Ration coupons
-
రూ.650 కోట్లతో పల్లె ప్రగతి: కేటీఆర్
జనవరిలో రేషన్ కూపన్లు అందిస్తాం గల్ఫ్‌లో మనోళ్ల కష్టాలు కళ్లారా చూశా సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట: తెలంగాణ పల్లె ప్రగతి పథకం ద్వారా రూ.650 కోట్లతో మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తామని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె. తారకరామారావు స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట మండలాల్లో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పథకానికి 150 మండలాలను ఎంపిక చేశామని, పాడిపరిశ్రమకు పెద్దపీట వేస్తామన్నారు. ధాన్యం నిల్వ కోసం రాష్ట్ర వ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లతో 290 గోదాములను నిర్మించనున్నట్లు వెల్లడించారు. మొదటి దఫాగా రూ.116 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా రూ.40 లక్షలతో వెంకటాపూర్‌లో ఐకేపీ గోదాంకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. వాటర్‌గ్రిడ్ కోసం వేములవాడ మండలం అగ్రహారం శివారులో స్థలాలను పరిశీలించామన్నారు. జనవరి నుంచి రేషన్ బియ్యం కూపన్లు అందిస్తామని, పింఛన్లు ఇచ్చేందుకు ఉత్తరం వేస్తే స్పందిస్తామని తెలిపారు. మధ్యమానేరు జలాశయం నుంచి కరీంనగర్, వరంగల్‌కు తాగునీరు అందిస్తామన్నారు. ఇటీవల దుబాయ్ వెళ్లి వచ్చానని, మనోళ్లు అక్కడ పడుతున్న కష్టాలను కళ్లారా చూశానని కేటీఆర్ పేర్కొన్నారు. -
ఈ‘సారీ’ కూపన్లే..
- శాశ్వత కార్డులు లేనట్లేనా..? - మరో మూడు నెలలు కూపన్లతోనే రేషన్ - జిల్లాకు చేరిన 42,251 కూపన్లు కలెక్టరేట్ : జిల్లాలోని రచ్చబండ రేషన్ కూపన్ దారులకు శాశ్వత రేషన్‌కార్డులు అందని ద్రాక్షగా మారాయి. లబ్ధిదారులకు శాశ్వత తెల్లకార్డులను ఇప్పట్లో జారీ చేసే యోచన లో ప్రభుత్వం లేనట్లుగా తెలుస్తోంది. గత ప్రభుత్వం రచ్చబండ ద్వారా రేషన్ కూపన్లు అందించి సరుకులు తీసుకునేలా వీలు కల్పించింది. 2013 నవంబర్‌లో ఆరు నెలలకు సరిపడా కూపన్లు జారీ చేసింది. ఆ కూపన్లు మే నెలతో ముగిశాయి. జూన్ నెలకు సరుకులు తీసుకునేందుకు కూపన్లు లేకపోవడంతో తాత్కాలిక కార్డుదారులకు అధికారుల ఆదేశాల మేరకు డీలర్లు సరుకులు పంపిణీ చేశారు. ఇక జూలై, ఆగష్టు, సెప్టెంబర్ మూడు నెలలకు సరిపడా 42,251 కూపన్లు శనివారం జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయానికి చేరాయి. జిల్లాకు 42,251 కూపన్లు.. జిల్లాకు 42,251 రేషన్ కూపన్లు వచ్చాయి. వీటి ద్వారా మూడు నెలలు చౌకధరల దుకాణాల ద్వారా సరుకులు పొందవచ్చు. మూడు నెలలకు సరిపడా కూపన్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లాకు చేరాయి. వీటిని ఆయా మండలాలకు పంపిణీ చేశారు. త్వరలో ఈ కూపన్లు రచ్చబండ కార్డుదారులకు ఇవ్వనున్నారు. సోమవారం జిల్లా సంయుక్త కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూపన్లకు సంబంధించిన అంశాలపై ఆయా మండలాల అధికారులు, డీలర్లతో చర్చించనున్నారు. డీలర్లు, అధికారులు సమావేశానికి హాజరుకావాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. కూపన్లు తీసుకునే వారు రూ.5 చెల్లించి తీసుకోవాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
వచ్చే నెల వెచ్చాలు వచ్చేనా?
మండపేట : మూడో విడత రచ్చబండ రేషన్ కూపన్ల కాలపరిమితి ముగిసింది. కొత్త కూపన్ల జారీ లేదా శాశ్వత రేషన్ కార్డుల మంజూరుపై ప్ర భుత్వం ఇంకా నోరు మె దపడం లేదు. ఫలితంగా రానున్న నెలకు రేషన్ సరుకులు వస్తాయో, లేదోనని బడుగుజనం కలవరపడుతున్నారు. కొత్త కార్డులు ఇస్తారో లేక కూపన్లతోనే సరిపెడతారోనన్న శంకా వారిని పీడిస్తోంది.గత ప్రభుత్వ హయాంలో రచ్చబండ ద్వారా రేషన్‌కార్డులు మంజూరయ్యాయి. గత నవంబరులో నిర్వహించిన మూడో విడత రచ్చబండలో తెల్లకార్డులకు మరో 87,477 మందిని ఎంపిక చేశారు. అంతకు ముందు రచ్చబండ రెండు విడతల్లో టీఏపీ, ఆర్ఏపీ కోడ్ నంబర్లతో కార్డులు జారీ చేశారు. ఆ కోడ్ నంబర్లతో తొలుత కూపన్లు, తర్వాత శాశ్వత కార్డులు మంజూరు చేశారు. ఫలితంగా లబ్ధిదారులకు రేషన్ సరుకులతో పాటు ఇతర సౌకర్యాలు పొందే వీలు కలిగింది. మూడో విడతలో 87,477 మంది లబ్ధిదారులకు డిసెంబరు నుంచి నెలకు ఒకటి చొప్పున ఏడు కూపన్లు అందజేశారు. కేవలం రేషన్ సరుకులు పొందేందుకు మాత్రమే ఈ కూపన్లు ఉపయోగపడ్డాయి. ప్రతి నెలా ఒక కూపన్ తీసుకువెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకునే వారు. శాశ్వత కార్డులు మంజూరు చేయకపోవడంతో ఈ విడత లబ్ధిదారులకు మిగిలిన సౌకర్యాలు అందని ద్రాక్షగానే మిగిలాయి. మళ్లీ కూపన్లయినా ఇస్తారా? గత డిసెంబరు నుంచి ఏడు నెలలకు పంపిణీ చేసిన కూపన్ల గడువు జూన్‌తో ముగుస్తోంది. రానున్న నెల నుంచి సరుకులు తెచ్చుకోవాలంటే కొత్తగా కూపన్లు ఉండాలి. అందుకోసం ఈ నెలాఖరులోగా లబ్ధిదారులకు కూపన్లు లేదా శాశ్వత కార్డులు మంజూరు చేయాలి. ఇప్పటి వరకు కూపన్లా లేక శాశ్వత కార్డులా అన్న విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు. ఈ విషయమై ఉన్నతస్థాయి నుంచి ఇంకా స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో మూడో విడత రచ్చబండ లబ్ధిదారుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. జూలై నుంచి సరుకులు అందుతాయే లేదోనని వారు ఆందోళన చెందుతున్నారు. తమకు యథావిధిగా సరుకులు అందించాలని, ఇతర పథకాలు పొందేందుకు వీలుగా శాశ్వత కార్డులు మంజూరు చేయాలని కోరుతున్నారు. -
‘లింకు’ చేయలేదా.. రేషన్ గోవిందా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో 10.83లక్షల తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు, రేషన్ కూపన్లు ఉన్నాయి. అయితే ఈ రేషన్ కార్డుల్లో ఉన్న వివరాల ఆధారంగా ఆయా వ్యక్తుల ఆధార్ వివరాలను ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చాలి. అయితే రేషన్ డీలర్ల ద్వారా ఆధార్ వివరాలను సేకరించిన పౌరసరఫరాల శాఖ అధికారులు వాటిని సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే తాజాగా రేషన్ కూపన్లుకు సంబంధించి ఫొటోలు అప్లోడ్ చేయని వారికి కోటా కత్తిరించింది. దీంతో 14వేల మంది రేషన్ కూపన్‌దారులకు ఈనెలలో బియ్యం సరఫరా నిలిచిపోయినట్లే. అదేవిధంగా జిల్లాలోని పట్టణ ప్రాంతంలో రేషన్ కార్డులతో ఆధార్ లింకు కుదరని వారికి తాజాగా రేషన్ సరుకుల కోటాపై కోత పెట్టింది. అయితే కార్డులో ఉన్న సభ్యుల్లో కనీసం ఒక్కరు కూడా ఆధార్ వివరాలను సమర్పించకుంటే.. అలాంటి కార్డుల వివరాలను ఏకంగా కీ రిజిస్టర్ నుంచి తొలగించారు. ఈలెక్కన దాదాపు 36వేల కార్డులు బోగస్ జాబితాలోకి చేరాయి. మొత్తమ్మీద 50వేల రేషన్ కార్డుదారులకు సంబంధించి ఈనెలలో వెయ్యి మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు సరుకును రేషన్ డీలర్లకు చేరవేసింది. సాధారణంగా విడుదల చేసే కోటాలో కోత విధించిన విషయాన్ని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సంక్షిప్త సమాచారం ద్వారా తహసీల్దార్లకు పంపించారు. అదేవిధంగా ఈ-మెయిల్ ద్వారా పూర్తిస్థాయి సమాచారాన్ని చేరవేశారు. అయితే రేషన్ వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేస్తే.. ఆయా కార్డులను తిరిగి పునరుద్ధరించనున్నట్లు అధికారులు చెబుతున్నా.. అది అంత సులువైన విషయం కాదని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. త్వరలో అంద రికీ.. ప్రస్తుతం రేషన్ కూపన్లు, పట్టణ ప్రాంతాల్లోని వారికి పరిమితం చేసిన అనుసంధాన ప్రక్రియను ప్రభుత్వం త్వరలో జిల్లాలోని కార్డుదారులందరికీ వర్తింపజేయనుంది. ఇందులో భాగంగా జిల్లాలోని 10.33లక్షల కార్డుల వివరాలను ఆధార్ కార్డు సంఖ్యతో అనుసంధానం చేయాలి. అయితే ఇప్పటివరకు కేవలం 60శాతం కార్డులకు సంబంధించి ఆధార్ వివరాలతో అనుసంధానమైనట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు చెబుతుండడం గమనార్హం. -
సరుకులొచ్చాయి..!
‘ రేషనా..ఇంగా డీడీ కట్టలేదుభయ్.పైసలకు బుడుకులాడుతుంటే నీకు సరుకులు ఏడనుంచి తెమ్మంటవ్. ప్రతీ ఒక్కరికీ లోకువ అయిపోయింది...’ ఇదీ పల్లెల్లో డీలరు బాబుల దర్పం. చేసేదేమీ లేక ఉత్తిచేతుల్తోనే ఇళ్లకు వెళ్లే వినియోగదారులు. దీనిక్ చెక్ చెప్పేం దుకు పౌరసరఫరాల విభాగం కసరత్తు చేస్తోంది. సంబంధిత గ్రామంలో ఎంపిక చేసిన ఓ పదిమంది సెల్‌కు మీ ఊరికి ఈ సరుకులొచ్చాయ్..అని సంక్షిప్త సందేశం పంపనున్నారు. దీన్ని వచ్చే నెలలో అమలుకు యత్నిస్తున్నారు. పాలమూరు, న్యూస్‌లైన్ : నిన్ననే వచ్చుంటే సరుకులు అందేవి.. సరుకులు ఇంకా మళ్లీ రా.. ఎప్పుడొస్తాయో మాకే తెలియదు.. మీకేం చెప్పాలి.. ఇలా ప్రతీ నెలా రేషన్ కార్డు లబ్దిదారులకు డీలర్లు చెబుతున్న మాట.. ఇక నుంచి ఆ పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టి... రేషన్ సరుకులు వచ్చాయంటే.. ప్రజలకు తెలిసిపోయేలా.. దుకాణానికి వెళ్లి చూడాల్సిన పనిలేకుండా కార్డుదారుని సెల్ ఫోన్‌కు సంక్షిప్తంగా మెసేజ్ ఇవ్వనున్నారు. గ్రామానికి ఏయే సరుకులు వచ్చాయి.. ఎప్పుడు వచ్చాయి.. తదితర వివరాలతో కూడి న సమాచారం ఫోన్‌కు వస్తుంది. ఈ విధానాన్ని వచ్చే నెల నుంచి జిల్లాలో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే ఈపీడీఎస్ విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు ప్ర భుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఆ విధా నం అమలుకాగానే దీనికి శ్రీకారం చుట్టనుందని అధికారులు పేర్కొంటున్నారు. దీన్ని మొదట పట్టణ ప్రాం తాల్లో, తదనంతరం గ్రామాల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో తెల్ల రేషన్, అం త్యోదయ, అన్నపూర్ణ కార్డులు 1.15 లక్షలు ఉ న్నాయి. వీటికి తోడు ఇటీవల రచ్చబండ కార్యక్రమంలో 20వేల మంది లబ్దిదారులకు కొత్తగా రేషన్ కూపన్లు అందజేశారు. వీటన్నిం టిని కలుపుకొంటే దాదాపు 1.35లక్షల వరకు విని యోగదారులున్నారు. జిల్లా వ్యాప్తంగా 2030 రే షన్ దుకాణాల ద్వారా బియ్యంతోపాటు చక్కె ర, కిరోసిన్, అమ్మహస్తం సరుకులు పంపిణీ చేస్తున్నారు. లబ్దిదారుల రేషన్‌కార్డు సంఖ్యలను ఇప్పటికే సేకరించిన అధికారులు ఆ ధార్ కు అనుసంధానం చేసే ప్రక్రియలో ని మగ్నమయ్యారు. ఇప్పటిదాకా 65వేల మంది లబ్దిదారు ల రేషన్ సంఖ్యలకు ఆధార్ అనుసంధానం పూర్తయింది. ఈ నెలాఖరులోగా లబ్దిదారుల పూర్తి వివరాలు అందజేయాలని పౌర సరఫరా ల శాఖ కమిషనరేట్ నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు ఆ పనిలో తలమునకలై ఉన్నారు. ఇబ్బందులు తప్పుతాయా? పలు సందర్భాల్లో సరుకులు త క్కువగా వచ్చాయని దుకాణానికి వ చ్చే వారికి రెండు మూడు రోజులు పంపిణీ చేసి దుకాణాలు మూసి వేస్తున్నారని విమర్శలు సైతం వస్తున్నాయి. దీంతో అడ్డుకట్ట వేసేం దుకు లబ్దిదారులకు సకాలంలో సరుకులు పంపిణీ చేసేందుకు సం క్షిప్త సందేశం ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సదరు రేషన్ దుకాణానికి వచ్చే సరుకుల వివరాలను దుకాణం పరిధిలోని దాదాపు పది మం ది వరకు లబ్దిదారులకు సంక్షిప్త సందేశాలను పంపించే ఏర్పాట్లు చే స్తున్నారు. వార్డు, గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులను ఎంపిక చేసి సందేశాలను పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సం దేశంలో ఆయా దుకాణాలకు సరుకులు చేరుకున్న సమయం, ఎన్ని సరుకులు వచ్చాయి.. తదితర వివరాలు అందులో ఉంటాయి. దీం తో సరకులు పక్కదారి పట్టకుండా ఉండే అవకాశాలుఎక్కువగా ఉం టాయి. ఈ విధానం అమల్లోకి వస్తే వినియోగదారుల సమస్యలు తీరే వీలుంటుందని, డీలర్లు సైతం సక్రమంగా సరకులు పంపిణీ చేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. -
మమ అనిపిస్తున్నారు..
