
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌లు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత కరోనా క్లిష్ట సమయంలో సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల పట్ల స్పందించి.. అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే థియేటర్ల ఫిక్స్‌డ్ పవర్ చార్జీల రద్దు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ మేరకు బుధవారం ట్విటర్ వేదికగా రాజమౌళి ఓ పోస్ట్ చేశాడు. కాగా లాక్‌డౌన్ కారణంగా మూతపడ్డ సినిమా షూటింగ్స్ జూలై 15 తరువాత తిరిగి ప్రారంభించేందుకు సీఎం వైఎస్ జగన్ అంగీకరించిన విషయం తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో సినీ రంగాన్ని ప్రోత్సహించడానికి వీలుగా విశాఖపట్టణంలో సినిమా స్టూడియోలు నిర్మించుకోవాలనుకునే వారికి తక్కువ ధరకు స్థలాలు కేటాయించడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు. (చిత్రపరిశ్రమ అభివృద్ధికి జగన్‌గారు ముందుంటానన్నారు)
Comments
Please login to add a commentAdd a comment