
మోదీ నుంచి ఎంతో నేర్చుకోవాలి: చంద్రబాబు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని, ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని, ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఎకనమిక్ సమిట్లో ఆయన మాట్లాడారు.
తమ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేశామని, సౌర విద్యుత్తును కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేస్తామని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావల్సిందిగా పారిశ్రామిక వేత్తలను ఆయన ఆహ్వానించారు.