అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలో పేరుపాలెంలోని కటికలవారి మెరక ప్రాథమిక పాఠశాల
పశ్చిమగోదావరి, మొగల్తూరు : ప్రభుత్వ పాఠశాలల్లో భవనాలు, మౌలిక వసతులకు ఏటా రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో కొన్ని పాఠశాలల్లో కనీస సౌకర్యాలు సైతం కొరవడ్డాయి. మొగల్తూరు మండలం పేరుపాలెం పంచాయతీలోని కటికలవారి ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. దీంతో గతేడాది నుంచి ఈ పాఠశాలను సమీపంలోని ముత్యాలమ్మ ఆలయంలోకి మార్చారు. ఆలయంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో 28 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల శిథిలమైనా, ఏడాదిగా తరగతులు గుడిలో నిర్వహిస్తున్నా అధికారులు, పాలకులకు మాత్రం కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment