గాలాయగూడెంకు పోటెత్తిన భక్తులు
గాలాయగూడెంకు పోటెత్తిన భక్తులు
గలాయగూడెం(దెందులూరు), : అచ్చమ్మ పేరంటాలు తల్లి ఉత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు భక్తులు అగ్నిగుండం ప్రవేశం చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో గాలయగూడెం వీధులు నిండిపోయూరుు. ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. తొలుత అచ్చమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. అచ్చమ్మతల్లి ప్రతిమను పట్టుకుని కోరిన కోర్కెలు తీర్చినందుకు కణకణలాడే నిప్పులపై భక్తులు నడిచి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు.
ఆలయ అభివృద్ధికి సహకారం : తోట చంద్రశేఖర్
వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్ శుక్రవారం శ్రీ అచ్చమ్మ పేరంటాలు తల్లిని దర్శించుకుని పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీర్వచనాలు పొందడం తన అదృష్టమన్నారు. ఆలయ అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు సహాయ, సహకారాలు అందిస్తానని చెప్పారు. అచ్చమ్మతల్లి గాలాయగూడెంలో ఉండటం, గాలాయగూడెం గ్రామం ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆలయ కమిటీ ఆలయ అభివృద్ధికి నివేదిక అందజేయాలని కోరారు. చంద్రశేఖర్‌కు ఆలయ కమిటీ చైర్మన్ గంటా కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు, సొసైటీ ప్రెసిడెంట్ తుంగా రామ్మోహనరావు, ఉపాధ్యక్షులు శివయ్య, కన్వీనర్ గంగాధరరావు, సభ్యులు, వైసీపీ నాయకులు తోట వెంకన్న, గ్రామస్తులు, ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. జిల్లా అధికార ప్రతినిధి ఊదరగొండ చంద్రమౌళి, దెందులూరు నియోజకవర్గ సమన్వయ కర్తలు కొఠారు రామచంద్రరావు, చనుమోలు అశోక్‌గౌడ్, పీవీ రావు, గోపన్నపాలెం మాజీ సర్పంచ్‌లు కొండేటి హనుమంతు, మోర్ల సుబ్బారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నేడు భారీ అన్న సమారాధన
గాలాయిగూడెం (దెందులూరు) : గాలాయిగూడెంలో అచ్చమ్మ పేరాంటాలు తల్లి ఉత్సవాలు ముగియడంతో శనివారం భారీ అన్న సమారాధన ఏర్పాటుచేశామని ఆలయ కమిటీ చైర్మన్ జి. కోటేశ్వరరావు తెలిపారు. ఆరు మండలాల నుంచి వచ్చే 20వేల మంది భక్తులకు అచ్చమ్మ తల్లి సన్నిధిలో అన్నసమారాధన జరుగుతుందన్నారు. భక్తులు అన్నసమారాధనలో అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.