సాక్షి, గుంటూరు: జిల్లాలో రెండో కరోనా మృతి నమోదయ్యింది. దాచేపల్లి మండలం నారాయణపురానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. జిల్లాలో శనివారం ఒక్కరోజే 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 71కు చేరుకుంది. గుంటూరు నగరంలోనే 53 మందికి పాజిటివ్ కేసులు నమోదయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. నగరంలో ఒకే కుటుంబంలో 10 మందికి కరోనా వైరస్ సోకింది.
(కరోనా మృతదేహాలు: మహారాష్ట్ర కీలక నిర్ణయం!)
నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు..
లాక్‌డౌన్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ హెచ్చరించారు. రేపు(ఆదివారం) జిల్లాను పూర్తిగా లాక్‌డౌన్ చేస్తున్నామని.. ఏ షాపులు తెరవడానికి వీలులేదన్నారు. వైద్య సిబ్బందిని మాత్రమే అనుమతిస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతామని కలెక్టర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment