భర్త కళ్లెదుటే.. భార్య అఘాయిత్యం..కారణం ఏంటంటే.. | Married Woman Self Destruction In Chittor | Sakshi
Sakshi News home page

భర్త కళ్లెదుటే.. భార్య అఘాయిత్యం..కారణం ఏంటంటే..

Published Fri, Aug 13 2021 8:51 PM | Last Updated on Fri, Aug 13 2021 9:09 PM

Married Woman Self Destruction In Chittor - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చిత్తూరు: బైరెడ్డిపల్లి మండలం మునిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఒక వివాహిత అత్తింటి ముందు ఆత్మహత్యకు పాల్పడింది.  గత కొన్ని రోజులుగా.. కుటుంబంలో కలహాల కారణంగా.. తీవ్ర మనస్తాపం చెందిన సదరు మహిళ, భర్త ఎదుటే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఈ సంఘటనతో, ఒక్కసారిగా షాకింగ్‌కు గురైన భర్త.. భార్య మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో భర్త చేతులకు తీవ్రగాయాలయ్యాయి. కాగా, కుటుంబ కలహాల కారణంగానే సదరు మహిళ ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement