టిప్పర్ ఢీకొని బాలుడు మృతి | Teenager dies in road accident | Sakshi
Sakshi News home page

టిప్పర్ ఢీకొని బాలుడు మృతి

Published Tue, Jun 14 2016 5:55 PM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

Teenager dies in road accident

ఏలూరు (పశ్చిమ గోదావరి) : సైకిల్‌పై వెళ్తున్న బాలుడు టిప్పర్ ఢీకొని మృత్యువాతపడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని శనివారపుపేట శ్రీరాంనగర్ కాలనీకి చెందిన సయ్యద్ చాంద్ కుమారుడు సయ్యద్ ఇమాం(15) మంగళవారం మధ్యాహ్నం సైకిల్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన ఇసుక టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయాడు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement