రోడ్డుప్రమాదంలో దంపతుల మృతి | warangal couple died in eluru road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో దంపతుల మృతి

Published Sat, May 28 2016 8:48 AM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

warangal couple died in eluru road accident

ఏలూరు: అరకు విహార యాత్రకు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృత్యువాతపడ్డారు. ఏలూరు ఆశ్రం జంక్షన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది.

ఈ ప్రమాదంలో వరంగల్ జిల్లా జనగామకు చెందిన దంపతులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వేసవి సెలవుల్లో అరకు విహారయాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement