కాకినాడకు ప్రత్యేక రైళ్లు | special trains for kakinada | Sakshi
Sakshi News home page

కాకినాడకు ప్రత్యేక రైళ్లు

Published Sat, Jan 4 2014 1:51 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

special trains for kakinada

సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాచిగూడ-కాకినాడ, హైదరబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సాంబశివరావు తెలిపారు. కాచిగూడ-కాకినాడ (07337) ప్రత్యేక రైళ్లు 8, 10, 12, 14 తేదీల్లో రాత్రి 11.30కు కాచిగూడలో బయల్దేరతాయి. తిరుగు ప్రయాణంలో కాకినాడ-కాచిగూడ (07338) రైళ్లు 9, 11, 13, 15 తేదీల్లో సాయంత్రం 7.05కు కాకినాడ నుంచి బయల్దేరతాయి. నల్లగొండ, నడికుడి, గుంటూరు, విజయవాడ, తాడేపల్లిగూడెం, సామర్లకోట తదితర స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. హైదరాబాద్-కాచిగూ డ (07101) రైళ్లు 16, 18 తేదీల్లో రాత్రి 11.10కి నాంపల్లిలో బయల్దేరతాయి.

 

తిరుగు ప్రయాణంలో కాకినాడ-హైదరాబాద్ (07102) రైళ్లు 17, 19 తేదీల్లో సాయంత్రం 4గంటలకు కాకినాడలో బయల్దేరతాయి. సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి తదితర స్టేషన్లలో ఆగుతాయి. ఇక, సికింద్రాబాద్-గుంటూరు-సికింద్రాబాద్ (12706/ 12705), హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్-హైదరాబాద్ (17011/17012) ఎక్స్‌ప్రెస్ రైళ్లకు వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో 5 నుంచి హాల్టింగ్ కల్పించనున్నట్టు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement