Government hospital
-
వైరల్ వీడియో: ‘మీ అమ్మనో.. అక్కనో.. వీడియోలు తీయండ్రా!’.. అసలు కథ వేరే ఉంది!
-
వైరల్ వీడియో: దవాఖానాలో పాముల హల్చల్
-
Karimnagar: కీచకుడిగా మారిన ప్రభుత్వాసుపత్రి కాంట్రాక్టు ఉద్యోగి
సాక్షి, కరీంనగర్: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా ఉద్యోగులకు రక్షణ లేకుండా పోతోంది. కీచకుడిగా మారిన ఓ కాంట్రాక్టు ఉద్యోగి వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. గత ఏప్రిల్‌లో ఓ వార్డు బాయ్ నర్సుపై అత్యాచారయత్నం ఘటన మరువకముందే మరో కామాంధుడి లీలలు వెలుగు చూశాయి. ఆసుపత్రిలోని మొదటి ఫ్లోర్లో గల ఆసుపత్రి అనుబంధ విభాగంలో పనిచేసే ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి గత కొద్ది నెలలుగా మహిళా ఉద్యోగులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. వారిని లోబర్చుకునేందుకు వెకిలి చేష్టలతో వేధిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల హద్దులు దాటి లైంగిక వేధింపులకు గురిచేయడంతో సహనం కోల్పోయిన బాధితులు దీటుగానే ఎదిరించినట్లు సమాచారం. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆసుపత్రి ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయగా తూతూమంత్రంగా చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ప్రధాన ఆసుపత్రి నుంచి ఎంసీహెచ్‌కు స్థాన చలనం కల్పించగా అక్కడా విధులు నిర్వహించకుండా తనకు కోవిడ్ పాజిటివ్ అని చెప్పి, విధులకు ఎగనామం పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. కీచకుడిగా మారిన సదరు ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోకుండా స్థానచలనం కల్పించి, చేతులు దులుపుకోవడం పట్ల బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ కీచకుడిని విధుల నుంచి తొలగించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ విషయమై బాధితులు హెచ్ఆర్సీని కూడా ఆశ్రయించినట్లు, హెచ్ఆర్సీ బాధ్యులు నాలుగు రో జుల క్రితం ఆసుపత్రికి వచ్చినట్లు తెలిసింది. చదవండి: దొంగతనం ఆరోపణతో ఆదివాసి హత్య -
ఏపీలో మొట్టమొదటి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం
-
వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అనంత ఫైర్..
సాక్షి, అనంతపురం: జీజీహెచ్‌లో వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అనంత వెంకటరామి రెడ్డి సీరియస్ అయ్యారు. సోమవారం రోజున అనంతపురం జీజీహెచ్‌లో కరోనా బాధితులను స్వయంగా పరామర్శించిన ఆయన వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బాధితులపై చిన్నచూపు తగదు. వైద్యులు మానవతా థృక్పథంతో వ్యవహరించాలి. ప్రభుత్వం అన్ని వసతులు కల్పించినా ఎందుకీ నిర్లక్ష్యం...? ప్రభుత్వ వైద్యుల్లో బాధ్యత పెరగాలి. కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించాలి. కరోనా కష్టకాలంలో ప్రైవేటు డాక్టర్ల దోపిడీ తగదు. కరోనా పరీక్షల పేరుతో ఒక్కొ సీటీ స్కాన్‌కు రూ. 5,000 వసూలు చేయటం బాధాకరం. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీపై కఠిన చర్యలు తప్పవు!. కరోనా బాధితులకు భరోసా ఇవ్వాల్సింది వైద్యులే. కోవిడ్ వారియర్స్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాల అండగా ఉంటారని' ఎమ్మెల్యే అనంత పేర్కొన్నారు. ('కరోనా వైద్యం ఫ్రీగా అందిస్తున్న ఏకైక సీఎం జగన్') -
కరోనా బాధితులకు అత్యుత్తమ సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యుత్తమ సేవలు అందుతున్నాయని, అధికార యంత్రాంగం స్పందిస్తున్న తీరు ఎంతో బాగుందని ఏవీఎం (అంజనీ విజయ మహిత) స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు అంజని యలమంచిలి పేర్కొన్నారు. అయితే కరోనా విషయంలో ప్రభుత్వం, వైద్యులపై దుష్ప్రచారం జరుగుతున్నట్లు తన స్వీయ అనుభవంలో తేటతెల్లమైందన్నారు. కోవిడ్ బారిన పడ్డ తన భర్త, కుమార్తె కోలుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం, స్థానికుల తోడ్పాటు మరువలేనిదన్నారు. విజయవాడలో ఏవీఎం స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి గత కొన్నేళ్లుగా చిన్నపిల్లలు, మహిళల రక్షణ, సామాజిక రుగ్మతలపై చైతన్యం చేస్తున్న అంజని ‘సాక్షి’తో మాట్లాడుతూ కరోనాపై తన అనుభవాలను వివరించారు. ► ఓ వీధిలో కరోనా వచ్చిందంటే ఆ దరిదాపులకు కూడా ఎవరూ వెళ్లని పరిస్థితి. ఉన్నట్లుండి రుచి, వాసన తెలియడం లేదని నా కూతురు ఓ రోజు బాంబు పేల్చింది. ఆ సాయంత్రమే మా వారికి జ్వరం వచ్చింది. ఇద్దరివీ అనుమానించదగ్గ లక్షణాలే కావడంతో కోవిడ్ టెస్ట్‌లు చేయించాం. ఇద్దరికీ పాజిటివ్ అని మర్నాడు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ► ఇంట్లో మిగతావారికి, పనివారికి పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. ► మన ఇంట్లో వారికి కరోనా వచ్చిందనే భయం కంటే చుట్టుపక్కలవారు ఏమనుకుంటారో? సాటివారు ఎలా ప్రవర్తిస్తారో? స్నేహితులు, బంధువులు ఎలా చూస్తారో? అనే ఆందోళనే ఎక్కువగా బాధిస్తుంది. ► మావారు 30 ఏళ్లుగా శ్వాస సంబంధ (ఆస్తమా) బాధితులు. అలాంటి వారు కరోనా నుంచి కోలుకోవడం కష్టమనే అభిప్రాయం తప్పని రుజువైంది. ► వైద్యుల సూచనలతో మావారిని, కుమార్తెను ఇంట్లోనే (హోం ఐసోలేషన్) ఉంచి చికిత్స అందించారు. వైద్య ఆరోగ్యశాఖతోపాటు 8 డిపార్ట్మెంట్లకు చెందిన సిబ్బంది నిరంతరం పర్యవేక్షించారు. వారిద్దరూ కోలుకునేవరకు ప్రభుత్వ యంత్రాంగం ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు ఆరా తీసింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎంతో సానుకూల ధృక్పథంతో వివరించారు. ► మావారు రెండు వారాల్లోనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోలుకున్నారు. కరోనా రోగుల పట్ల ప్రభుత్వ యంత్రాంగం చూపుతున్న కరుణను ప్రత్యక్షంగా చూశా. వైద్యులు, సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి మనకు సేవలు చేస్తున్నారు. -
కేసీఆర్ వారిని శిక్షించకూడదు
సాక్షి, కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తన కుటుంబ సంక్షేమే తప్ప ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రజలను కాపాడాల్సిన పాలకులు వారిని శిక్షించకూడదు అని భట్టి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రిని మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, ఇతర సీనియర్ నాయకులతో కలిసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు పరిశీలించారు. అనంతరం మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై.. కేసీఆర్ ప్రభుత్వం ఆరేళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రులను భయంకరంగా నిర్వీర్యం చేసిందని అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారిని నిర్లక్ష్యం చేసిందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు అదనంగా ఒక్క భవనం నిర్మించలేదని, కొత్తగా ఎక్విప్మెంట్ ఇవ్వడంగానీ, మందులు సక్రమంగా సరఫరా చేయడంకానీ చేయలేదని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన బెడ్ షీట్స్ కూడా సరిగ్గా అందించక పోవడం దురదృష్ట కరమని పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఉన్న బెడ్స్ సరిపోక మడత మంచాలు వేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు ఎక్కడ? కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 350 పడకలు ఉన్నాయి. దీనికి అదనంగా మాత, శిశు సంక్షేమం కింద 150 పడకలను గత కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది. దీనితో మొత్తం ఆసుపత్రిలో పడకల సంఖ్య 500కు చేరింది. ఇందులో కేవలం 200 పడకల ఆసుపత్రిలో ఉండే సిబ్బంది మాత్రమే ఉన్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమని భట్టి అన్నారు. సివిల్ సర్జన్స్ 28 మందికిగానూ నలుగురు, 109 మంది నర్సులకుగాను 61 మంది, 13 మంది లాబ్ టెక్నీషియన్స్ ఉండాల్సి ఉండగా కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారని వివరించారు. మహిళలకు పురుషులతో ఈసీజీ టెస్టులా? మహిళా రోగులకు పురుషులతో ఈసీజీ పరీక్షలు నిర్వహించే అత్యంత దురదృష్టకర పరిస్తితులు కరీంనగర్ పెద్దాసుపత్రిలో ఉన్నాయి. మేల్ టెక్నీషియన్స్‌తో ఈసీజీ పరీక్షలు చేయించుకోలేక మహిళలు బయటకు వెళుతున్నారని ఇది అత్యంత బాధాకరమని భట్టి అన్నారు. శానిటేషన్ కు సంబంధించిన స్టాఫ్ కూడా ఎవ్వరు లేరని భట్టి అన్నారు. ఆరోగ్యమంత్రికి కనీసం ఆసుపత్రులను పట్టించుకుంటున్నాడా కరీంనగర్ జిల్లాకు చెందిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రస్తుతం ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులపై కనీసం సమీక్ష అయిన చేసారా అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. జిల్లా ఆసుపత్రిని చూస్తే ఆయన శాఖను పరిశీలిస్తున్నట్లు లేదని అన్నారు. మందులు లేవు, బెడ్ షీట్స్ లేవు, మంచాలు లేవు, కావాల్సిన స్థాయిలో వైద్యులు, ఇతర సిబ్బంది లేరని.. అసలు ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి వీటిని చూస్తున్నారా అన్న అనుమానం కలుగుతోందని అన్నారు. 500 పడకల ఆసుపత్రికి తగినంత సిబ్బందిని వెంటనే రిక్రూట్ చేయాలని భట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆందోళనలో ఆరోగ్య మంత్రి వైద్య, ఆరోగ్య మంత్రి స్వీయ ఆందోళనలతో శాఖను మర్చిపోయినట్లు ఉన్నదని అన్నారు. కేవలం తన రాజకీయ ఆందోళనలో పడి.. ఇతర విషయలను పట్టించుకోవడం లేనట్లు ఉందని, అందుకే రాష్ట్రం జ్వరాల బారిన పడి ఉందని అన్నారు. ఈటల రాజేందర్‌కు ఆ పార్టీ అధినాయకత్వానికి వాటాల పంపకంలో వచ్చిన తేడాలకు మాకు సంబంధం లేదు.. మీరు రూ. 5 వేలు లంచం కూడా తీసుకోలేదని చెబుతున్నారు.. ఆది మీరు.. మీ నాయకత్వం తేల్చుకోవాల్సిన విషయం..కానీ అవినీతి మాత్రం జరిగిందని.. మీ నాయకులు ప్రశ్నించడంతో మీరు మనస్తాపం చెందారని భట్టి చెప్పారు. మొత్తం అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
గర్భిణి అని చెప్పినా వినకుండా..
సాక్షి, శ్రీకాకుళం : స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రసవ వేదనతో చేరిన గర్భిణిని రెండు రోజుల వరకు ఉంచుకుని, ఆ తర్వాత వైద్యులు వెనక్కి పంపేయడంతో బంధువులు, కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. చివరకు గత్యంతరం లేక స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి ప్రసవం చేయించారు. జలుమూరు మండలం కామునాయుడుపేటకు చెందిన కింజరాపు నీలవేణికి నెలలు నిండటంతో 108 వాహనంలో శుక్రవారం ఉదయం నరసన్నపేట ఆసుపత్రికి ఆశావర్కరు తిరుపతమ్మ సహాయంతో తీసుకువచ్చారు. ఇక్కడ చికిత్సకు వైద్యులు లేరంటూ సాధారణ తనిఖీలు చేసి ఉంచారు. శనివారం ఉదయం గర్భిణికి ప్రసవం చేసేందుకు ఆపరేషన్‌కు సిద్ధం చేశారు. అయితే ఎనస్థీషియా డాక్టర్ వచ్చి తనిఖీ చేసి నీలవేణికి గుండె జబ్బు ఉందని, ఇక్కడ ఆపరేషన్ చేయలేమని వెళ్లిపోయారని భర్త అప్పలనాయుడు, కుటుంబ సభ్యులు పీ భారతి, ఎం నిర్మల, సత్యవతి వాపోయారు. ఈ విషయం చివరి నిమషంలో చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. మొదటి కాన్పు ఇక్కడే చేశారని, రెండో కాన్పునకు ఈ విధంగా చెప్పడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చించగా, అక్కడ వైద్యులు ఎటువంటి కారణాలు చూపలేదని ఆపరేషన్ చేస్తామని హామీ ఇచ్చారని భర్త అప్పలనాయుడు తెలిపారు. ఈ విషయమై స్థానిక ఎనస్థీషియా డాక్టర్ ప్రసాదరావును వివరణ కోరగా నీలవేణికి థైరాయిడ్ ఉందని, గుండెకు సంబంధించిన జబ్బు ఉందని, రిస్క్ చేయలేక శ్రీకాకుళం రిమ్స్‌కు వెళ్లాలని సూచించామన్నారు. అంతే తప్ప బలవంతంగా పంపలేదన్నారు. -
సేవకో రేటు!
