నష్టాల నివారణకు ప్రత్యేక చర్యలు | Special measures for the prevention of losses | Sakshi
Sakshi News home page

నష్టాల నివారణకు ప్రత్యేక చర్యలు

Published Sun, Jun 8 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 8:27 AM

నష్టాల నివారణకు ప్రత్యేక చర్యలు

నష్టాల నివారణకు ప్రత్యేక చర్యలు

అద్దంకి, న్యూస్‌లైన్ : ఆర్టీసీ ప్రకాశం రీజియన్ పరిధిలో నష్టాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రీజినల్ మేనేజర్ నాగశివుడు తెలిపారు. అద్దంకి ఆర్టీసీ డిపోను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నష్టాలు తగ్గించేందుకు అద్దంకి, మేదరమెట్ల డిపోల పరిధిలో ప్రయాణికులతో రద్దీగా ఉండే భవానీ సెంటర్, బస్టాండ్ సెంటర్, మేదరమెట్ల బస్టాండ్ సెంటర్ల వద్ద కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను నియమించి అక్కడ ఆటోలు తిరగకుండా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
 
అదే విధంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల వేళలను ప్రయాణికులకు తెలియజేయడం, ఆయా సెంటర్ల వద్ద బస్సులను పది నిముషాలపాటు నిలిపి ఉంచి ప్రయాణికులను ఎక్కించడం వంటివి చేయనున్నట్లు చెప్పారు. వారికి తోడుగా ఆర్టీసీ సిబ్బంది ఒకరు అక్కడే ఉంటారని తెలిపారు.
 
అవసరమైతే పోలీసుల సహాయం కూడా తీసుకుంటామన్నారు. ఈ చర్యల్లో భాగంగా రోజుకో ఆర్టీసీ డిపోను తాను సందర్శిస్తానన్నారు. డీజిల్‌ను బయట మార్కెట్లో కొనుగోలు చేయడం వల్ల కూడా ఆర్టీసీకి నష్టం వస్తుందని గుర్తించామన్నారు. ప్రస్తుతం బల్క్ డీజిల్ కొనుగోలు ధర తగ్గడంతో ఇకపై డీజిల్‌ను బల్క్‌గా కొనుగోలు చేసి నష్టాలను తగ్గించేందుకు కృషి చేస్తామని ఆర్‌ఎం పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త డిపోల ఏర్పాటుకు మళ్లీ ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు.
 
పర్సన్ కాస్ట్ పెరగడం వల్ల కూడా నష్టాలు...
జిల్లాలోని ఆర్టీసీ డిపోల్లో నష్టాలు రావడానికి పర్సన్ కాస్ట్ పెరగడం కూడా కారణమని ఆర్‌ఎం తెలిపారు. సీనియర్ కార్మికులకు వేతనాలు, ఇతర బిల్లుల చెల్లింపులు పెరగడం వల్ల పర్సన్ కాస్ట్ విపరీతంగా పెరిగిందని చెప్పారు. జిల్లావ్యాప్తంగా చూసుకుంటే కిలోమీటర్‌కు 11.67 రూపాయలుగా పర్సన్ కాస్ట్ ఉందన్నారు.
 
అద్దంకి డిపోలో రూ.13.27, ఒంగోలు డిపోలో రూ.14.28, చీరాల డిపోలో రూ.12.75, కందుకూరు డిపోలో రూ.13.67, కనిగిరి డిపోలో రూ.8.82, మార్కాపురం డిపోలో రూ.9.89, పొదిలి డిపోలో రూ.10.40, గిద్దలూరు డిపోలో రూ.10.67గా పర్సన్ కాస్ట్ ఉందని ఆయన వివరించారు. దీనివల్ల కూడా నష్టాలు వస్తున్నాయని పేర్కొన్నారు.
 
100 మందికి పోస్టింగ్‌లు...
జిల్లాలోని ఆర్టీసీ డిపోలకు కొత్తగా 247 మంది సిబ్బందిని ఎంపిక చేయగా, వారిలో 100 మందికి డ్రైవర్లుగా పోస్టింగ్‌లు ఇచ్చినట్లు ఆర్‌ఎం తెలిపారు. మరో 110 మంది శిక్షణలో ఉన్నట్లు వెల్లడించారు. కండక్టర్లు, డ్రైవర్లకు రోజుకు 8 గంటలకు మించి డ్యూటీ వేయడం లేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దూరప్రాంతాలకు వెళ్లే బస్సులకు ఇద్దరు డ్రైవర్లను ఏర్పాటు చేస్తుండటం వల్ల వారికి మళ్లీ డ్యూటీ వేస్తున్నట్లు చెప్పారు. మొత్తంమీద 8 గంటలే డ్యూటీ వేస్తున్నామన్నారు.
 
 అన్ని డిపోల్లో నష్టాలు...
 జిల్లాలోని 8 డిపోల్లో నష్టాలు వస్తున్నట్లు ఆర్‌ఎం నాగశివుడు వెల్లడించారు. గత ఏడాది అన్ని డిపోల్లో కలిపి రూ.2.11 కోట్లు, ఈ ఏడాది రూ.2.58 కోట్లు నష్టం వచ్చిందన్నారు. దానికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement