సోనియా, దిగ్విజయ్ సింగ్ దిష్టిబొమ్మల దహనం
Published Fri, Feb 14 2014 2:39 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా సోనియా గాంధీ, దిగ్విజయ్ సింగ్ దిష్టిబొమ్మలను ఉద్యోగులు దహనం చేశారు. జెడ్పీ కార్యాలయంలో ఉద్యోగులు గురువారం విధులు బహిష్కరించి పీఆర్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జెడ్పీ ఎదురుగా నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పీఆర్ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు కిలారి నారాయణ రావు మాట్లాడుతూ ప్రజల మనోభావాలకు సంబంధం లేకుండా ఈ రాష్ట్రంతో సంబంధం లేని వ్యక్తులు, సొంత రాష్ట్రాల్లో పత్తాలేని నేతల నిర్ణయాలే ముఖ్యమా అని ప్రశ్నించారు. వారి నిర్ణయాలే ముఖ్యమైతే సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోనియా డౌన్ డౌన్ అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నేతలు, సమైక్య పరిరక్షణ సంఘ నేతలు కె.శోభారాణి, ధర్మాన సుందరరావు, రామారావు, వినయ్, లక్ష్మణరావు, త్రినాథ రావు, కిరణ్ కుమార్, లక్ష్మీనారాయణ, రవికృష్ణ, వెంకటేశ్వర్లు, అప్పారావు, రామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
యూపీఏ దిష్టిబొమ్మ దహనం
శ్రీకాకుళం కలెక్టరేట్: భయబ్రాంతులను చేసి, దాడులకు పాల్పడి ఉద్యమాలు ఆపలేరని ఎన్జీవో సంఘం నాయకలు, సమైక్యాంద్ర సాధన వేదిక ప్రతినిధులు అన్నారు. సీమాంధ్ర ఎంపీలపై దాడులను నిరసిస్తూ గురువారం సాయంత్రం వైఎస్సార్ కూడలిలో యూపీఏ దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో హనుమంతు సాయిరాం, జామిభీమ శంకర్, కిల్లారి నారాయణరావు, కె.వేణు.గోపాల్, పి.జయరాం, పూజారి జానకిరాం,ఎల్.జగన్‌మోహనరావు, కొంక్యాణ వేణుగోపాల్, ఆర్.వేణుగోపాల్,శిష్టు రమేష్,ఎంఆర్‌కె దాస్, కిలా రి నారాయణరావు, ఎం.కాళీప్రసాద్, కె.అప్పలనాయుడు,డి.విష్ణుమూర్తి ఉన్నారు.
Advertisement