కన్నతల్లినే హతమార్చిన కొడుకు | son murdered his mother | Sakshi
Sakshi News home page

కన్నతల్లినే హతమార్చిన కొడుకు

Published Wed, Mar 29 2017 9:44 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

son murdered his mother

వేముల: వైఎస్సార్‌ జిల్లా మేముల మండలం వేల్పుల గ్రామంలో బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో కన్నతల్లిని కొడుకు హతమార్చిన సంఘటన వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తల్లి బయమ్మ(60)తో కలసి కుమారుడు రవిశంకర్‌రెడ్డి గ్రామంలో ఉండేవాడు. మద్యానికి బానిసగా మారాడు. మంగళవారం రాత్రి తల్లితో గొడవపడ్డాడు. చుట్టుపక్కల వాల్లు రోజుమాదిరే గొడవ పడుతున్నారని ఎవరూ వెళ్లలేదు.

బుధవారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి వచ్చారు. అప్పటికే రవిశంకర్‌రెడ్డి తల్లి తలపై కత్తితో కొట్టి హత్యచేసి ఇంట్లోనుంచి బయటికి ఈడ్చుకొచ్చి పడేశాడు. గ్రామస్తులు రావడం చూసి పారిపోయాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ నరేంద్రకుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రవిశంకర్‌రెడ్డి పక్క ఇంటిలో నివాసం ఉంటున్న లింగాల గంగిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేంద్రకుమార్‌ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement