హైదరాబాద్ : సింగపూర్ ప్రతినిధుల బృందం రాజధానికి సంబంధించి పూర్తి సమాచారం కోరినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఏపీ సచివాలయంలో సింగపూర్ ప్రతినిధుల బృందం గురువారం కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో భేటీ అయిన విషయం తెలిసిందే. సమావేశం అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ 500 ఏళ్ల నుంచి రాజధాని పరిసర ప్రాంతాల్లో భూకంపాలు, తుపాను నష్టాలపై ఆరా తీసినట్లు చెప్పారు.
కృష్ణా, గుంటూరు జిల్లా అధికారులు పూర్తి వివరాలు...సింగపూర్ బృందానికి అందించారని ఆయన చెప్పారు. అలాగే వివిధ శాఖల ఉన్నతాధికారులతో సింగపూర్ బృందం సమావేశం అవుతుందని నారాయణ పేర్కొన్నారు. విద్యుత్, రెవెన్యూ, దేవాదయ, తాగునీటి శాఖ అధికారులతో సమీక్ష చేయనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్ ప్లాన్పై సాయంత్రానికి యాక్షన్ ప్లాన్ అందిస్తారని నారాయణ వెల్లడించారు.
రాజధాని మాస్టర్ ప్లాన్పై.. యాక్షన్ ప్లాన్
Published Thu, Dec 11 2014 1:02 PM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM
Advertisement
Advertisement