చిన్న తప్పుకు పెద్ద శిక్ష
- హెల్మెట్ ధరించక బలవుతున్న వాహనచోదకులు
- తలకు గాయమై చనిపోయే వారే అధికం
- జులై 1 నుంచి హెల్మెట్ వాడకం తప్పనిసరి
రవి, కృష్ణ ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఒకరోజు ఇద్దరూ ద్విచక్రవాహనంపై బయలుదేరి వేరే ప్రాంతానికి వెళ్తున్నారు. ఇంతలో గాలితో కూడిన వర్షం మొదలైంది. కంటిమీద చినుకులు పడటంతో చేతిని అడ్డుపెట్టుకొని బైక్ నడుపుతున్నాడు రవి. బలంగా చినుకులు తాకడంతో వాహనాన్ని అదుపు చేయలేక రోడ్డు పక్కనే ఉన్న చెట్టుని ఢీకొట్టాడు. ప్రమాదంలో ఇద్దరికి తలకు తప్పించి మిగిలిన ఏ చోటా పెద్దగా గాయాలు కాలేదు. ఇది గమనించిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే స్నేహితులిద్దరూ ఈ లోకాన్ని విడి చిపెట్టారు. శిరస్త్రాణం ధరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో.?
- విశాఖపట్నం (తాటిచెట్లపాలెం)
ప్రపంచంలోనే అత్యధిక రోడ్డుప్రమాదాలు సంభవిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 381 మంది వాహనచోదకులు ప్రమాదాలకు గురై అశువులు భాస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకునే మనిషి, వాహనాన్ని నడిపే సమయానికి ముందు తన ప్రాణాలకు రక్షణ కల్పించే శిరస్త్రాణం ఎందుకు ధరించడో అర్థం కావడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించడంతో పాటు వాహనచోదకులు తమకు తాము జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.
హెల్మెట్ ఈ విధంగా రక్షణ కల్పిస్తుంది..
హెల్మెట్ ధరించడం వల్ల 85 శాతం వరకు మెదడుకు రక్షణ ఉంటుంది.
ప్రమాదాలన్నీ అకస్మాత్తుగా సంభవిస్తాయి. అటు వంటి సమయంలో మెదడు నుంచి శరీరంలోని వివిధ భాగాలకు సమాచారాన్ని అందజేసే నాడులు అంతే వేగంతో ప్రతి స్పందిచ లేవు. ఆ సమయంలో హెల్మెట్ ధారణ ప్రమాదాల నుంచి రక్షిస్తుంది.
ఏ తరహా హెల్మెట్ ధరించాలి..
మన దృష్టిని ఆటంకపరిచే విధంగా ఉండకూడదు.
తక్కువ బరువు కలిగినదై ఉండాలి.
అలసటను క లిగించనిదై ఉండాలి.
చర్మవ్యాధులకు కారణం కానిదై ఉండాలి.
స్ట్రాప్ తప్పనిసరిగా ఉండాలి. స్ట్రాప్ లేకుండా ధరించడం అంటే హెల్మెట్ ధరించకపోవడమే..
తెల్లని/ప్రకాశవంతమైన హెల్మెట్ ధరించాలి.
హెల్మెట్లు అధికృతమైన వై ఉండాలి.
ఇవీ పాటించండి..
సేఫ్టీ కల్చర్‌ను అలవరుచుకోవడం..
హెల్మెట్ ధారణ చేసినా నియమిత వేగపు హద్దుల్ని పాటించడం..
60 కిలోమీటర్ల వేగ పరిమితి అయితే 55 కి.మీ వేగాన్ని పాటించడం..
వేగం పరిమితులు లేని చోట 80
కిలోమీటర్ల వేగాన్ని దాటకపోవడం