
'అవి ఖరీదైన హత్యలుగా భావిస్తున్నాం'
విజయవాడ : కృష్ణాజిల్లా పెదఅవుటపల్లిలో జరిగిన కాల్పుల కేసు విచారణ క్రమంగా ఓ కొలిక్కి వస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని పినకడిమికి చెందిన ముగ్గురిని హతమార్చేందుకు షూటర్లను రప్పించి మరీ ఈ కుట్ర పన్నిన విషయం తెలిసిందే. ఆ హత్య కేసులో షూటర్లకు సహకరించిన నిందితులను తాజా గుర్తించినట్లు నగర సీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. హత్యలకు పాల్పడిన గ్యాంగ్ స్టర్స్ వివరాలను సేకరించినట్లు ఆయన పేర్కొన్నారు. కాల్పులు జరిగినప్పుడు అదే వాహనంలో ఇద్దరు కానిస్టేబుల్స్ మఫ్టీలో ఉన్న సంగతి వాస్తవేమనేని తెలిపారు.
ఈ వ్యవహారంలో ఏలూరు వన్ టౌన్ సీఐ మురళీ కృష్ణతో పాటు ఇద్దరు కానిస్టేబుల్స్ ను విచారించామన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా సీపీ తెలిపారు. ఆ హత్యలను ఖరీదైన హత్యలుగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆ హత్యా నిందితులు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా, అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో పరిచియాలు ఉన్నట్లు సీపీ తెలిపారు.