అనంతపురం మెడికల్ : జిల్లాలోని పేదలకు ఏదైనా జబ్బు వస్తే వెంటనే గుర్తుకొచ్చేది అనంతపురం పెద్దాస్పత్రి. ప్రైవేటు వైద్యం చేరుుంచుకునే స్తోమత లేనివారు నేరుగా ఇక్కడికొస్తుంటారు. నిత్యం వేలాదిమంది రోగులతో ఆస్పత్రి కిటకిటలాడుతూ ఉంటుంది. రోజూ 700 మంది ఇన్ పేషెంట్లు, 1,500 నుంచి రెండు వేల మంది ఔట్‌పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. బోధనాస్పత్రి (వైద్య కళాశాల, ఆస్పత్రి)గా ఉన్నప్పటికీ అందుకు తగ్గ వసతులు లేవు. పడకలు, వైద్యులు, సిబ్బంది కొరత.. వంటి సమస్యలు వేధిస్తున్నారుు. 2010లో 500 పడకల ఆస్పత్రిగా రూపాంతరం చెందినా... ఆ స్థాయిలో సౌకర్యాలు మెరుగుపడలేదు. 124 జీవో కింద 510 పారామెడికల్ పోస్టులు భర్తీ కావాల్సి ఉండగా.. అందులో వంద వరకు మాత్రమే భర్తీకి నోచుకున్నారుు.
ఉన్న సౌకర్యాలతోనే ‘సూపర్ స్పెషాలిటీ’ వైద్యాన్ని అందించడానికి కృషి చేస్తున్నామని చెబుతున్నారు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు. ఈయన ప్రముఖ జనరల్ ఫిజీషియన్‌గా, ప్రొఫెసర్‌గా పేరొందారు. సర్వజనాస్పత్రి ‘పెద్ద’గా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు. అక్యుట్ మెడికల్ కేర్(ఏఎంసీ), నవజాతి శిశు చికిత్స విభాగం (ఎస్‌ఎన్‌సీయూ), ఐసీయూ, గైనిక్, పీడియాట్రిక్స్ తదితర విభాగాలలో కార్పొరేట్ తరహా వైద్యం అందేలా చర్యలు చేపట్టారు. ఈయన ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారి.. ఆస్పత్రంతా కలియదిరిగారు. రోగులు, సిబ్బంది సమస్యలను తెలుసుకున్నారు. ఆ వివరాలిలా...
ఐసీసీయూ వార్డులో...
డాక్టర్ వెంకటేశ్వరరావు : బాబూ.. నీ పేరేంటి? ఏ సమస్యతో ఇక్కడికొచ్చావ్?
సుధాకర్ నాయుడు సార్! యూంజియోప్లాస్టీ చేయించుకున్నా. మళ్లీ నొప్పిగా ఉంటే వచ్చా.
వెంకటేశ్వరరావు : వైద్యం సకాలంలో అందుతోందా?
బాగా చూస్తున్నారు సార్.
వెంకటేశ్వరరావు : ఏం పేరమ్మా? ఎన్ని రోజులుగా ఆస్పత్రిలో ఉంటున్నారు?
నా పేరు షాను సార్.. గుండె సమస్య ఉంది. నిన్ననే అడ్మిట్ అయ్యా. వేరే ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు. మళ్లీ నొప్పిగా ఉంటే ఇక్కడికొచ్చా.
వెంకటేశ్వరరావు : డాక్టర్ గారూ.. మీపేరేంటి? ప్రొఫెసర్లు ఏవిధంగా సహకరిస్తున్నారు?
నా పేరు రజిత. హౌస్‌సర్జన్‌ను. మార్చికి ఇంటర్నషిప్ అయిపోతుంది. ప్రొఫెసర్లు స్నేహపూర్వకంగా ఉంటారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే రియూక్ట్ అవుతారు.
ఏఎంసీలో...
వెంకటేశ్వరరావు : ఏం పేరమ్మా?.. ఏ సమస్యతో ఇక్కడికొచ్చారు?
పుష్పలత సార్. మా తాతకు బాగోలేకపోతే అడ్మిట్ చేయించాం. పదహైదు దినాలైంది వచ్చి. మక్కి ఆపరేషన్ చేశారు. ఫెయిల్ అయ్యింది.
వెంకటేశ్వరరావు : స్టాఫ్‌నర్స్.. ఇక్కడ సేవలు ఎలా అందుతున్నారుు?
స్టాఫ్‌నర్సు మేరీ ప్రభావతి : బెస్ట్ ట్రీట్‌మెంట్ అందిస్తున్నాం. ప్రైవేట్ ఆస్పత్రులు తిరస్కరించిన కేసులను ఇక్కడ విజయవంతంగా చూస్తున్నాం. కోలుకున్నాక ఇతర వార్డుల్లోకి మార్చుతున్నాం.
వెంకటేశ్వరరావు:మీ సమస్యలేమైనా ఉన్నాయా?
మేరీ ప్రభావతి : స్టాఫ్‌నర్సుల కొరత చాలా ఉంది. పనిభారం అధికంగా ఉంది. సుమారు 150 పోస్టులు భర్తీ కావాలి. చాలా ఇబ్బందులు పడుతున్నాం. సెలవులు కూడా తీసుకోలేనంత ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం స్పందిస్తే బాగుంటుంది.
గైనిక్ వార్డు (ఆరోగ్యశ్రీ విభాగం)లో..
వెంకటేశ్వరరావు : (రోగి వెంకటరమణమ్మతో..) ఇక్కడ డబ్బులేమైనా ఖర్చయ్యూయూ?
వెంకటరమణమ్మ : గర్భసంచి సమస్యతో చేరా. ఫ్రీగానే చూస్తున్నారు. బాగా వైద్యం చేస్తున్నారు.
వెంకటేశ్వరరావు : ఏం పేరమ్మా? ఎన్నో కాన్పు, బాగా చూశారా?
నా పేరు నాగమణి సార్. మొదటి కాన్పు. నిన్ననే డెలివరీ అరుు్యంది. బాగా చూస్తున్నారు.
వెంకటేశ్వరరావు : స్టాఫ్‌నర్సు.. ఇక్కడ సమస్యలేమైనా ఉన్నాయ?
స్టాఫ్‌నర్సు యూస్మిన్ : ప్రతి 5 మంది రోగులకు ఒక్క స్టాఫ్‌నర్సు ఉండాలి. ఇక్కడేమో 50 మందికి ఒక్కరు చూసుకోవాల్సి వస్తోంది. చాలా ఇబ్బందిగా ఉంది సార్.
ఎస్‌ఎన్‌సీయూలో..
వెంకటేశ్వరరావు : ఏ తరహా కేసులు వస్తుంటాయ్ డాక్టర్ గారూ?
డాక్టర్ శ్రీనివాసులు : ప్రీమెచ్యూర్డ్, జాండీస్, సెప్సిస్ కేసులు అధికంగా వస్తున్నారుు. మెరుగైన వైద్యం అందజేస్తున్నాం. ప్రైవేటుగా చూపించుకోవాలంటే రోజుకు రూ.3 వేలు అవుతుంది. ఇక్కడ పైసా ఖర్చు లేకుండా చూస్తున్నాం.
వెంకటేశ్వరరావు : ఏమ్మా.. ఎవరికి బాగలేదు? ఇక్కడికొచ్చాక ఏమైనా ఇంప్రూవ్ అయ్యిందా?
అరుణ : నాకు కవల పిల్లలు పుట్టారు సార్. పాపకు బాగోలేదు. ఇక్కడ అడ్మిట్ చేశాక ఆరోగ్యం మెరుగుపడింది.
వెంకటేశ్వరరావు : మీదేం సమస్య?
వెంకటేశ్వరరావు : పిల్లోడు ఉమ్మనీరు తాగాడు. ఇప్పుడు బాగున్నాడు.
బ్లడ్‌బ్యాంకులో..
వెంకటేశ్వరరావు :రోజుకు ఎంత మందికి రక్తాన్ని అందిస్తున్నారు?
స్టాఫ్‌నర్సు ఆంథోని మేరీ : ప్రతి రోజూ 30 బ్యాగులు ఇస్తున్నాం. 905 యూనిట్ల స్టోరేజీ ఉంది. బయటి వ్యక్తులకు బ్యాగు రూ.850లతో సరఫరా చేస్తున్నాం.
చిన్నపిల్లల వార్డులో..
వెంకటేశ్వరరావు : ఏమ్మా..ఎవరికి బాగోలేదు?
నా కొడుక్కు బాగోలేదు. ఇక్కడ ట్రీట్‌మెంట్ బాగుంది సార్.
వెంకటేశ్వరరావు : పాపకు ఏమైంది?
మారక్క : జ్వరం వస్తుంటే ఇక్కడికి తెచ్చా. ఇప్పుడు మేలు.
ఓపీ బ్లాక్‌లో...
వెంకటేశ్వరరావు : రోజూ ఎంత మంది వస్తుంటారు? ఓపీ ఎన్ని గంటలకు తెరుస్తున్నారు?
సిబ్బంది : వెరుు్య మందికి పైగానే వస్తుంటారు. ఉదయం 8.30 నుంచి ఓపీ చీటీలిస్తున్నాం.
వెంకటేశ్వరరావు :రోగులు ఇబ్బందులు పడకుండా త్వరగా ఇవ్వండి.
యూంటినేటల్ ఓపీలో..
వెంకటేశ్వరరావు :అమ్మా.. ఎన్నో కాన్పు ?
భారతి : మూడో కాన్పు సార్. గతంలో రెండు కాన్పులు ఇక్కడే చేయించుకున్నా. ఎలాంటి ఇబ్బందీ రాలేదు. ఇప్పుడు కూడా బాగా చూస్తున్నారు.
వెంకటేశ్వరరావు :హెచ్‌ఓడీ గారూ..మీ సమస్యలేమైనా ఉన్నాయూ?
ఇన్‌చార్జ్ హెచ్‌ఓడీ షంషాద్ బేగం : ప్రతి రోజూ 50-60 కేసులు చూస్తున్నాం. గర్భిణులకు 5,7,9 నెలల్లో అల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తున్నాం. దీంతో పాటు రోటీన్ పరీక్షలు చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే కేసులతో సమస్య ఏర్పడుతోంది. చివరి క్షణంలో తెస్తున్నారు. హై రిస్క్ కేసులు వస్తున్నారుు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో గర్భిణులకు కౌన్సెలింగ్ ఇప్పిస్తే బాగుంటుంది. చాలామంది గర్భిణులు అవగాహన లోపంతో సరైన పౌష్టికాహారం తీసుకోవడం లేదు. దీనివల్ల రక్తహీనతతో బాధపడుతున్నారు.
వెంకటేశ్వరరావు : ఏమ్మా.. ఎందుకు ముఖానికి గుడ్డ కట్టుకున్నావ్?
మహిళ : అదేందో స్వైన్‌ఫ్లూ అంట. అందరూ ముఖానికి గుడ్డ కట్టుకోవాలన్నారు. అందుకే కట్టాను.
వెంకటేశ్వరరావు : స్వైన్‌ఫ్లూతో భయపడాల్సిన పనిలేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
సిబ్బంది కావాలి
Published Mon, Feb 9 2015 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM
Advertisement
Advertisement