యుద్ధనౌకలో ప్రత్యేక బాలలు | Special children in war | Sakshi
Sakshi News home page

యుద్ధనౌకలో ప్రత్యేక బాలలు

Published Sat, Nov 22 2014 6:48 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

Special children in war

విశాఖపట్నం : నేవీడే సందర్భంగా విద్యార్థులకు యుద్ధనౌకలను సందర్శించే అవకాశం కల్పించారు. శుక్రవారం ప్రత్యేక బాలలు ఐఎన్‌ఎస్ సత్పూరా లో ఆడి పాడి ఉల్లాసంగా గడిపారు. విశాఖలోని పన్నెండు ప్రత్యేక బాలల పాఠశాలల విద్యార్థులు ఈ నౌకను సందర్శించిన వారిలో ఉన్నారు. సత్పూర కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ హరికృష్ణ వారికి స్వాగతం పలికారు.

మ్యాజిక్ షో, భంగ్రా నృత్యాలను వారంతా ఆస్వాదించారు. ప్రత్యేక బా లలు సయితం నృత్యాలు చేసి నావికా దళ సిబ్బంది కుటుంబ సభ్యుల్ని ఆహ్లాదపరిచారు. అశ్వని హరికృష్ణ ఆటపాటల్లో పాల్గొన్న చిన్నారులకు బహుమతులందించారు.

ఈస్ట్రన్ ఫ్లీట్‌కు చెందిన యుద్ధనౌకలు ఐఎన్‌ఎస్ కులిష్, ఐఎన్‌ఎస్ మగర్‌లను పాఠశాలల విద్యార్థులు సంద ర్శిం చారు. శని, ఆదివారాల్లో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రజల సందర్శనకు అనుమతిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement