ప్రకాశం: ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బైక్ బోల్తా పడిన ఘటనలో ప్రకాళం జిల్లాలోని తాడివారిపల్లె ఎస్ఐ వెంకట రవీంద్రా రెడ్డి(43) కి తీవ్రగాయాలయ్యాయి.
వివరాలు.. ఎస్సై వెంకటరవీంద్రారెడ్డి విధుల్లో భాగంగా ఉదయం తాడివారిపల్లి నుంచి తర్లుపాడుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా బైక్ గొల్లపల్లి వాటర్ ట్యాంక్ సమీపంలోకి చేరుకోగానే అదే సమయంలో.. ఒక్కసారిగా ఎదురుగా ద్విచక్రవాహనం రావడంతో.. దాన్ని తప్పించడానికి ప్రయత్నించి అదుపుతప్పి కిందపడ్డాడు. దీంతో వెంకట రవీంద్రా రెడ్డి తలకు బలమైన గాయాలయ్యాయి. ఈ విషయం గమనించిన స్థానికులు అంబులెన్స్ సాయంతో ఆయనను ఒంగోలు ఆస్పత్రికి తరలించారు.