పూసపాటిరేగ (విజయనగరం): సముద్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పూసపాటిరేగ తీర ప్రాంతంలో అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. తీరప్రాంతంలో గాలులు వీయడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. 25 అడుగుల వరకూ సముద్రం ముందుకొచ్చింది. దీంతో మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. ఎలాంటి నష్టం వాటిల్లకుండా విజయనగరం జిల్లా పూసపాటిరేగ తహశీల్దార్ అధికారులను అప్రమత్తం చేశారు. ఆరు రెవెన్యూ గ్రామాల్లో వీఆర్‌ఓలు ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకునేవిధంగా చర్యలు తీసుకున్నారు.
సముద్ర తీరంలో ఉన్న చింతపల్లి గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే సమాచారం అందించేందుకు వీలుగా మెరైన్ పోలీస్ స్టేషన్‌లో హైఫ్రీక్వెన్సీ వైర్ లెస్ సెట్లు ఏర్పాటు చేశారు. చింతపల్లి ,తిప్పలవలస ,పతివాడబర్రిపేట, తమ్మయ్యపాలెం, కోనాడ గ్రామాలలో మత్స్యకారులు ఆదివారం సాయింత్రం నుంచే వేటను నిలిపివేశారు. మత్స్యకార గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
25 అడుగులు ముందుకొచ్చిన సముద్రం
Published Mon, Jun 8 2015 9:30 PM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM
Advertisement