సాక్షి, ఏలూరు : కృష్ణాజిల్లా పెదఅవుటపల్లి వద్ద బుధవారం దారుణ హత్యకు గురైన ముగ్గురు వ్యక్తులు, వారిని హతమార్చిన వ్యక్తులు దగ్గరి బంధువులే. కుటుం బ కలహాలు, వృత్తిలో ఏర్పడిన విభేదాలు, రాజకీ య విద్వేషాలు బంధుత్వాన్ని సైతం మర్చిపోయేలా చేశాయి. వారి మధ్య పగ, ప్రతీకారాలను రగిల్చా. బుధవారం హత్యకు గురైన ముగ్గురితో కలిపి మొత్తంగా ఆరుగురి ప్రాణాలను బలి తీసుకున్నాయి. పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన గంధం నాగేశ్వరరావు అతని కుమారులు గంధం మారయ్య, గంధం పగిడి మారయ్య హత్య కేసులో భూతం దుర్గారావు తమ్ముడు శ్రీనివాస్ ప్రమేయం ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
జ్యోతిష్యం వీరి వృత్తి
బుడ్గాజంగాల సామాజిక వర్గానికి చెందిన కొన్ని కుటుంబాలు పెదవేగి మండలం పినకడిమిలో నివాసం ఉంటున్నారుు. జ్యోతిష్యం చెప్పడం వీరి వృత్తి. ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాల్లోని ప్రముఖులకు, బడా వ్యాపారులకు సైతం వీరు జాతకాలు చెబుతుంటారు. ఈ కుటుంబాల్లో అధికశాతం మంది రూ.కోట్లకు పడగలెత్తారు. విమానాల్లో విదేశాల్లో పర్యటిం చే స్థాయికి ఎదిగారు. గ్రామ రాజకీయా లపై పట్టు సాధించారు. ఎవరికి వారు తమ వృత్తిని కొనసాగిస్తూ వ్యాపారాల్లోనూ అడుగుపెట్టారు. అలా ఎదిగిన భూతం దుర్గారావు ఏలూరు నడిబొడ్డున ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో జేకే ప్యా లెస్ పేరిట లాడ్జి, రెస్టారెంట్ నెలకొల్పారు.
పినకడిమి గ్రామంలో ఓ రాజకీయ పార్టీకి పెద్దగా వ్యవహరిం చారు. అతనికి భార్య తిరుపతమ్మ, కుమార్తెలు వైష్ణవి, విశాలాక్షి, కుమారు డు రుషికేష్, అన్న గోవిందు, తమ్ముడు శ్రీనివాస్ ఉన్నారు. గోవిందుకు భార్య మారమ్మ, కుమార్తెలు ఉమాదేవి, మహేశ్వరి, కుమారులు బాలాజీ, జేకే ఉన్నారు. శ్రీనివాస్‌కు భార్య జగదాం బ, కుమారులు కనకప్రియ, ప్రవల్లిక, కుమారులు సుదర్శన్, సంపత్ ఉన్నా రు. గోవిందు పెద్ద కుమార్తె ఉమాదేవికి అదే గ్రామానికి చెందిన తూరపాటి నాగరాజు కుమారుడితో వివాహం చేశారు. నాగరాజు సోదరిని గంధం నాగేశ్వరావు వివాహం చేసుకున్నారు.
ఈ రకంగా అందరూ బంధువుల య్యారు. ఐదేళ్ల క్రితం తలెత్తిన కుటుం బ కలహాల వల్ల భూతం దుర్గారావు అతని సోదరులు ఓ వర్గంగా, తూరపాటి నాగరాజు, గంధం నాగేశ్వరావు, వారి కుమారులు మరో వర్గంగా విడిపోయారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 6న ఆదివారం రాత్రి భూతం దుర్గారావు తన స్వగ్రామం పినకడిమిలోనే హత్యకు గురయ్యారు. దుర్గారావు ఆ రోజున తన మిత్రులైన కడమంచి మారయ్య, చీర్ల శ్రీనివాస్‌తో కలిసి వాకింగ్ చేస్తుండగా మంకీ క్యాప్‌లు ధరించిన గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు వారిపై పెప్పర్ స్ప్రే చల్లి కత్తులతో దాడి చేశారు. ఈ ఘట నలో దుర్గారావు మృతి చెందాడు. ఈ కేసులో కూరపాటి నాగరాజుతోపాటు గంధం మారయ్య, గంధం పగిడి మారయ్య నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నాగరాజు, అతని కుమారులు చిరంజీవి, శివకృష్ణ ముంబై పారి పోయారు. పోలీసులకు చిక్కి బెయిల్‌పై విడుదలైన అనంతరం గంధం నాగేశ్వరరావు కుమారులు కూడా ముంబై వెళ్లిపోయారు. వాళ్లంతా అక్కడే జ్యోతిష్యం చెప్పుకుంటూ జీవి స్తున్నారు. ఏలూరు జిల్లా కోర్టుకు వాయిదాలకు వచ్చి వెళుతున్నారు.
దుర్గారావు సోదరులపైనే అనుమానాలు
ఏప్రిల్ 6న హత్యకు గురైన భూతం దుర్గారావు కర్మకాండల తర్వాత అతడి అన్న గోవిందు లండన్ వెళ్లిపోయాడు. తమ్ముడు శ్రీనివాస్ గ్రామంలోనే ఉంటున్నాడు. బుధవారం ఉదయమే అతడు ఇంటినుంచి బయటకు వెళ్లాడు. అదే సమయంలో గంధం నాగేశ్వరావు కూడా ఇంటినుంచి ఏలూరు బయలుదేరాడు. కిరారుు హంతకులకు రూ.3 కోట్ల సుపారీ ఇచ్చి హత్యలు చేయిం చినట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే వారు బసచేసిన హనుమాన్ జంక్షన్‌లోని రాయల్ హంపి హోట ల్‌లో గదులను శ్రీనివాస్ ఏలూరు చిరునామాతో తీసుకోవడంతోపాటు హంత కులు వాడిన వాహనాలు శ్రీనివాస్‌కు చెందినవిగా తేలడంతో అతని ప్రమేయంపై అనుమానాలు బలపడుతున్నాయి. శ్రీనివాస్ వెనుక అతడి అన్న గోవిందు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
భయం గుప్పెట్లో పినకడిమి
పెదవేగి రూరల్ : పినకడిమిలో భయూం దోళనలు నెలకొన్నారుు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే భయంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గ్రామంలో 15 చోట్ల పోలీస్ పికెట్లు కొనసాగుతున్నాయి.
15 రోజులపాటు 144 సెక్షన్
బంధువులైన రెండు వర్గాల మధ్య విభేదాల నేపథ్యంలో ప్రతీకార చర్యలు చోటుచేసుకోకుండా నిరోధించేందుకు పెదవేగి మండలం పినకడిమిలో 15 రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. నిందితులు, బాధితుల ఇళ్లు పక్కపక్కనే ఉండటంతో పోలీసులు అనుక్షణం పహారా కాస్తున్నారు. హత్యకు గురైన ముగ్గురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి గురువారం పినకడిమి గ్రామానికి తీసుకువస్తారని గ్రామస్తులు భావించగా, గురువారం రాత్రి వరకూ మృతదేహాలు గ్రామానికి చేరుకోలేదు. శుక్రవారం ఉదయం తీసుకువచ్చే అవకాశం ఉన్నట్టు డీఎస్పీ ఎం.సత్తిబాబు తెలి పారు. పినకడిమిలో పరిస్థితిని గురువారం ఆయన పర్యవేక్షించారు. దర్యాప్తు నిమిత్తం విజయవాడకు ప్రత్యేక బృందాలను పంపించారు.
బలి కోరిన బంధుత్వం
Published Fri, Sep 26 2014 1:37 AM | Last Updated on Mon, Jul 30 2018 9:21 PM
Advertisement
Advertisement