‘ రేషనా..ఇంగా డీడీ కట్టలేదుభయ్.పైసలకు బుడుకులాడుతుంటే నీకు సరుకులు ఏడనుంచి తెమ్మంటవ్. ప్రతీ ఒక్కరికీ లోకువ అయిపోయింది...’ ఇదీ పల్లెల్లో డీలరు బాబుల దర్పం. చేసేదేమీ లేక ఉత్తిచేతుల్తోనే ఇళ్లకు వెళ్లే వినియోగదారులు. దీనిక్ చెక్ చెప్పేం దుకు పౌరసరఫరాల విభాగం కసరత్తు చేస్తోంది. సంబంధిత గ్రామంలో ఎంపిక చేసిన ఓ పదిమంది సెల్‌కు మీ ఊరికి ఈ సరుకులొచ్చాయ్..అని సంక్షిప్త సందేశం పంపనున్నారు. దీన్ని వచ్చే నెలలో అమలుకు యత్నిస్తున్నారు.
పాలమూరు, న్యూస్‌లైన్ : నిన్ననే వచ్చుంటే సరుకులు అందేవి.. సరుకులు ఇంకా మళ్లీ రా.. ఎప్పుడొస్తాయో మాకే తెలియదు.. మీకేం చెప్పాలి.. ఇలా ప్రతీ నెలా రేషన్ కార్డు లబ్దిదారులకు డీలర్లు చెబుతున్న మాట.. ఇక నుంచి ఆ పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టి... రేషన్ సరుకులు వచ్చాయంటే.. ప్రజలకు తెలిసిపోయేలా.. దుకాణానికి వెళ్లి చూడాల్సిన పనిలేకుండా కార్డుదారుని సెల్ ఫోన్‌కు సంక్షిప్తంగా మెసేజ్ ఇవ్వనున్నారు.
గ్రామానికి ఏయే సరుకులు వచ్చాయి.. ఎప్పుడు వచ్చాయి.. తదితర వివరాలతో కూడి న సమాచారం ఫోన్‌కు వస్తుంది. ఈ విధానాన్ని వచ్చే నెల నుంచి జిల్లాలో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే ఈపీడీఎస్ విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు ప్ర భుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఆ విధా నం అమలుకాగానే దీనికి శ్రీకారం చుట్టనుందని అధికారులు పేర్కొంటున్నారు. దీన్ని మొదట పట్టణ ప్రాం తాల్లో, తదనంతరం గ్రామాల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో తెల్ల రేషన్, అం త్యోదయ, అన్నపూర్ణ కార్డులు 1.15 లక్షలు ఉ న్నాయి.
వీటికి తోడు ఇటీవల రచ్చబండ కార్యక్రమంలో 20వేల మంది లబ్దిదారులకు కొత్తగా రేషన్ కూపన్లు అందజేశారు. వీటన్నిం టిని కలుపుకొంటే దాదాపు 1.35లక్షల వరకు విని యోగదారులున్నారు. జిల్లా వ్యాప్తంగా 2030 రే షన్ దుకాణాల ద్వారా బియ్యంతోపాటు చక్కె ర, కిరోసిన్, అమ్మహస్తం సరుకులు పంపిణీ చేస్తున్నారు. లబ్దిదారుల రేషన్‌కార్డు సంఖ్యలను ఇప్పటికే సేకరించిన అధికారులు ఆ ధార్ కు అనుసంధానం చేసే ప్రక్రియలో ని మగ్నమయ్యారు. ఇప్పటిదాకా 65వేల మంది లబ్దిదారు ల రేషన్ సంఖ్యలకు ఆధార్ అనుసంధానం పూర్తయింది. ఈ నెలాఖరులోగా లబ్దిదారుల పూర్తి వివరాలు అందజేయాలని పౌర సరఫరా ల శాఖ కమిషనరేట్ నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు ఆ పనిలో తలమునకలై ఉన్నారు.
ఇబ్బందులు తప్పుతాయా?
పలు సందర్భాల్లో సరుకులు త క్కువగా వచ్చాయని దుకాణానికి వ చ్చే వారికి రెండు మూడు రోజులు పంపిణీ చేసి దుకాణాలు మూసి వేస్తున్నారని విమర్శలు సైతం వస్తున్నాయి. దీంతో అడ్డుకట్ట వేసేం దుకు లబ్దిదారులకు సకాలంలో సరుకులు పంపిణీ చేసేందుకు సం క్షిప్త సందేశం ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టారు.
ఈ విధానం అమల్లోకి వస్తే ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి సదరు రేషన్ దుకాణానికి వచ్చే సరుకుల వివరాలను దుకాణం పరిధిలోని దాదాపు పది మం ది వరకు లబ్దిదారులకు సంక్షిప్త సందేశాలను పంపించే ఏర్పాట్లు చే స్తున్నారు. వార్డు, గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులను ఎంపిక చేసి సందేశాలను పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సం దేశంలో ఆయా దుకాణాలకు సరుకులు చేరుకున్న సమయం, ఎన్ని సరుకులు వచ్చాయి.. తదితర వివరాలు అందులో ఉంటాయి. దీం తో సరకులు పక్కదారి పట్టకుండా ఉండే అవకాశాలుఎక్కువగా ఉం టాయి. ఈ విధానం అమల్లోకి వస్తే వినియోగదారుల సమస్యలు తీరే వీలుంటుందని, డీలర్లు సైతం సక్రమంగా సరకులు పంపిణీ చేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.