్ వంటి విదేశీ కళారూపాలపై యువత ఆసక్తి చూపుతోంది. డిమాండ్‌కు తగ్గట్లు నగరాలు, పట్టణాల్లో డ్యాన్స్ స్కూల్స్ ఏర్పాటయ్యాయి. నాట్యం, నృత్యాన్ని పూర్తి స్థాయి ఉపాధి మార్గంగా మార్చుకోవడం ఒక ట్రెండ్‌గా మారింది. పెరుగుతున్న అవకాశాలే ఇందుకు నిదర్శనం. వివాహ వేడుకలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల సమావేశాలు, సదస్సుల్లో అతిథులను అలరించేందుకు నృత్య కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. డ్యాన్సర్లకు ఆకర్షణీయమైన వేతనం ఆఫర్ చేస్తున్నారు. ఒక్కో ప్రోగ్రామ్‌కు రూ.వేలల్లో సంపాదించుకునే వీలుంది. దీనికితోడు పేరు ప్రఖ్యాతలు, సన్మానాలు, పురస్కారాలు, బహుమానాలు ఉండనే ఉన్నాయి. కళాకారులను సత్కరించుకోవడం మన సంస్కృతిలో భాగం. పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలు అందుకున్న నృత్యకారులు మన దేశంలో ఎందరో ఉన్నారు. డ్యాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకుంటే సమాజంలో సెలబ్రిటీ హోదాను అందుకోవచ్చు. వేదికలపై ప్రతిభ చూపి, సినీ రంగంలో కాలుమోపితే అవకాశాలకు, ఆదాయానికి కొదవే ఉండదు. కావాల్సిన నైపుణ్యాలు: డ్యాన్సర్‌కు నృత్యంపై అభిరుచి ఉండాలి. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నిత్యం క్రమశిక్షణతో సాధన చేయగలగాలి. ప్రతిరోజూ కనీసం 6 నుంచి 8 గంటలపాటు ప్రాక్టీస్ చేయాలి. నూతన నృత్య రీతులను నేర్చుకుంటూ ప్రతిభను మెరుగుపర్చుకోవాలి. ఇందుకు అంకితభావం, కష్టపడేతత్వం తప్పనిసరిగా ఉండాలి. అర్హతలు: ఎలాంటి విద్యార్హతలు లేకపోయినా నృత్యం నేర్చుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా ఈ రంగంలో అడుగుపెట్టొచ్చు. అయితే, డ్యాన్స్‌ను మనస్ఫూర్తిగా ప్రేమించి, ఆరాధించేవారే ఇందులోకి రావడం మంచిది. నృత్యకారులుగా రాణించాలంటే దీనిపై సహజమైన ఆసక్తి, ప్రతిభ ఉండాలి. ప్రొఫెషనల్ డ్యాన్సర్‌గా ఎక్కువ కాలం మనుగడ సాగించాలంటే నిరంతర సాధనే ఏకైక మార్గం. దీన్ని మించిన ప్రత్యామ్నాయం లేదు. వేతనాలు: డ్యాన్సర్లకు ప్రారంభంలో తక్కువ వేతనాలే ఉన్నా అనుభవం పెరుగుతున్న కొద్దీ ఆదాయం కూడా అదేస్థాయిలో పెరుగుతుంది. ఒక్కో కార్యక్రమానికి రూ.3 వేల వరకు అందుకోవచ్చు. మంచి డ్యాన్సర్‌గా పేరుతెచ్చుకుంటే నెలకు రూ.50 వేలకు పైగానే సంపాదించుకోవచ్చు. సినిమా రంగంలో ఎక్కువ వేతనాలు ఉంటాయి. ప్రతిభతో కొరియోగ్రాఫర్ స్థాయికి చేరుకుంటే రూ.లక్షల్లో రెమ్యూనరేషన్ పొందొచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్స్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం-హైదరాబాద్ వెబ్సైట్: http://teluguuniversity.ac.in/ స్టెప్స్ డ్యాన్స్ స్టూడియో-హైదరాబాద్ వెబ్సైట్: www.stepsdanz.com షియామక్ దావర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ వెబ్సైట్: www.shiamak.com/dance-school-about.html ద డ్యాన్స్ వర్క్స్. వెబ్సైట్ : www.thedanceworx.com సల్సా ఇండియా. వెబ్సైట్: www.salsa-india.com ఫిట్నెస్తోపాటు మంచి అవకాశాలు ‘‘ఆధునిక కాలంలో వివిధ నృత్యాలను నేర్చుకుంటే కెరీర్‌కు ఢోకా ఉండదు. సినీ రంగంలో, సంగీత పోటీలు, స్కూళ్లలో, ఇతర వేదికలపై ఫ్రీస్టైల్స్ నృత్య నిపుణులకు అవకాశా లుంటాయి. అలాగే హిప్హాప్, బాల్రూమ్, సల్సా తదితర స్టైల్స్‌లో నైపుణ్యం సాధిస్తే అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందుకోవచ్చు. కార్పొరేట్ కంపెనీలు కూడా తరచుగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తుంటాయి. ఫిట్నెస్తోపాటు మంచి కెరీర్‌ను కూడా డ్యాన్స్ ద్వారా సొంతం చేసుకోవచ్చు’’ - పృథ్వీరాజ్ రామస్వామి, డెరైక్టర్, స్టెప్స్ డ్యాన్స్ స్టూడియో -
మార్కుల సాధనలో ‘చరిత్ర’ను తిరగ రాయాలి!
జంపాన సుధాకర్, డెరైక్టర్, ప్రతిభ కోచింగ్ సెంటర్, విజయవాడ. స్కూల్ అసిస్టెంట్ చరిత్ర (ఏజీటౌ్టటడ) ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర; మధ్యయుగ భారతదేశ చరిత్ర; ఆధునిక భారతదేశ చరిత్ర; దక్షిణ భారతదేశ రాజ్యాలు; 6, 7 తరగతుల సిలబస్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ చరిత్ర అంశాలు; ప్రపంచ నాగరికతలు; మధ్యయుగ, ఆధునిక ప్రపంచ చరిత్రలకు సంబంధించిన అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయాలి. పాఠ్యాంశాలు చరిత్ర అధ్యయనం: ఇందులో కాంస్య యుగపు నాగరికత, ప్రాచీన ఇనుప నాగరికత సమాజాలు, మధ్యయుగంలో ప్రపంచం తదితర అంశాలపై దృష్టిసారించాలి. ప్రాచీన భారతీయ నాగరికతలు: ఇందులో సింధులోయ నాగరికత (హరప్పా సంస్కృతి), ఆర్య నాగరికత, తొలి వేద నాగరికత, మలివేద నాగరికత తదితర అంశాలుంటాయి. క్రీ.పూ.6వ శతాబ్దం-రాజకీయ, సామాజిక పరిణామాలు ఈ విభాగంలో వర్ధమాన మహావీరుడు-జైనమతం; బౌద్ధమతం-గౌతమబుద్ధుడు అంశాలు ముఖ్యమైనవి. భారతదేశ చరిత్ర (క్రీ.పూ.200 -క్రీ.శ.300): దీనికి సంబంధించి మగధ రాజ్యం, పారశీక, గ్రీకు దండయాత్రలు, మౌర్య సామ్రాజ్యం, ఆంధ్ర శాతవాహనులు, సంగం యుగం, కుషాణులు తదితర అంశాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. తర్వాతి కాలానికి సంబంధించి గుప్త సామ్రాజ్యం, పుష్యభూతి వంశం (హర్షవర్ధనుడు) అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. దక్కన్, దక్షిణ భారతదేశ రాజ్యాల పాఠ్యాంశంలోని చాళుక్యులు, చోళులు, పల్లవులు, యాదవులు తదితర అంశాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. భారతదేశంపై మహమ్మదీయుల దండయాత్రలు: అరబ్బుల దండయాత్ర నాటికి భారతదేశ పరిస్థితులు, తరుష్క దండయాత్రలు, మహమ్మద్ గజనీ, మహమ్మద్ ఘోరీల దండయాత్రలు; వాటి ఫలితాలు; ప్రభావాల గురించి తెలుసుకోవాలి. భారతదేశం (1206-1526): ఈ పాఠ్యాంశంలో ఢిల్లీ సుల్తానులకు సంబంధించి బానిస వంశం, ఖిల్జీలు, తుగ్లక్‌లు, సయ్యద్‌లు, లోఢీల గురించి చదవాలి. ఢిల్లీ సుల్తానుల పతనం, సూఫీ భక్తి ఉద్యమాలు, భారతీయ సంస్కృతిపై ఇస్లాం ప్రభావం తదితర అంశాలు ముఖ్యమైనవి. భారతదేశ సాంస్కృతిక వారసత్వం- మేధోపరమైన జాగృతి చారిత్రక నేపథ్యం, భారతదేశ చరిత్ర, ప్రత్యేక లక్షణాలు, కళ, వాస్తు శిల్పం, విద్య-తత్వశాస్త్రాల అభివృద్ధి, జాతీయ చైతన్యం, భారతదేశంపై విదేశీ సంస్కృతుల ప్రభావం, ఆంగ్ల విద్య ప్రభావం, 1857 తిరుగుబాటు వంటి అంశాలను చదవాలి. దక్షిణ భారతదేశ రాజ్యాలు కాకతీయులు: కాకతీయుల చరిత్రకు ఆధారాలు, కాకతీయుల వంశ చరిత్ర, ముఖ్యమైన రాజులు-పరిపాలనా కాలాలు, ఆర్థికాంశాలు, మతం-భాష, కాకతీయుల కాలం నాటి రచనలు ముఖ్యమైనవి. విజయనగర సామ్రాజ్యం: ఈ రాజ్యాన్ని పరిపాలించిన వంశాలు, భాషల ఆధారాలు, కన్నడ రచనలు, రాజ్యస్థాపన, విజయనగర సామ్రాజ్య రాజ్య పరిపాలన.. వారి పతనం ముఖ్యమైనవి. బహమనీ రాజ్యం: ఈ రాజ్యంలోని రాజుల్లో ఫిరోజ్‌షా, మూడో మహ్మద్ షా ప్రముఖులు. ప్రధానంగా మూడో మహ్మద్ షా పరిపాలనా గురించి తెలుసుకోవాలి. భారతదేశం (1858-1947) ఆంగ్లేయుల రాజకీయ, ఆర్థిక, సామాజిక విధానాలు, స్వదేశీ రాజులకు సంబంధించి బ్రిటిష్ వారి వైఖరి, పొరుగు రాజ్యాలతో బ్రిటిష్ సంబంధాలు ప్రధానమైనవి. భారతదేశంలో స్వాతంత్య్ర ఉద్యమం: ఈ పాఠ్యాంశం చాలా ముఖ్యమైంది. ఇందులో జాతీయవాదం-ఆవిర్భావం; ఆధునిక రవాణా, కమ్యూనికేషన్ల సాధనాల అభివృద్ధి, మితవాదులు, అతివాదులు, వందేమాతర ఉద్యమం, మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో భారతదేశం తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. హోంరూల్ ఉద్యమం, మహాత్మాగాంధీ-జాతీయోద్యమం, స్వాతంత్య్ర ఉద్యమ దశలు, రెండో ప్రపంచ యుద్ధం, క్విట్ ఇండియా ఉద్యమం (1942), మౌంట్‌బాటన్ ప్రణాళిక, స్వదేశీ సంస్థానాల విలీనం, భారతదేశంలో ఫ్రెంచి, పోర్చుగీసు వలసలకు విముక్తి మొదలైన అంశాలపై దృష్టిసారించాలి. మహాత్మా గాంధీ-జాతీయ ఉద్యమం చంపారన్ సత్యాగ్రహం, జలియన్ వాలాబాగ్ దురంతం, సహాయ నిరాకరణోద్యమం, స్వరాజ్యపార్టీ, హిందూస్థాన్ రిపబ్లిక్, లాహోర్ కుట్రకేసు, సైమన్ కమిషన్, కమ్యూనల్ అవార్డ్, 1935 భారత