హరి సన్నిధికే వెళ్లిపోయూరు
ఏలూరు (వన్‌టౌన్) :‘కల్యాణం జరిగినప్పుడు మాత్రమే ఆ మహిళల గానామృతంతో వీనుల విందు చేసుకుం టున్న కలియుగ దైవం.. నిత్యం వారి సంకీర్తనల ఝరిలో ఓలలాడాలనుకున్నాడో ఏమో.. ఆ ఆరుగుర్ని తన సాన్నిధ్యానికి తీసుకెళ్లిపోయూడు’ ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో అందరి నోటా ఇవే మాటలు వినిపించాయి. ఏలూరు సమీపంలో జాతీయ రహదారిపై శని వారం రాత్రి ఆగివున్న లారీని టవేరా కారు ఢీకొట్టిన ప్రమాదంలో మృత్యువాతపడిన ఆరుగురు మహిళలు, కారు డ్రైవర్ మృతదేహాలకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆది వారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ ఘోర దుర్ఘటనలో అప్పల బాలారత్నం (55), దెందులూరు మం డలం గంగన్నగూడెంకు చెందిన పాలడుగు కస్తూరి (57), ఏలూరు తమ్మనవారి వీధికి చెం దిన కుప్పం లక్ష్మి (55), తూర్పువీధికి చెందిన బొలిశెట్టి ప్రమీల (58), వన్‌టౌన్ కొత్తరోడ్డుకు చెందిన మందవాసి జయలక్ష్మి (48), ఆదివారపుపేటకు చెందిన పైడిమర్రి నాగరత్నం (52), కారు డ్రైవర్ ఎడ్ల రమణ (35) మృత్యువాత పడిన విషయం విదితమే. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పవర్‌పేటకు చెందిన మాజీ కౌన్సిలర్ కారంశెట్టి సీతామహాలక్ష్మి, పద్మనాభుని రత్నకుమారి, కొచ్చెర్ల అనురాధ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇష్టమైన శనివారం నాడే..
ఈ ప్రమాదంలో మృతిచెందిన వారంతా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ ఘట్టాలను తమ గానామృతంతో కీర్తిస్తున్నారు. వారు స్వామికి ఇష్టమైన శనివారం నాడే ఒక్కుమ్మడిగా మృత్యువాత పడడం స్థానికుల్ని కలచివేసింది. వారి కీర్తనలకు మెచ్చిన వేంకటేశ్వరుడే వారిని తనలో ఐక్యం చేసుకున్నాడని బాధాతప్త హృదయాలతో చుట్టుపక్కల వారు వ్యా ఖ్యానించారు. ఈ మహిళలంతా బృందంగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేవారు.
రెండు దశాబ్దాలుగా సత్సంగాలు
స్థానిక పెరుగుచెట్టు సమీపంలో నున్నావారి వీధికి చెందిన అప్పల బాలారత్నం ఆధ్యాత్మిక వేత్తగా పేరొందారు. వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని కీర్తనలుగా రూపొందించి తమ బృం దంతో ఆలపిస్తూ ఇరవయ్యేళ్లుగా ఆధ్యాత్మిక సత్సంగాలను నిర్వహిస్తున్నారు. ఆమె రచిం చిన శ్రీవారి కల్యాణం పుస్తకాలను రాష్ట్రవ్యాప్తంగా భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు కూడా.