ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెత జిల్లా వైద్యారోగ్య అధికారులు, సిబ్బందికి అతికినట్లు సరిపోతుంది. వైద్యారోగ్య సిబ్బంది స్థానికంగా ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ అది అమలు చేయాలని ఆదేశించాల్సిన అధికారులే స్థానికంగా ఉండకుండా రాకపోకలు సాగిస్తుంటే కిందిస్థాయి సిబ్బంది కూడా అధికారుల బాటలోనే రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఆపద సమయాల్లో వైద్యసిబ్బంది ఎవరూ అందుబాటులోకి రాలేకపోతున్నారు.
విజయనగరంఆరోగ్యం: వైద్య ఆరోగ్యశాఖలో కిందిస్థాయి ఏఎన్‌ఎం నుంచి జిల్లా స్థాయి అధికారి డీఎంహెచ్‌ఓ వరకు ఎవరూ లోకల్(స్థానికంగా)గా ఉండడం లేదు. వైద్య సిబ్బంది అంతా పనిచేసిన చోటే నివాసం ఉండాలని ప్రభుత్వం ఐదేళ్ల క్రితం జీఓ నంబరు 98ను జారీ చేసింది. అయితే అది నేటికీ అమలుకు నోచుకోవడం లేదు. ప్రజారోగ్యాన్ని పరీక్షించాల్సిన అధికారులు స్థానికంగా ఉంటే ఏక్షణం ఏ ఆపద సంభవించినా సకాలంలో చర్యలు చేపట్టడానికి ఆస్కారం ఉంటుం ది. గజపతినగరం మండలం బంగారమ్మపేటకు చెందిన తండ్రీకొడుకులు మలేరియా వ్యాధితో రెండురోజుల క్రితం రాత్రి వేళ మృతిచెందారు.
డీఎంహెచ్‌ఓ విశాఖనుంచి రాకపోకలు సాగించడం వల్ల ఆమె వారి గురించి తెలుసుకోవడానికి రాత్రి వేళ రాలేక పోయారు. ఆమెకు బదులు కిందిస్థాయి సిబ్బందిని ఆస్పత్రికి పంపించారు. అన్నీఅయిపోయాక మరుసటి రోజు మృతుల గ్రామాలకు వెళ్లి పరిస్థితి గురించి ఆరా తీశారు. డీఎంహెచ్‌ఓ ఒక్కరే కాదు. జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి, జిల్లా ట్రైనింగ్ టీమ్ పీఓ, జైబార్ కో ఆర్డినేటర్ లు విశాఖ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వీరు స్థానికంగా ఉండి కింది స్థాయి సిబ్బందికి స్థానికంగా ఉండాలని చెప్పాలి. వీరు స్థానికంగా ఉండకపోవడం వల్ల కిందిస్థాయి సిబ్బందిని ఏమీ అనలేకపోతు న్నారు. జిల్లాస్థాయి అధికారులతో పాటు పలువురు కిందిస్థాయి అధికారులు, సిబ్బంది కూడా విశాఖ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.
వైద్యారోగ్యశాఖ కార్యా లయంలో పనిచేస్తున్న డెమోలు, సూపరింటెండెంట్‌లు, సీనియర్ అసిస్టెంట్‌లు, ఎపిడిమిక్ సిబ్బంది సహా అందరూ రాకపోకలు సాగిస్తున్నవారే. జిల్లాలో 68 పీహెచ్‌సీలు, 12 సీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిలో 130 మంది వైద్యులు పనిచేస్తున్నారు. అదేవిధంగా స్టాఫ్‌నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్‌టెక్నీషియన్లు, మేల్ హెల్త్ అసిస్టెం ట్లు, హెల్త్ సూపర్ వైజర్లు, సీహెచ్‌ఓలు, డీపీఎంఓలు, ఏపీఎంఓల్లో అధిక శాతం జి ల్లా కేంద్రం, మండల కేంద్రం నుంచి రాకపోకలు సాగిస్తున్న వారే. స్థానికంగా ఉండాల్సిన ఏఎన్‌ఎంలదీ అదే పరిస్థితి: స్థానికంగా నివాసం ఉంటామని చెప్పి ఉద్యోగం పొం దిన ఏఎన్‌ఎంలు సైతం గ్రామాల్లో ఉండడం లేదు. దీంతో జ్వరం వస్తే మందు బిళ్ల కూడా ఇచ్చే నాథుడే గ్రామాల్లో లేక ఆర్‌ఎంపీలను, ప్రైవేటు వైద్యులను ఆశ్రయించాల్సిన పరిస్థితి.
వైద్య ఆరోగ్యశాఖలో..షటిల్ సర్వీస్
Published Mon, Jul 6 2015 12:12 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement