
కాల్పుల కేసులో నిందితుల గుర్తింపు
కృష్ణాజిల్లా పెదఅవుటపల్లిలో జరిగిన కాల్పుల కేసు విచారణ క్రమంగా ఓ కొలిక్కి వస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని పినకడిమికి చెందిన ముగ్గురిని హతమార్చేందుకు ముంబై నుంచి షూటర్లను రప్పించి మరీ ఈ కుట్ర పన్నిన విషయం తెలిసిందే.
షూటర్లకు సహకరించిన ఆరుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. భూతం శ్రీనివాసరావు, పురాణం గణేశ్, వారణాసి శ్రీనివాసరావులతో పాటు మరో ముగ్గురు నిందితుల బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. నిందితులు విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
కోర్టు కేసు వాయిదాకు హాజరయ్యేందుకు గన్నవరం వరకు విమానంలో వచ్చి అక్కడినుంచి రోడ్డు మార్గంలో వెళ్తున్నవారిని నిందితులు వెనకనుంచి కారుతో ఢీకొని, తర్వాత తుపాకులతో కాల్పులు జరిపి చంపిన విషయం తెలిసిందే. ఈ సంఘటన ఇటు కృష్ణా, అటు పశ్చిమగోదావరి రెండు జిల్లాల్లోనూ సంచలనం సృష్టించింది.