పల్లెవెలుగులో ‘స్పెషల్’ బాదుడు ! | Special buses in Sankranthi Express charge | Sakshi
Sakshi News home page

పల్లెవెలుగులో ‘స్పెషల్’ బాదుడు !

Published Thu, Jan 14 2016 12:09 AM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM

Special buses in Sankranthi Express charge

 ప్రత్యేక బస్సుల పేరుతో ‘పల్లెవెలుగు’లో ఎక్స్‌ప్రెస్ చార్జీ
  జిల్లాకు వచ్చే బస్సుల్లో అత్యంత రద్దీ
 
 విజయనగరం అర్బన్ : దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూక్తిని ఆర్టీసీ ఆచరిస్తోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పండుగ స్పెషల్ పేరుతో పల్లెవెలుగు బస్సుల్లో సైతం ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తోంది. దీంతో ఎక్స్‌ప్రెస్ టికెట్ చెల్లించినా పల్లెవెలుగు సర్వీసులు వెళ్లాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ బుధవారం కూడా ప్రయాణికులతో కిటకిటలాడింది. దూరప్రాంతాల నుంచి రైళ్లల్లో వచ్చి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వేళ్లేందుకు వేలాది మంది కాంప్లెక్స్ వచ్చారు. బస్సుల్లో కూడా ఎక్కువ మంది వస్తున్నారు. పాలకొండ, రాజాం, సాలూరు, పార్వతీపురం, రణస్తలం, శ్రీకాకుళం ప్రాంతాలకు వెళ్లేవారు అధికంగా ఉన్నారు.
 
 మధ్యాహ్నం నుంచి అనూహ్యంగా పెరిగిన రద్దీ
 పట్టణంలోని వివిధ ప్రైవేటు, వ్యాపార సంస్థల్లో పనిచేసిన కార్మిక, చిరుద్యోగులకు పండగ మూడురోజులు మాత్రమే సెలవులు ఇస్తారు.
 
 దీంతో భోగీ ముందు రోజు మధ్యాహ్నం నుంచి సొంత ఊరికి వెళ్లేవారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఆర్టీసీ బస్సులు దొరకని పరిస్థితుల్లో కొందరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా జిల్లాలోని విజయగరం, సాలూరు, పార్వతీపురం, ఎస్.కోట డిపోల నుంచి, విశాఖలోని మద్దిలపాలెం, సింహాచలం డిపోల నుంచి 60 బస్సుల వరకు నడిపారు. అధిక శాతం విశాఖ నుంచి ప్రయాణికులను తీసుకు రావడానికి ఉపయోగించారు. ఆయా డిపోలల్లో ఎక్స్‌ప్రెస్ సర్వీసులు సరిపోకపోవడంతో పల్లెవెలుగు, సిటీ బస్సులను వినియోగించారు. అయితే ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చశారు. స్థానిక బస్ కాంప్లెక్స్ ప్రాంతంలోఆర్టీసీ అధికారులు ఉండి రద్దీకి అనుగుణంగా ఆయా ప్రాంతాల రూట్లకు సిటీ బస్సులు, పల్లెవెలుగు సర్వీసులను నడిపారు. అయితే పల్లెవెలుగు, సిటీ బస్సులు నడిపినా స్టాపులు తగ్గించి ఎక్స్‌ప్రెస్ చార్జీ వసూలు చేస్తున్నట్లు విజయనగరం డిపో మేనేజర్ తెలిపారు.
 
 రెండో వైపు సర్వీసులకు ప్రయాణికులు నిల్
 విశాఖ నుంచి విజయనగరం, బొబ్బిలి, సాలూరు తదితర ప్రాంతాలకు నడిపిన సర్వీసులకు తిరిగి వెళ్లే సమయంలోప్రయాణికులు కరువయ్యారు. బుధవారం దాదాపుగా 70 శాతం సర్వీసులకు రెండో వైపు ప్రయాణికులు లేరు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement