రూ.15 వేలు తీసుకుంటూ చిక్కిన ఎస్‌ఐ, కానిస్టేబుల్
అనుమతులు ఉన్నా కల్లు దుకాణదారునికి వేధింపులు
ఏదో కేసులో ఇరికిస్తామని బెదిరింపు
అవినీతి నిరోధక శాఖ అధికారులను కలిసిన బాధితుడు
వ్యూహాత్మకంగా పట్టుకున్న అధికారులు
ఆర్మూరులో కలకలం సృష్టించిన ఘటన
ఆర్మూర్, న్యూస్‌లైన్ :
ఆర్మూర్ ఆబ్కారీ ఎస్‌ఐ పల్నాటి భాస్కర్ గౌడ్, కానిస్టేబుల్ శివకుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కడం కల కలం సృష్టించింది.ఆరు నెలలుగా బాల్కొండ మండలానికి ఇన్‌చా ర్జి ఎస్‌ఐగా కొనసాగుతున్న భాస్కర్‌గౌడ్ మూడు నెలల క్రితం సీఐ గా అదనపు బాధ్యతలను కూడా చేపట్టారు. అక్రమ సంపాదన కోసం తన వద్ద పనిచేసే కానిస్టేబుల్ శివకుమార్‌ను మధ్యవర్తిగా ని యమించుకున్నారని సమాచారం. పథకం ప్రకారమే బాల్కొండ మండలంలోని కల్లు దుకాణాల యజమానులను వేధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లంచం డిమాండ్ చేసి
ఇందులో భాగంగా జలాల్‌పూర్‌కు చెందిన యాదగౌడ్‌ను డబ్బులు ఇవ్వమని వేధిం చారు. యాదగౌడ్ కథనం ప్రకారం... కల్లు దుకాణం నిర్వహణ కోసం ఆయన 2007లో ఆయన అన్ని అనుమతు లు పొందారు. 2012 నుంచి 2017 వరకు లెసైన్సు ను రెన్యూవల్ చేయించుకున్నారు. అయినప్పటికీ తమకు డబ్బులు ఇవ్వకపోతే ఏదో ఒక కేసులో ఇరి కిస్తామని కానిస్టేబుల్ శివకుమార్ వారం రోజుల క్రితం యాదగౌడ్‌ను కలిసి బెదిరించారు. దీంతో యాదగౌడ్ రెండు రోజుల క్రితం ఎస్‌ఐ భాస్కర్ గౌడ్‌ను కలిసాడు. తాను బాల్కొండ ఎస్‌ఐగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ప్రతి నెల రూ. 2,500 చొప్పున ఆరు నెలలకుగాను రూ. 15 వేలు లంచంగా ఇవ్వాలని ఆయనడిమాండ్ చేశారు. ఈ మొత్తంలో కానిస్టేబుళ్లు, కార్యాలయం సిబ్బందికి వాటా ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
పక్కా ప్రణాళికతో
విధి లేక యాదగౌడ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ సంజీవ్‌రావు పథకాన్ని రచించారు. రసాయనాలు పూసిన రూ. 15 వేల కరెన్సీ ని ఆయనకు అందజేశారు. గురువారం మధ్యాహ్నం యాదగౌడ్ ఆర్మూర్ ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు. కానిస్టేబుల్ శివకుమార్‌ను, యాదగౌడ్‌ను వెంట బెట్టు కొని కార్యాలయం ఎదురుగా తాను అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకు వెళ్లారు. అక్కడ యాదగౌడ్ ఇచ్చిన డబ్బులను శివకుమార్ తీసుకుని ఎస్‌ఐ చేతికి అందించాడు. దూరంగా ఉండి ఇదంతా గమనిస్తున్న ఏసీబీ అధికారులు వెంటనే దాడి చేసి ఎస్‌ఐని, కానిస్టేబుల్ శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. లంచం డబ్బులు రూ. 15 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఆబ్కారీ కార్యాలయంలోని ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సంజీవ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ ఎక్సైజ్ ఎస్‌ఐ, కానిస్టేబుల్ లంచం తీసుకున్నట్లు నిర్ధారణ అయిందన్నారు. బాధితులు ఏ టైమ్‌లో నైనా తన సెల్ ఫోన్ నంబర్ 9440446155ను సంప్రదించాలని కోరారు. ఈ దాడులలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు రఘునాథ్, వెంకటేశ్వర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల సిబ్బంది పాల్గొన్నారు.
ఏసీబీ వలలో ఆబ్కారీ చేపలు
Published Fri, Jan 31 2014 6:33 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement