భారత్, వెస్టిండీస్ల మధ్య విశాఖపట్నంలో జరగనున్న వన్డే క్రికెట్ మ్యాచ్ను రద్దు చేయాలని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ సంఘాన్ని కోరింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24న విశాఖపట్నంలో భారత్, విండీస్ మ్యాచ్ జరగాల్సివుంది. కోట్లాది ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర నిర్ణయం తీసుకున్నందుకు నిరసనగా క్రికెట్ మ్యాచ్ను రద్దు చేయాలని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ తీర్మానించినట్టు కన్వీనర్ ముప్పాల సుబ్బారావు చెప్పారు.
సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం కోట్లాదిమంది సమైక్యవాదులు అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ఈ సమయంలో విశాఖలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం సరికాదని సుబ్బారావు అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా న్యాయవాదుల జేఏసీ పోరాటం కొనసాగిస్తోంది. ఈ నెల 23 వరకు విధుల్ని బహష్కరించారు.
'విశాఖ వన్డేను రద్దు చేయాలి'
Published Sun, Nov 10 2013 1:57 PM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM
Advertisement
Advertisement