ప్రారంభానికి ముందే పడిపోయింది | Sri Chaithanya School Collapsed In YSR Kadapa | Sakshi
Sakshi News home page

ప్రారంభానికి ముందే పడిపోయింది

Published Tue, Jun 5 2018 12:03 PM | Last Updated on Tue, Jun 5 2018 12:03 PM

Sri Chaithanya School Collapsed In YSR Kadapa - Sakshi

దెబ్బతిన్న శ్రీచైతన్య పాఠశాల ముందు భాగం

 ప్రొద్దుటూరు కల్చరల్‌ : ప్రారంభానికి ముందే పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల భవన ముందు భాగం కూలిపోయింది. ఆదివారం వర్షం కురిసిన సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో పాఠశాల భవన నిర్మాణాల్లో నాణ్యత బట్టబయలైందని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. విద్యా శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా బొల్లవరంలో నూతనంగా శ్రీచైతన్య పాఠశాల ఏర్పాటు చేశారు. దీన్ని ఈ విద్యాసంవత్సరంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడంతో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సానికి పాఠశాల ముందుభాగం కూలిపోయింది.

ఈ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పాఠశాల ప్రారంభమై విద్యార్థులు ఉంటే పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం పట్టణంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వేలాది రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుంచి వసూలు చేసే కార్పొరేట్‌ విద్యాసంస్థలు నాణ్యతను పట్టించుకోకపోవడంతోనే ఈ సంఘటన జరిగిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఉపవిద్యాశాఖాధికారి పెంచలయ్యను వివరణ కోరగా మంగళవారం పాఠశాలను పరిశీలిస్తానని  తెలిపారు.

అధికారులు చర్య తీసుకోవాలి
శ్రీచైతన్య పాఠశాలకు అనుమతి ఇచ్చే ముందు అధికారులు భవనాన్ని పరిశీలించాలి. లోపాలు ఉంటే పాఠశాలకు అనుమతి ఇవ్వొద్దు. విద్యార్థులు ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగి ఉంటే అందుకు బాధ్యత ఎవరు వహిస్తారు. నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడంతో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. – మస్తాన్,ఏఐఎస్‌బీ రాయలసీమ కన్వీనర్, ప్రొద్దుటూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement