ప్రత్యేక హోదాతో అందరికీ లబ్ధి
బలవంతపు భూసేకరణతో ఆహార భద్రతకు ముప్పు
దోచుకున్న డబ్బు దాచుకునేందుకు బాబు తంటాలు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
యలమంచిలి/పాయకరావుపేట : రాజధాని పేరి ట బలవంతపు భూసేకరణతో భవిష్యత్తులో ఆహా ర భద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యే క హోదా ఇస్తే ప్రతి పౌరుడికి లబ్ధి చేకూరుతుందన్నారు. ప్యాకేజీ ఇస్తే చంద్రబాబునాయుడు, మంత్రులు, టీడీపీ నేతలు మాత్రమే ప్ర యోజనం పొందుతారన్నారు. అందుకే ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై చంద్రబాబునాయుడు ఒత్తిడి తేవడం లేదని ఆరోపించారు. ఆదివారం యలమంచిలి, పాయకరావుపేటల్లో జరిగిన ఆ యా నియోజవర్గాల వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతల సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. ప్రత్యేక హోదాతో కలిగే ప్రయోజనాలను గ్రామస్థాయిలో ప్రజలకు తెలియజెప్పి పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈనెల 29న బంద్ విజయవంతం చేయాలని కోరారు. ఓటుకు నోటు వ్యవహారంలో సీబీఐ విచారణ నుంచి బయటపడేందుకు చంద్రబాబునాయుడు ఏపీ ప్రత్యేక హోదాను పణంగా పెట్టారని ఆరోపించారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందన్నారు. ఈ కమిటీలను రద్దుచేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా జిల్లాలోని చక్కెర కర్మాగారాలను నష్టాల్లోకి నెట్టి ప్రైవేటీకరించేందుకు చూస్తున్నారని ఆరోపించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడుని ప్రజలు రాళ్లతో కొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు.
మాజీ ఎమ్మెల్యే గొల్లబాబూరావు మాట్లాడుతూ ఓటుకు నోటుకేసులో చంద్రబాబు జై లుకెళ్లడం ఖాయమన్నారు. యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ బంద్‌ను అందరి సహకారంతో విజయవంతం చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు మాట్లాడుతూ పదవికోసం సొంతమామనే వెన్నుపోటు పొడిచారన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో అధికారపార్టీ ఆగడాలకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లో ఉన్నాయన్నారు. తనకు కేసులు కొత్తకాదన్నారు. కార్యకర్తలపై ఈగకూడా వాలనివ్వనన్నారు. అనంతరం విజయసాయిరెడ్డిని ఘనంగా సన్మానించారు. రెండు సమావేశాల్లో పార్టీ అధికార ప్రతినిధి కొయ్యప్రసాద్‌రెడ్డి, రాష్ట్రకార్యదర్శులు చల్లామధుసూదన్‌రెడ్డి, పక్కి దివాకర్, సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణ, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ చిక్కాలరామారావు, ఎంపీపీలు అల్లాడ శివ, వరహాలమ్మ, కోటవురట్ల జెడ్పీటీసీ లక్ష్మి, డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు అయినంపూడి మణిరాజు, సీనియర్‌నాయకులు బొలిశెట్టిగోవిందు, దనిశె ట్టిబాబూరావు, పాయకరావుపేట సర్పంచ్ నాగమణి పాల్గొన్నారు.