ఎర్రచందనం దుంగలు స్వాధీనం | smugling Redsandle | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Published Sat, Feb 20 2016 3:00 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM

smugling  Redsandle

రుద్రవరం: రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని డీవీ పెంట మంగమ్మ బరకలు ప్రాంతంలో శుక్రవారం తెల్లవారు జామున ఫారెస్ట్ అధికారులు దాడులు నిర్వహించారు.  దాడుల్లో రూ. 20 లక్షలు విలువ జేసే 17 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.  రుద్రవరం రేంజర్ రామ్‌సింగ్ స్థానిక ఫారెస్ట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.  వారం రోజులుగా నల్లమల అడవిలోకి కూలీలు  వచ్చారని, వీరు ఎర్రచందనం దుంగలను లారీలో తరలించనున్నట్లు సమాచారం అందిందన్నారు. దీంతో గస్తీ ముమ్మరం చేశామన్నారు. శుక్రవారం తెల్లవారు జామున  మంగమ్మ బరకలు ప్రాంతంలో   దుంగలను తరలిస్తున్న కూలీలను ప్రోటెక్షన్‌వాచర్ల గమనించి పట్టుకునేందుకు యత్నించేలోపు దుంగలను వదిలేసి పరారైనట్లు వెల్లడించారు.   ఎర్రచందనం అక్రమ రవాణాలో పాల్గొన్న వారు రుద్రవరం అటవీ రేంజ్ ప్రాంత గ్రామాలకు చెందినవారిగా భావిస్తున్నట్లు రేంజర్ తె లిపారు. ఈ సమావేశంలో డివి పెంట సెక్షన్ అధికారి విజయలక్ష్మి, బీట్ అధికారులు పెద్దన, వెంకటన్నలతోపాటు ప్రొటె క్షన్ వాచర్లు నరసింహ, హనుమంతు, అంకయ్యపాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement