డాక్టర్ రవికుమార్
సాక్షి, తిరుపతి, చిత్తూరు: ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో కొనసాగాలా.. వద్దా.. అనే సందిగ్దంలో ఉన్న స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. పదవి లో ఉన్నన్ని రోజులు ఆయనపై వివిధ ఆరో పణలు వచ్చాయి. పాలన అంతా మాజీ సీఎం చంద్రబాబు బంధువుల చేతిలో పెట్టారని.. దీంతో వారు ఆడిందే ఆటగా మారిపోయిందని.. ఖజానాను వివిధ రూపాల్లో కొల్లగొట్టారని విమర్శలున్నాయి. వీరి ఆగడాలు అధికారులను సైతం తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయని తెలి సింది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా డైరెక్టర్ వారిని అదుపులో పెట్టలేకపోవడంతో తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో ప్రతి అంశం వివాదాస్పదంగా మారింది. పలువురు స్విమ్స్ అధికారులు సైతం అడ్డదిడ్డంగా వ్యవహరించారు. చంద్రబాబు బంధువుల వారి మాటలకు అడ్డుచెప్పే సాహసం డైరెక్టర్ కూడా చేయలేకపోయారని బహిరంగంగా విమర్శలు వచ్చాయి. ఔట్‌సోర్సింగ్ నియామకాల నుంచి వైద్యులు, టెక్నీషి యన్ల నియామకాలు పరిపాలనా విభాగ పదోన్నతులు, వైద్యపరికరాల కొనుగోళ్లు, మెడికల్ షాపు నిర్వహణ వంటి వాటిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జవహార్‌రెడ్డిని అమరావతిలో కలసి బుధవారం రాత్రి రాజీనా మాను అందించారు. స్విమ్స్ ఇన్‌చార్జ్ డైరెక్టర్‌గా, వీసీగా స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అలోక్ సచన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు అందాయి.
Comments
Please login to add a commentAdd a comment