Peda Avutapalli
-
ఏలూరు పోలీసులే చంపించారు
సాక్షి ప్రతినిధి, విజయవాడ : పెద్ద అవుటపల్లి వద్ద జరిగిన ముగ్గురి హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఏలూరు పోలీసుల పాత్రపై రోజురోజుకూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హంతకులకు పోలీసులు సహకరించారని, దగ్గరుండి హత్య చేయించారని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. పెద అవుటపల్లి ఘటన అనంతరం రక్షణగా వచ్చిన పోలీసులు హతుల కార్లలో పారిపోవడం కూడా వారి ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మరోవైపు గతంలో జరిగిన దుర్గారావు హత్యకు కూడా పోలీసులు సహకరించారని సమాచారం. దీంతో విజయవాడ పోలీసులు ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుల్లో ఏలూరు వన్‌టౌన్ పోలీసులు ఏ స్థాయిలో లంచాలు తీసుకున్నారు.. ఎవరి వద్ద ఎంతెంత తీసుకున్నారనే కోణంలోనూ దర్యాప్తు సాగుతున్నట్లు సమాచారం. పోలీసుల ఆధ్వర్యానే హత్యలు : శ్రీనాథ్ మృతుడు గంధం నాగేశ్వరావు భార్య గంధం యాదగిరమ్మ విజయవాడ పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరావును బుధవారం కలిసి తమ వారిని ఏలూరు వన్‌టౌన్ పోలీసులే దగ్గరుండి హత్య చేయించారని ఆరోపించారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం మృతుడు మారయ్య కుమారుడు శ్రీనాథ్ కమిషనరేట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ తన తాత, నాన్నలను చంపించింది ఏలూరు పోలీసులేనని చెప్పారు. గతంలో ఒకసారి కోర్టు వాయిదాకు వస్తామని తన తండ్రి చెబితే రావద్దని ఏలూరు పోలీసులే చెప్పారని పేర్కొన్నారు. కానీ, హత్య జరిగిన రోజు వాయిదాకు కచ్చితంగా రావాల్సిందేనని పిలిపించారని చెప్పారు. వాయిదాకు రాకుంటే అరెస్ట్ వారెంటు వస్తుందని నమ్మకంగా పిలిపించి హత్య చేయించారని ఆరోపించారు. ప్రస్తుతం తమను ఏలూరు పోలీసులు వేధిస్తున్నారని, తన చిన్నమ్మ లక్ష్మిని స్టేషన్‌కు రావాలని ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. గతంలో హత్యకు గురైన దుర్గారావు కేసులో లక్ష్మి నిందితురాలంటూ పోలీసులు వేధిస్తున్నట్లు చెప్పారు. ఇరువర్గాల నుంచి ముడుపులు! పశ్చిమగోదావరి జిల్లా పినకడమికి చెందిన తూరపాటి నాగరాజు కుమారుడు టి.శివకృష్ణ అదే గ్రామానికి చెందిన భూతం గోవిందు కుమార్తె ఉమాదేవిని ప్రేమించి 2006లో బంధువులకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నాడు. తనను కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని 2009లో ఉమాదేవి పెదవేగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, 498ఎ, 507 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల తర్వాత రాజీ పడటంతో కేసు కొట్టివేశారు. ఈ కేసుతోనే గోవిందు, నాగరాజు కుటుంబాల మధ్య ఆజ్యం మొదలైంది. తమపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నాడని గోవిందు అన్న దుర్గారావును నాగరాజు వర్గీయులు హత్య చేయించారు. ఇందుకు పరోక్షంగా ఏలూరు వన్‌టౌన్ పోలీసులు సహకరించారని దుర్గారావు బంధువులు అప్పట్లో ఆరోపించారు. దుర్గారావును హత్య చేయించిన వారిని వదిలేది లేదని, వారిని హతమార్చిన తర్వాతే కర్మకాండలు చేస్తామని భూతం గోవిందు, ఆయన తమ్ముడు శ్రీనులు ప్రతిజ్ఞ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే నాగరాజు వర్గీయులైన గంధం నాగేశ్వరరావు, మారయ్య, పగిడి మారయ్యలను హత్య చేయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ముగ్గురి హత్యలతోనూ ఏలూరు పోలీసులకు సంబంధం ఉందని, డబ్బు కోసం వారు ఏదైనా చేస్తారని హతుల బంధువులు ఆరోపించడంతో పోలీసు శాఖలో కలకలం మొదలైంది. పైగా పోలీసుల తీరు కూడా పలు అనుమానాలకు తావివ్వడంతో కేసు ఏలూరు వన్‌టౌన్ పోలీసుల మెడకు చుట్టుకునే అవకాశం లేకపోలేదు. సహకరించినా హత్యానేరమే.. హంతకులకు ప్రత్యక్ష్యంగా లేదా పరోక్షంగా సహకరించిన ఎవరికైనా హత్యానేరం కింద శిక్షపడుతుందని సీపీ ఏబీ వెంకటేశ్వరావు చెబుతున్నారు. ఉన్నతాధికారులకు కూడా చెప్పకుండా పారిపోయిన పోలీసులపై కేసు నమోదు చేస్తారా.. లేదా అనే విషయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
కాల్పుల కేసులో నిందితుల తరలింపు
-
'అవి ఖరీదైన హత్యలుగా భావిస్తున్నాం'
విజయవాడ : కృష్ణాజిల్లా పెదఅవుటపల్లిలో జరిగిన కాల్పుల కేసు విచారణ క్రమంగా ఓ కొలిక్కి వస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని పినకడిమికి చెందిన ముగ్గురిని హతమార్చేందుకు షూటర్లను రప్పించి మరీ ఈ కుట్ర పన్నిన విషయం తెలిసిందే. ఆ హత్య కేసులో షూటర్లకు సహకరించిన నిందితులను తాజా గుర్తించినట్లు నగర సీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. హత్యలకు పాల్పడిన గ్యాంగ్ స్టర్స్ వివరాలను సేకరించినట్లు ఆయన పేర్కొన్నారు. కాల్పులు జరిగినప్పుడు అదే వాహనంలో ఇద్దరు కానిస్టేబుల్స్ మఫ్టీలో ఉన్న సంగతి వాస్తవేమనేని తెలిపారు. ఈ వ్యవహారంలో ఏలూరు వన్ టౌన్ సీఐ మురళీ కృష్ణతో పాటు ఇద్దరు కానిస్టేబుల్స్ ను విచారించామన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా సీపీ తెలిపారు. ఆ హత్యలను ఖరీదైన హత్యలుగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆ హత్యా నిందితులు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా, అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో పరిచియాలు ఉన్నట్లు సీపీ తెలిపారు. -
కాల్పుల కేసులో నిందితుల గుర్తింపు
కృష్ణాజిల్లా పెదఅవుటపల్లిలో జరిగిన కాల్పుల కేసు విచారణ క్రమంగా ఓ కొలిక్కి వస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని పినకడిమికి చెందిన ముగ్గురిని హతమార్చేందుకు ముంబై నుంచి షూటర్లను రప్పించి మరీ ఈ కుట్ర పన్నిన విషయం తెలిసిందే. షూటర్లకు సహకరించిన ఆరుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. భూతం శ్రీనివాసరావు, పురాణం గణేశ్, వారణాసి శ్రీనివాసరావులతో పాటు మరో ముగ్గురు నిందితుల బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. నిందితులు విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. కోర్టు కేసు వాయిదాకు హాజరయ్యేందుకు గన్నవరం వరకు విమానంలో వచ్చి అక్కడినుంచి రోడ్డు మార్గంలో వెళ్తున్నవారిని నిందితులు వెనకనుంచి కారుతో ఢీకొని, తర్వాత తుపాకులతో కాల్పులు జరిపి చంపిన విషయం తెలిసిందే. ఈ సంఘటన ఇటు కృష్ణా, అటు పశ్చిమగోదావరి రెండు జిల్లాల్లోనూ సంచలనం సృష్టించింది. -
బలి కోరిన బంధుత్వం
సాక్షి, ఏలూరు : కృష్ణాజిల్లా పెదఅవుటపల్లి వద్ద బుధవారం దారుణ హత్యకు గురైన ముగ్గురు వ్యక్తులు, వారిని హతమార్చిన వ్యక్తులు దగ్గరి బంధువులే. కుటుం బ కలహాలు, వృత్తిలో ఏర్పడిన విభేదాలు, రాజకీ య విద్వేషాలు బంధుత్వాన్ని సైతం మర్చిపోయేలా చేశాయి. వారి మధ్య పగ, ప్రతీకారాలను రగిల్చా. బుధవారం హత్యకు గురైన ముగ్గురితో కలిపి మొత్తంగా ఆరుగురి ప్రాణాలను బలి తీసుకున్నాయి. పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన గంధం నాగేశ్వరరావు అతని కుమారులు గంధం మారయ్య, గంధం పగిడి మారయ్య హత్య కేసులో భూతం దుర్గారావు తమ్ముడు శ్రీనివాస్ ప్రమేయం ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. జ్యోతిష్యం వీరి వృత్తి బుడ్గాజంగాల సామాజిక వర్గానికి చెందిన కొన్ని కుటుంబాలు పెదవేగి మండలం పినకడిమిలో నివాసం ఉంటున్నారుు. జ్యోతిష్యం చెప్పడం వీరి వృత్తి. ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాల్లోని ప్రముఖులకు, బడా వ్యాపారులకు సైతం వీరు జాతకాలు చెబుతుంటారు. ఈ కుటుంబాల్లో అధికశాతం మంది రూ.కోట్లకు పడగలెత్తారు. విమానాల్లో విదేశాల్లో పర్యటిం చే స్థాయికి ఎదిగారు. గ్రామ రాజకీయా లపై పట్టు సాధించారు. ఎవరికి వారు తమ వృత్తిని కొనసాగిస్తూ వ్యాపారాల్లోనూ అడుగుపెట్టారు. అలా ఎదిగిన భూతం దుర్గారావు ఏలూరు నడిబొడ్డున ఫైర్‌స్టేషన్ సెంటర్లో జేకే ప్యా లెస్ పేరిట లాడ్జి, రెస్టారెంట్ నెలకొల్పారు. పినకడిమి గ్రామంలో ఓ రాజకీయ పార్టీకి పెద్దగా వ్యవహరిం చారు. అతనికి భార్య తిరుపతమ్మ, కుమార్తెలు వైష్ణవి, విశాలాక్షి, కుమారు డు రుషికేష్, అన్న గోవిందు, తమ్ముడు శ్రీనివాస్ ఉన్నారు. గోవిందుకు భార్య మారమ్మ, కుమార్తెలు ఉమాదేవి, మహేశ్వరి, కుమారులు బాలాజీ, జేకే ఉన్నారు. శ్రీనివాస్‌కు భార్య జగదాం బ, కుమారులు కనకప్రియ, ప్రవల్లిక, కుమారులు సుదర్శన్, సంపత్ ఉన్నా రు. గోవిందు పెద్ద కుమార్తె ఉమాదేవికి అదే గ్రామానికి చెందిన తూరపాటి నాగరాజు కుమారుడితో వివాహం చేశారు. నాగరాజు సోదరిని గంధం నాగేశ్వరావు వివాహం చేసుకున్నారు. ఈ రకంగా అందరూ బంధువుల య్యారు. ఐదేళ్ల క్రితం తలెత్తిన కుటుం బ కలహాల వల్ల భూతం దుర్గారావు అతని సోదరులు ఓ వర్గంగా, తూరపాటి నాగరాజు, గంధం నాగేశ్వరావు, వారి కుమారులు మరో వర్గంగా విడిపోయారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 6న ఆదివారం రాత్రి భూతం దుర్గారావు తన స్వగ్రామం పినకడిమిలోనే హత్యకు గురయ్యారు. దుర్గారావు ఆ రోజున తన మిత్రులైన కడమంచి మారయ్య, చీర్ల శ్రీనివాస్‌తో కలిసి వాకింగ్ చేస్తుండగా మంకీ క్యాప్‌లు ధరించిన గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు వారిపై పెప్పర్ స్ప్రే చల్లి కత్తులతో దాడి చేశారు. ఈ ఘట నలో దుర్గారావు మృతి చెందాడు. ఈ కేసులో కూరపాటి నాగరాజుతోపాటు గంధం మారయ్య, గంధం పగిడి మారయ్య నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నాగరాజు, అతని కుమారులు చిరంజీవి, శివకృష్ణ ముంబై పారి పోయారు. పోలీసులకు చిక్కి బెయిల్‌పై విడుదలైన అనంతరం గంధం నాగేశ్వరరావు కుమారులు కూడా ముంబై వెళ్లిపోయారు. వాళ్లంతా అక్కడే జ్యోతిష్యం చెప్పుకుంటూ జీవి స్తున్నారు. ఏలూరు జిల్లా కోర్టుకు వాయిదాలకు వచ్చి వెళుతున్నారు. దుర్గారావు సోదరులపైనే అనుమానాలు ఏప్రిల్ 6న హత్యకు గురైన భూతం దుర్గారావు కర్మకాండల తర్వాత అతడి అన్న గోవిందు లండన్ వెళ్లిపోయాడు. తమ్ముడు శ్రీనివాస్ గ్రామంలోనే ఉంటున్నాడు. బుధవారం ఉదయమే అతడు ఇంటినుంచి బయటకు వెళ్లాడు. అదే సమయంలో గంధం నాగేశ్వరావు కూడా ఇంటినుంచి ఏలూరు బయలుదేరాడు. కిరారుు హంతకులకు రూ.3 కోట్ల సుపారీ ఇచ్చి హత్యలు చేయిం చినట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే వారు బసచేసిన హనుమాన్ జంక్షన్‌లోని రాయల్ హంపి హోట ల్లో గదులను శ్రీనివాస్ ఏలూరు చిరునామాతో తీసుకోవడంతోపాటు హంత కులు వాడిన వాహనాలు శ్రీనివాస్‌కు చెందినవిగా తేలడంతో అతని ప్రమేయంపై అనుమానాలు బలపడుతున్నాయి. శ్రీనివాస్ వెనుక అతడి అన్న గోవిందు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. భయం గుప్పెట్లో పినకడిమి పెదవేగి రూరల్ : పినకడిమిలో భయూం దోళనలు నెలకొన్నారుు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే భయంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గ్రామంలో 15 చోట్ల పోలీస్ పికెట్లు కొనసాగుతున్నాయి. 15 రోజులపాటు 144 సెక్షన్ బంధువులైన రెండు వర్గాల మధ్య విభేదాల నేపథ్యంలో ప్రతీకార చర్యలు చోటుచేసుకోకుండా నిరోధించేందుకు పెదవేగి మండలం పినకడిమిలో 15 రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. నిందితులు, బాధితుల ఇళ్లు పక్కపక్కనే ఉండటంతో పోలీసులు అనుక్షణం పహారా కాస్తున్నారు. హత్యకు గురైన ముగ్గురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి గురువారం పినకడిమి గ్రామానికి తీసుకువస్తారని గ్రామస్తులు భావించగా, గురువారం రాత్రి వరకూ మృతదేహాలు గ్రామానికి చేరుకోలేదు. శుక్రవారం ఉదయం తీసుకువచ్చే అవకాశం ఉన్నట్టు డీఎస్పీ ఎం.సత్తిబాబు తెలి పారు. పినకడిమిలో పరిస్థితిని గురువారం ఆయన పర్యవేక్షించారు. దర్యాప్తు నిమిత్తం విజయవాడకు ప్రత్యేక బృందాలను పంపించారు. -
తంబి ఆలయంలో శిశువు వదిలిన వెళ్లిన ఆగంతకులు
ఉంగుటూరు సమీపంలోని పెద్దావుటపల్లిలోని జోసఫ్ తంబి ఆలయంలో రెండు వారాల వయస్సు గల ఆడశిశువును గుర్తు తెలియని వ్యక్తులు గత రాత్రి వదిలివెళ్లారు. ఆ శిశువుని స్థానికులు గుర్తించి ఆలయ సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో ఆలయ సిబ్బంది గత రాత్రాంత ఆ శిశువును తమ సంరక్షణలో ఉంచారు. ఆదివారం ఉదయం ఆ శిశువును విజయవాడలోని చైల్డ్‌లైన్‌కు అప్పగించారు.