మార్కుల సాధనలో ‘చరిత్ర’ను తిరగ రాయాలి! | Marks towards the 'ought caritranu reversal! | Sakshi
Sakshi News home page

మార్కుల సాధనలో ‘చరిత్ర’ను తిరగ రాయాలి!

Published Thu, Sep 18 2014 3:42 PM | Last Updated on Sat, Jun 2 2018 7:36 PM

మార్కుల సాధనలో ‘చరిత్ర’ను తిరగ రాయాలి! - Sakshi

మార్కుల సాధనలో ‘చరిత్ర’ను తిరగ రాయాలి!

 జంపాన సుధాకర్, డెరైక్టర్,
 ప్రతిభ కోచింగ్ సెంటర్, విజయవాడ.
 
 స్కూల్ అసిస్టెంట్
 చరిత్ర (ఏజీటౌ్టటడ)
 ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర; మధ్యయుగ భారతదేశ చరిత్ర; ఆధునిక భారతదేశ చరిత్ర; దక్షిణ భారతదేశ రాజ్యాలు; 6, 7 తరగతుల సిలబస్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ చరిత్ర అంశాలు; ప్రపంచ నాగరికతలు; మధ్యయుగ, ఆధునిక ప్రపంచ చరిత్రలకు సంబంధించిన అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయాలి.
 
 పాఠ్యాంశాలు
 చరిత్ర అధ్యయనం: ఇందులో కాంస్య యుగపు నాగరికత, ప్రాచీన ఇనుప నాగరికత సమాజాలు, మధ్యయుగంలో ప్రపంచం తదితర అంశాలపై దృష్టిసారించాలి.


 ప్రాచీన భారతీయ నాగరికతలు: ఇందులో సింధులోయ నాగరికత (హరప్పా సంస్కృతి), ఆర్య నాగరికత, తొలి వేద నాగరికత, మలివేద నాగరికత తదితర అంశాలుంటాయి.
 
 క్రీ.పూ.6వ శతాబ్దం-రాజకీయ,
 సామాజిక పరిణామాలు
 ఈ విభాగంలో వర్ధమాన మహావీరుడు-జైనమతం; బౌద్ధమతం-గౌతమబుద్ధుడు అంశాలు ముఖ్యమైనవి.
 
 భారతదేశ చరిత్ర (క్రీ.పూ.200 -క్రీ.శ.300):
 దీనికి సంబంధించి మగధ రాజ్యం, పారశీక, గ్రీకు దండయాత్రలు, మౌర్య సామ్రాజ్యం, ఆంధ్ర శాతవాహనులు, సంగం యుగం, కుషాణులు తదితర అంశాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. తర్వాతి కాలానికి సంబంధించి గుప్త సామ్రాజ్యం, పుష్యభూతి వంశం (హర్షవర్ధనుడు) అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. దక్కన్, దక్షిణ భారతదేశ రాజ్యాల పాఠ్యాంశంలోని చాళుక్యులు, చోళులు, పల్లవులు, యాదవులు తదితర అంశాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి.
 
 భారతదేశంపై మహమ్మదీయుల దండయాత్రలు:
 అరబ్బుల దండయాత్ర నాటికి భారతదేశ పరిస్థితులు, తరుష్క దండయాత్రలు, మహమ్మద్ గజనీ, మహమ్మద్ ఘోరీల దండయాత్రలు; వాటి ఫలితాలు; ప్రభావాల గురించి తెలుసుకోవాలి.
 భారతదేశం (1206-1526): ఈ పాఠ్యాంశంలో ఢిల్లీ సుల్తానులకు సంబంధించి బానిస వంశం, ఖిల్జీలు, తుగ్లక్‌లు, సయ్యద్‌లు, లోఢీల గురించి చదవాలి. ఢిల్లీ సుల్తానుల పతనం, సూఫీ భక్తి ఉద్యమాలు, భారతీయ సంస్కృతిపై ఇస్లాం ప్రభావం తదితర అంశాలు ముఖ్యమైనవి.
 
 భారతదేశ సాంస్కృతిక వారసత్వం-
 మేధోపరమైన జాగృతి
 చారిత్రక నేపథ్యం, భారతదేశ చరిత్ర, ప్రత్యేక లక్షణాలు, కళ, వాస్తు శిల్పం, విద్య-తత్వశాస్త్రాల అభివృద్ధి, జాతీయ చైతన్యం, భారతదేశంపై విదేశీ సంస్కృతుల ప్రభావం, ఆంగ్ల విద్య ప్రభావం, 1857 తిరుగుబాటు వంటి అంశాలను చదవాలి.
 
 దక్షిణ భారతదేశ రాజ్యాలు
 
 కాకతీయులు: కాకతీయుల చరిత్రకు ఆధారాలు, కాకతీయుల వంశ చరిత్ర, ముఖ్యమైన రాజులు-పరిపాలనా కాలాలు, ఆర్థికాంశాలు, మతం-భాష, కాకతీయుల కాలం నాటి రచనలు ముఖ్యమైనవి.
 
 విజయనగర సామ్రాజ్యం: ఈ రాజ్యాన్ని పరిపాలించిన వంశాలు, భాషల ఆధారాలు, కన్నడ రచనలు, రాజ్యస్థాపన, విజయనగర సామ్రాజ్య రాజ్య పరిపాలన.. వారి పతనం ముఖ్యమైనవి.
 
 బహమనీ రాజ్యం: ఈ రాజ్యంలోని రాజుల్లో ఫిరోజ్‌షా, మూడో మహ్మద్ షా ప్రముఖులు. ప్రధానంగా మూడో మహ్మద్ షా పరిపాలనా గురించి తెలుసుకోవాలి.
 
 భారతదేశం (1858-1947)
 ఆంగ్లేయుల రాజకీయ, ఆర్థిక, సామాజిక విధానాలు, స్వదేశీ రాజులకు సంబంధించి బ్రిటిష్ వారి వైఖరి, పొరుగు రాజ్యాలతో బ్రిటిష్ సంబంధాలు ప్రధానమైనవి.
 
 భారతదేశంలో స్వాతంత్య్ర ఉద్యమం: ఈ పాఠ్యాంశం చాలా ముఖ్యమైంది. ఇందులో జాతీయవాదం-ఆవిర్భావం; ఆధునిక రవాణా, కమ్యూనికేషన్ల సాధనాల అభివృద్ధి, మితవాదులు, అతివాదులు, వందేమాతర ఉద్యమం, మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో భారతదేశం తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
 
 హోంరూల్ ఉద్యమం, మహాత్మాగాంధీ-జాతీయోద్యమం, స్వాతంత్య్ర ఉద్యమ దశలు, రెండో ప్రపంచ యుద్ధం, క్విట్ ఇండియా ఉద్యమం (1942), మౌంట్‌బాటన్ ప్రణాళిక, స్వదేశీ సంస్థానాల విలీనం, భారతదేశంలో ఫ్రెంచి, పోర్చుగీసు వలసలకు విముక్తి మొదలైన అంశాలపై దృష్టిసారించాలి.
 
 మహాత్మా గాంధీ-జాతీయ ఉద్యమం
 చంపారన్ సత్యాగ్రహం, జలియన్ వాలాబాగ్ దురంతం, సహాయ నిరాకరణోద్యమం, స్వరాజ్యపార్టీ, హిందూస్థాన్ రిపబ్లిక్, లాహోర్ కుట్రకేసు, సైమన్ కమిషన్, కమ్యూనల్ అవార్డ్, 1935 భారత ప్రభుత్వ చట్టం-రాష్ట్రాల్లో మంత్రివర్గాలు, కాంగ్రేసేతర మంత్రివర్గాలు ముఖ్యమైన అంశాలు.
 
 ఉద్యమ దశలు
 మతతత్వాలు, గాంధీజీ చేసిన కృషి, సామ్యవాద సిద్ధాంతాలు-ఉద్యమాలు, భారత స్వాతంత్య్ర ఉద్యమం, ప్రపంచంలోని స్వాతంత్య్ర ఉద్యమాలు, స్వదేశీ సంస్థానాలలో స్వాతంత్య్ర ఉద్యమాలు ముఖ్యమైనవి.
 
