ఇల్లెందు, న్యూస్‌లైన్:
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర జేఏసీ చైర్మన్‌లా వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్ విమర్శించారు. హైదరాబాద్‌లోని నిజాం కళాశాల హాస్టల్ విద్యార్థులపై దాడి అమానుషమని పేర్కొన్నారు. టీజేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. స్థానిక జగ దాంబసెంటర్ నుంచి పాతబస్టాండ్ వరకు యాత్ర నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వం ఏపీఎన్జీవోస్‌కు సభ నిర్వహించుకునేందుకు అనుమతిచ్చి తెలంగాణ శాంతిర్యాలీకి అనుమతిని నిరాకరించడం దారుణమన్నారు. అక్రమాస్తులు కలిగివున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ దినేశ్‌కుమార్‌రెడ్డికి ఒక్క రోజు కూడా ఆ బాధ్యతల్లో కొనసాగే అర్హత లేదన్నారు.
తెలంగాణ పట్ల సానుకూల నిర్ణయం వెలువడిన నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు సాగిస్తున్న కుట్రల వెనుక సీఎం, డీజీపీల హస్తం ఉందని ఆరోపించారు. నిజాం కళాశాల విద్యార్థులపై దాడి చేయించడమే కాకుండా దెబ్బలు తగిలిన వారికి వైద్యం చేయించడంలోనూ ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరించిందన్నారు. ప్రభుత్వం తెలంగాణ బంద్ విషయంలో ఒక తీరు...ఏపీఎన్జీవోల సభ విషయంలో మరో తీరుగా వ్యవహరించడం సరికాదని టీజేఏసీ డివిజన్ చైర్మన్ పి.అప్పారావు అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు జాన్‌పాషా, ఖమ్మంపాటి కోటేశ్వరరావు, రామచందర్‌నాయక్, సిలివేరు సత్యనారాయణ పాల్గొన్నారు.
సీమాంధ్ర జేఏసీ చైర్మన్ సీఎం కిరణ్
Published Sun, Sep 8 2013 3:18 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM
Advertisement
Advertisement