ప్రభుత్వ చట్టం-రాష్ట్రాల్లో మంత్రివర్గాలు, కాంగ్రేసేతర మంత్రివర్గాలు ముఖ్యమైన అంశాలు. ఉద్యమ దశలు మతతత్వాలు, గాంధీజీ చేసిన కృషి, సామ్యవాద సిద్ధాంతాలు-ఉద్యమాలు, భారత స్వాతంత్య్ర ఉద్యమం, ప్రపంచంలోని స్వాతంత్య్ర ఉద్యమాలు, స్వదేశీ సంస్థానాలలో స్వాతంత్య్ర ఉద్యమాలు ముఖ్యమైనవి. క్విట్ఇండియా ఉద్యమం: అజాద్ హింద్ ఫౌజ్, కేబినెట్ మిషన్ ప్లాన్, కేబినెట్ మిషన్ సభ్యులు, పాకిస్థాన్ విభజన కోరిక, తాత్కాలిక ప్రభుత్వం, రాజ్యసభ మొదలైనవి. ఆధునిక ప్రపంచం ఇందులో ఆధునిక యుగారంభం, పునరుజ్జీవనం, సాంకేతిక వైజ్ఞానికాభివృద్ధి, మత సంస్కరణోద్యమం, ప్రతిమత సంస్కరణోద్యమం, జాతీయ రాజ్యాల ఆవిర్భావం, నిరంకుశత్వాలకు వ్యతిరేకంగా పోరాటం మొదలైన అంశాలుంటాయి. పెట్టుబడిదారీ విధానం-పారిశ్రామిక విప్లవం పెట్టుబడిదారీ విధాన ముఖ్య లక్షణాలు, పెట్టుబడిదారీ విధానం-ప్రగతి, ఫలితాలు, శ్రామిక చైతన్యం ముఖ్యమైనవి. పారిశ్రామిక విప్లవ కాలపు ఆవిష్కరణలు, వ్యవసాయ విప్లవం, వ్యవసాయ విప్లవానికి కృషిచేసిన వారు, వాణిజ్య విప్లవం, వ్యాపార వాదం, పారిశ్రామిక విప్లవం ఇంగ్లండ్‌లో ప్రారంభమవడానికి కారణాలు, రైలు మార్గాలు, వార్తా ప్రసార సౌకర్యాలు, పారిశ్రామిక విప్లవ విస్తరణ, పారిశ్రామిక విప్లవ ఫలితాలు, వైజ్ఞానిక ఫలితాలు, కారల్ మార్క్స్ ముఖ్యమైనవి. ప్రపంచ విప్లవోద్యమాలు ఇందులో ప్రజాస్వామ్య జాతీయ ఉద్యమాలు, ఆంగ్లేయ మహా విప్లవం, అమెరికా విప్లవం, ఫ్రెంచి విప్లవం తదితర అంశాలుంటాయి. జాతీయవాద ఉద్యమాలు ఈ పాఠ్యాంశంలో నెపోలియన్ ఉన్నతి-పతనం, వియన్నా సమావేశం, 1830 ఫ్రెంచి విప్లవం, 1848 తిరుగుబాటు, జర్మనీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణ, సామ్యవాద ఉద్యమాలు, 1871 పారిస్ కమ్యూన్ తదితర అంశాలను చదవాలి. సామ్రాజ్య వాదం సామ్రాజ్యవాదం ఆవిర్భవానికి కారణాలు, సామ్రాజ్యవాద రూపాలు, పద్ధతులు, ఆఫ్రికా, ఆసియాల కోసం సంఘర్షణ వంటివి ప్రధానమైనవి. సమకాలీన ప్రపంచం ఇందులో మొదటి ప్రపంచ యుద్ధం-కారణాలు, ఫలితాలు, నానాజాతి సమితి, రష్యా విప్లవం, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం-విప్లవాత్మక మేధోపరమైన ఉద్యమాలు, బోల్షివిక్ పార్టీ-లెనిన్, 1905 విప్లవం, తిరుగుబాటు గమనం, అక్టోబర్ విప్లవం-యూఎస్ఎస్ఆర్ అవతరణ, రష్యా విప్లవ ప్రభావం వంటివి ముఖ్యమైనవి. రెండో ప్రపంచ యుద్ధం వరకు ప్రపంచం ఈ పాఠ్యాంశంలో ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో ఐరోపా, ఇటలీలో ఫాసిజం, జర్మనీలో నాజీయిజం, జపాన్‌లో సైనికవాదం, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత టర్కీ, నానాజాతి సమితి వైఫల్యం, స్పానిష్ అంతర్యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం కారణాలు-ఫలితాలు, యుద్ధం వల్ల ఏర్పడిన రాజకీయ, ఆర్థిక పరిణామాలు, ఐక్యరాజ్య సమితి, ప్రజా ఉద్యమాల ఆవిర్భావం, లాటిన్ అమెరికా అవతరణ తదితర అంశాలు ముఖ్యమైనవి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ: ఇందులో సైనిక కూటములు-ప్రచ్ఛన్న యుద్ధం, స్వతంత్ర దేశాల అభివృద్ధి, సమస్యలు, అలీనోద్యమం, ప్రపంచ శాంతి పరిరక్షణలో ఐక్యరాజ్య సమితి, నిరాయుధీకరణ, అణ్వస్త్రాల సమస్యలు, ప్రపంచంలో ప్రముఖ వ్యక్తులు తదితర అంశాలుంటాయి. మొగల్ సామ్రాజ్యం ఇందులో బాబర్ దండయాత్ర నాటికి భారతదేశ పరిస్థితి, బాబర్, హుమాయున్, షేర్షా, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు, మొగల్ సామ్రాజ్య పతనానికి కారణాలు, మరాఠాల విజృంభణ తదితర అంశాలు ప్రధానమైనవి. అక్బర్: పరిపాలన విధానం, రెండో పానిపట్టు యుద్ధం, దండయాత్రలు, రాష్ట్ర పాలన, సైనిక పాలన, మున్సబ్‌దారీ విధానం, ఆర్థిక విధానం, కళలు, రాజపుత్ర విధానం, రచనలు. జహంగీర్: పరిపాలనా విధానం, రాజాజ్ఞలు, ఖుస్రూ తిరుగుబాటు, మేవార్ రాజ్య ఆక్రమణ, జహంగీర్-ఇంగ్లిష్ వారు, నూర్జహాన్ జుంటా పతనం. షాజహాన్: పరిపాలనా విధానం, తిరుగుబాటు అణచుట, మొగలుల స్వర్ణయుగం, సాహిత్యం, భవన నిర్మాణం. చరిత్ర పాఠ్యాంశాలను చదివేటప్పుడు రాజ్యాలు, రాజుల ఆర్థిక, సాంఘిక పరిస్థితులపై తప్పనిసరిగా అవగాహన పెంపొందించుకోవాలి.ప్రపంచ నాగరికతలు, మధ్యయుగ ప్రపంచ చరిత్ర, ఆధునిక ప్రపంచ చరిత్ర, యుద్ధాలను గురించి తెలుసుకోవాలి.విసృ్తతంగా ఉండే చరిత్ర పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు ఎలా వస్తున్నాయన్న దానిపై అవగాహన పెంపొందించుకునేందుకు పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. నమూనా ప్రశ్నలు మానవ పరిణామ దశలోని మొదటి దశ? ఎ) హోమోసెఫియన్లు బి) నియాండెర్తల్ సి) అస్ట్రోఫిథికస్ డి) రామాఫిథికస్ సమాధానం: సి సింధు ప్రజల లిపి? ఎ) ప్రాకృతం బి) సంస్కృతం సి) బొమ్మలు డి) ద్రావిడం సమాధానం: సి బుద్ధుని శిష్యునిగా మారిన మగధ రాజు? ఎ) అజాతశత్రువు బి) బింబిసారుడు సి) కనిష్కుడు డి) అశోకుడు సమాధానం: ఎ పల్లవుల కాలంలో సుప్రసిద్ధ విద్యాలయం? ఎ) కాంచీపురం బి) తక్షశిల సి) నలంద డి) వల్లభి సమాధానం: ఎ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన ఏకైక మహిళ? ఎ) రజియా బి) లక్ష్మీబాయి సి) నూర్జహాన్ డి) బేగమ్ హజరత్ మహల్ సమాధానం: ఎ బాబర్ స్వీయ చరిత్ర తుజుక్-ఇ-బాబరీని ఏ భాషలో రాశారు? ఎ) టర్కీ బి) పారశీక సి) ఉర్దూ డి) హిందీ సమాధానం: ఎ