 క్విట్‌ఇండియా ఉద్యమం: అజాద్ హింద్ ఫౌజ్, కేబినెట్ మిషన్ ప్లాన్, కేబినెట్ మిషన్ సభ్యులు, పాకిస్థాన్ విభజన కోరిక, తాత్కాలిక ప్రభుత్వం, రాజ్యసభ మొదలైనవి.
 
 ఆధునిక ప్రపంచం
 ఇందులో ఆధునిక యుగారంభం, పునరుజ్జీవనం, సాంకేతిక వైజ్ఞానికాభివృద్ధి, మత సంస్కరణోద్యమం, ప్రతిమత సంస్కరణోద్యమం, జాతీయ రాజ్యాల ఆవిర్భావం, నిరంకుశత్వాలకు వ్యతిరేకంగా పోరాటం మొదలైన అంశాలుంటాయి.
 
 పెట్టుబడిదారీ విధానం-పారిశ్రామిక విప్లవం
 పెట్టుబడిదారీ విధాన ముఖ్య లక్షణాలు, పెట్టుబడిదారీ విధానం-ప్రగతి, ఫలితాలు, శ్రామిక చైతన్యం ముఖ్యమైనవి.
 
 పారిశ్రామిక విప్లవ కాలపు ఆవిష్కరణలు, వ్యవసాయ విప్లవం, వ్యవసాయ విప్లవానికి కృషిచేసిన వారు, వాణిజ్య విప్లవం, వ్యాపార వాదం, పారిశ్రామిక విప్లవం ఇంగ్లండ్‌లో ప్రారంభమవడానికి కారణాలు, రైలు మార్గాలు, వార్తా ప్రసార సౌకర్యాలు, పారిశ్రామిక విప్లవ విస్తరణ, పారిశ్రామిక విప్లవ ఫలితాలు, వైజ్ఞానిక ఫలితాలు, కారల్ మార్క్స్ ముఖ్యమైనవి.
 
 ప్రపంచ విప్లవోద్యమాలు
 ఇందులో ప్రజాస్వామ్య జాతీయ ఉద్యమాలు, ఆంగ్లేయ మహా విప్లవం, అమెరికా విప్లవం, ఫ్రెంచి విప్లవం తదితర అంశాలుంటాయి.
 
 జాతీయవాద ఉద్యమాలు
 ఈ పాఠ్యాంశంలో నెపోలియన్ ఉన్నతి-పతనం, వియన్నా సమావేశం, 1830 ఫ్రెంచి విప్లవం, 1848 తిరుగుబాటు, జర్మనీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణ, సామ్యవాద ఉద్యమాలు, 1871 పారిస్ కమ్యూన్ తదితర అంశాలను చదవాలి.
 
 సామ్రాజ్య వాదం
 సామ్రాజ్యవాదం ఆవిర్భవానికి కారణాలు, సామ్రాజ్యవాద రూపాలు, పద్ధతులు, ఆఫ్రికా, ఆసియాల కోసం సంఘర్షణ వంటివి ప్రధానమైనవి.
 
 సమకాలీన ప్రపంచం
 ఇందులో మొదటి ప్రపంచ యుద్ధం-కారణాలు, ఫలితాలు, నానాజాతి సమితి, రష్యా విప్లవం, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం-విప్లవాత్మక మేధోపరమైన ఉద్యమాలు, బోల్షివిక్ పార్టీ-లెనిన్, 1905 విప్లవం, తిరుగుబాటు గమనం, అక్టోబర్ విప్లవం-యూఎస్‌ఎస్‌ఆర్ అవతరణ, రష్యా విప్లవ ప్రభావం వంటివి ముఖ్యమైనవి.
 
 రెండో ప్రపంచ యుద్ధం వరకు ప్రపంచం
 ఈ పాఠ్యాంశంలో ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో ఐరోపా, ఇటలీలో ఫాసిజం, జర్మనీలో నాజీయిజం, జపాన్‌లో సైనికవాదం, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత టర్కీ, నానాజాతి సమితి వైఫల్యం, స్పానిష్ అంతర్యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం కారణాలు-ఫలితాలు, యుద్ధం వల్ల ఏర్పడిన రాజకీయ, ఆర్థిక పరిణామాలు, ఐక్యరాజ్య సమితి, ప్రజా ఉద్యమాల ఆవిర్భావం, లాటిన్ అమెరికా అవతరణ తదితర అంశాలు ముఖ్యమైనవి.
 
 రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ:
 ఇందులో సైనిక కూటములు-ప్రచ్ఛన్న యుద్ధం, స్వతంత్ర దేశాల అభివృద్ధి, సమస్యలు, అలీనోద్యమం, ప్రపంచ శాంతి పరిరక్షణలో ఐక్యరాజ్య సమితి, నిరాయుధీకరణ, అణ్వస్త్రాల సమస్యలు, ప్రపంచంలో ప్రముఖ వ్యక్తులు తదితర అంశాలుంటాయి.
 
 మొగల్ సామ్రాజ్యం
 ఇందులో బాబర్ దండయాత్ర నాటికి భారతదేశ పరిస్థితి, బాబర్, హుమాయున్, షేర్షా, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు, మొగల్ సామ్రాజ్య పతనానికి కారణాలు, మరాఠాల విజృంభణ తదితర అంశాలు ప్రధానమైనవి.
 అక్బర్: పరిపాలన విధానం, రెండో పానిపట్టు యుద్ధం, దండయాత్రలు, రాష్ట్ర పాలన, సైనిక పాలన, మున్సబ్‌దారీ విధానం, ఆర్థిక విధానం, కళలు, రాజపుత్ర విధానం, రచనలు.
 
 జహంగీర్: పరిపాలనా విధానం, రాజాజ్ఞలు, ఖుస్రూ తిరుగుబాటు, మేవార్ రాజ్య ఆక్రమణ, జహంగీర్-ఇంగ్లిష్ వారు, నూర్జహాన్ జుంటా పతనం.
 
 షాజహాన్: పరిపాలనా విధానం, తిరుగుబాటు అణచుట, మొగలుల స్వర్ణయుగం, సాహిత్యం, భవన నిర్మాణం.
 
 చరిత్ర పాఠ్యాంశాలను చదివేటప్పుడు రాజ్యాలు, రాజుల ఆర్థిక, సాంఘిక పరిస్థితులపై తప్పనిసరిగా అవగాహన పెంపొందించుకోవాలి.ప్రపంచ నాగరికతలు, మధ్యయుగ ప్రపంచ చరిత్ర, ఆధునిక ప్రపంచ చరిత్ర, యుద్ధాలను గురించి తెలుసుకోవాలి.విసృ్తతంగా ఉండే చరిత్ర పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు ఎలా వస్తున్నాయన్న దానిపై అవగాహన పెంపొందించుకునేందుకు పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి.
 
   నమూనా ప్రశ్నలు
 
 మానవ పరిణామ దశలోని మొదటి దశ?
 ఎ) హోమోసెఫియన్లు     బి) నియాండెర్తల్
 సి) అస్ట్రోఫిథికస్     డి) రామాఫిథికస్
 సమాధానం: సి
 
 సింధు ప్రజల లిపి?
 ఎ) ప్రాకృతం     బి) సంస్కృతం
 సి) బొమ్మలు     డి) ద్రావిడం
 సమాధానం: సి
 
 బుద్ధుని శిష్యునిగా మారిన మగధ రాజు?
 ఎ) అజాతశత్రువు     బి) బింబిసారుడు
 సి) కనిష్కుడు     డి) అశోకుడు
 సమాధానం: ఎ
 పల్లవుల కాలంలో సుప్రసిద్ధ విద్యాలయం?
 ఎ) కాంచీపురం     బి) తక్షశిల
 సి) నలంద         డి) వల్లభి
 సమాధానం: ఎ
 
 ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన ఏకైక మహిళ?
 ఎ) రజియా     బి) లక్ష్మీబాయి
 సి) నూర్జహాన్    డి) బేగమ్ హజరత్ మహల్
 సమాధానం: ఎ
 
 బాబర్ స్వీయ చరిత్ర తుజుక్-ఇ-బాబరీని ఏ భాషలో రాశారు?
 ఎ) టర్కీ         బి) పారశీక
  సి) ఉర్దూ         డి) హిందీ
 సమాధానం: ఎ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement