లైంగికంగా వేధిస్తున్న కరస్పాండెంట్‌పై చర్య తీసుకోవాలి | Sexual abuse to take action Correspondent | Sakshi
Sakshi News home page

లైంగికంగా వేధిస్తున్న కరస్పాండెంట్‌పై చర్య తీసుకోవాలి

Published Wed, Mar 2 2016 12:24 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

Sexual abuse to take action Correspondent

రాజమహేంద్రవరం క్రైం : విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కరస్పాండెంట్‌పై చర్యలు తీసుకోవాలని ఏపీ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మురుకుర్తి దుర్గాప్రసాద్ యాదవ్, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
 
  ఈ మేరకు వారు మంగళవారం దక్షిణ మండల డీఎస్పీ కె.శ్రావణికి ఆమె కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. రాజమహేంద్రవరంలోని ఓ డిస్టెన్‌‌స ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ కరస్పాండెంట్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగికంగా వేధిస్తున్నాడని, పలువురు తమకు ఫోన్‌ల ద్వారా తెలిపారని విద్యార్థి సంఘాల నాయకులు వివరించారు.
 
 దీనిపై ఆరా తీసేందుకు తాము ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్‌కు వెళ్లగా ఓ వ్యక్తి తమకు ఎదురై ‘ ఇలాంటివి ఇక్కడ చాలా జరుగుతాయి.. మీరేం చేయలేరు’ అని అన్నాడని తెలిపారు. కరస్పాండెంట్ వేధింపులకు సంబంధించిన ఓ వీడియో క్లిపింగ్‌ను అతడు తమకు ఇచ్చాడని నాయకులు తెలిపారు. భవిష్యత్‌లో ఇంలాంటి సంఘటనలు జరగకుండా కరస్పాండెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement