కలెక్టరేట్, న్యూస్‌లైన్: వైద్య ఆరోగ్య పరిస్థితుల ను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వాని కి చెందిన ‘సగటు సమీక్ష మిషన్’ బృందం త్వ రలోనే జిల్లా పర్యటనకు రానుందని, ఈ విషయాన్ని ఎవరూ ఆషామాషిగా తీసుకోవద్దని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ వైద్యాధికారులను సూచించారు. బుధవారం వైద్యాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు వచ్చే కమిటీ పీహెచ్‌సీ నుంచి జిల్లా ఆస్పత్రి, వైద్యాధికారుల కార్యాలయాల్లో ఎక్కడైనా తనిఖీ చేయవచ్చని తెలిపారు. వైద్యాధికారులు, సిబ్బంది వారివారి కార్య స్థానాల్లోనే అందుబాటులో ఉంటూ, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా చూడాలన్నారు.
కమిటీ వచ్చాక ఏమైనా తేడాలొస్తే అందుకు సంబంధిత అధికారులపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. సీనియర్ ఆరోగ్య అధికారులు తక్షణమే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి మాతా శిశు ర క్షణలో భాగంగా రూపొందించిన ‘ట్రాక్’ కా ర్డును తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూ చించారు. అలాగే జననీ సురక్ష యోజన, జనని శిశు సంరక్షక యోజన, జాతీయ గ్రామీణ ఆ రోగ్య మిషన్ నిధులు, పారిశుధ్యం, ఇతర రి జిస్టర్లు, ఇమ్యూనైజేషన్ తదితర అంశాలకు చెం దిన రికార్డులన్నీ సక్రమంగా ఉండేలా చూడాల న్నారు. ఈకమిటీ వైద్యసేవలపై అధ్యయనం చే సి, వాటిపై కేంద్రానికి ఇచ్చే నివేదిక పైనే ైవె ద్యా దికారుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపారు.
గతంలో ఈ కమిటీ జిల్లాకు వచ్చినప్పుడు చాలా వరకు సంతృప్తి వ్యక్తం చేసిందని, అలాగే కొన్ని లోపాలను సరిచేసుకోవాలని సూచించిందన్నారు. ఈసారి లోపాలను ఎత్తిచూపే అవకాశం ఉందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలన్నారు. ఇప్పటినుంచే గ్రామాల్లో ఆశా కార్యకర్తలను అప్రమత్తం చేసి, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో అదనపు జే సీ డా.రాజారాం, జిల్లా వైద్యాధికారి డా.రుక్మిణి, ఐసీడీఎస్ పీడీ ఇందిర, అధికారులు శశికాంత్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.
త్వరలో ‘సగటు సమీక్ష మిషన్’ జిల్లా పర్యటన
Published Thu, Nov 7 2013 4:29 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM
Advertisement