=తూతూమంత్రంగా ‘రచ్చబండ’ సభలు =లబ్ధిదారుల చేతికందని పింఛన్లు, రేషన్ కూపన్లు =స్థానిక సమస్యలపై వినతుల వెల్లువ =ప్రచారం తప్ప ఒరిగిందేమీ లేదంటున్న విపక్ష నేతలు సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ ప్రచార ఆర్భాటానికి మినహా రచ్చబండ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఒనగూరే ప్రయోజనమేమీ లేదని పలువురు ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. శనివారం నగరంలోని నాలుగుప్రాంతాల్లో మూడోవిడత రచ్చబండ కార్యక్రమాలు తూతూమంత్రంగా జరిగాయి. గత కార్యక్రమాల్లో స్వీకరించిన దరఖాస్తులకు లబ్ధిదారులకు తాజా రచ్చబండలో పెన్షన్లు, రేషన్ కార్డులిస్తామని చెప్పిన అధికారులు కొద్దిమందికి మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో ఎంతో ఆశగా వచ్చిన పలువురు లబ్ధిదారులు ఒట్టి చేతులతో నిరాశగా వెనుదిరిగారు. చంచల్‌గూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగిన రచ్చబండ కార్యక్రమాన్ని టీడీపీ కార్పొరేటర్లు సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి,అస్లాంలు అడ్డుకున్నారు. గత రచ్చబండలో దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంతమందికి అర్హులకు లబ్ధిచేకూరిందో వివరాలు తెలపాలని అధికారులను,ఎమ్మెల్యేను నిలదీయడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. సోమాజిగూడలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పలువురు స్థానికులు మాట్లాడుతూ..గతంలో జరిగిన రచ్చబండలో దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ఇప్పటివరకు పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి మంత్రి దానం నాగేందర్ డుమ్మా కొట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెస్ట్‌మారేడుపల్లి నెహ్రూనగర్ కమ్యూనిటీహాల్లో జరిగిన కార్యక్రమాన్ని కేవలం అరగంటలో ముగించి ఎమ్మెల్యే శంకర్రావు వెళ్లిపోయారు. నేతలు ఏమన్నారంటే.. కాచిగూడలోని ఏకేభవన్లో నిర్వహించిన రచ్చబండలో పాల్గొన్న ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రోడ్లపై చెత్త పేరుకుపోయి దుర్వాన వస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ దిడ్డి రాంబాబు మాట్లాడుతూ పింఛన్ల పంపిణీ సంక్రమంగా జరగడం లేదని..దీంతో వృద్ధులు, వికలాంగులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. పెన్షన్ అక్రమాలపై అధికారులు స్పందించి బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. సలీంనగర్ కార్పొరేటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రచ్చబండ వల్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారేకానీ ప్రజలకు ఒరిగిందే మీ లేదన్నారు. రచ్చబండ..ముఖ్యమంత్రి ప్రచారానికే పరిమితమైందని జీహెచ్ఎంసీ టీడీపీ ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ప్రజలకు ఇళ్లను కేటాయించపోవడం సరికాదన్నారు. గత రచ్చబండలో తీసుకున్న దరఖాస్తులను అధికారులు బుట్టదాఖలు చేశారన్నారు.