సాక్షి, అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో కొందరు సిబ్బంది.. సేవలకు రేటు కట్టారు. ఒక్కోసేవకు రేటు ఫిక్స్ చేసి ఇక్కడికొచ్చేవారి జేబులు ఖాళీ చేస్తున్నారు. పేదలమని డబ్బులివ్వకపోతే...నోటికి పని చెబుతారు. అందరిముందే దుర్భాషలాడుతూ పరుపుతీస్తారు. అందుకే ధర్మాస్పత్రికి వచ్చేందుకే జనం జంకుతున్నారు. సిబ్బందితోనే... ఇబ్బంది సర్వజనాస్పత్రిలోని గైనిక్, లేబర్ వార్డు సిబ్బంది (వైద్యులు, స్టాఫ్‌నర్సులు కాదు) తీరుతో ఇక్కడికి ప్రసవాలకు వచ్చే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది అడిగినంత ఇవ్వకపోతే పురిటి నొప్పుల కంటే ఇక్కడి సిబ్బంది పెట్టే టార్చరే ఎక్కువగా ఉంటుందని గర్భిణీలు, బాలింతలు వాపోతున్నారు. బాలింతలకు ‘జనని సురక్ష యోజన’ కింద ప్రభుత్వం ఇచ్చే డబ్బు కన్నా ముందే సిబ్బందికి రూ.1,500 వరకు ముట్టజెప్పాల్సి వస్తోందంటున్నారు. రూ.500 సరిపోదమ్మా ‘‘సిజేరియన్ చేసిన వెంటనే బాబును శుభ్రం చేశాం. మరీ రూ.500 ఇస్తే ఏం సరిపోతుంది. మేము చాలా మందిమి ఉన్నాం...’’ అని వైద్యసిబ్బంది డిమాండ్ చేస్తున్నారని రాప్తాడు మండలం గొందిరెడ్డి పల్లికి చెందిన బాలింత సునీత వాపోయింది. ఆమెకు జూన్ 25న ఆస్పత్రిలోని లేబర్ వార్డులో సిజేరియన్ చేయగా...ఇక్కడి సిబ్బంది డబ్బుకోసం ఇబ్బంది పెట్టారని చెబుతోంది. ఇక స్ట్రెచ్చర్ నుంచి గైనిక్ వార్డుకి తీసుకొచ్చినందుకు రూ 100, చీర మార్చినందుకు రూ 100, కుట్లు శుభ్రం చేస్తున్నందుకూ రూ.50 తీసుకుంటున్నారని సునీత తల్లి సుశీల చెబుతున్నారు. ప్రసవం అయ్యాక శిశువును శుభ్రం చేయాలంటే.. రూ.500 బాలింతను స్ట్రెచ్చర్‌పై గైనిక్ వార్డుకు తీసుకొస్తే.. రూ 100 చీర మార్చినందుకు.. రూ 100 కుట్లు శుభ్రం చేస్తున్నందుకు.. రూ.50 కుట్లు విప్పేందుకు.. రూ. 200 వీల్‌చైర్‌లో అంబులెన్స్ వరకూ తీసుకెళ్తే.. రూ.100 ఇదేదో కార్పొరేట్ ఆస్పత్రుల్లో సేవలకు చేసే చార్జ్ కాదు.. మన సర్వజనాస్పత్రిలోనే రోగుల నుంచి సిబ్బంది ముక్కు పిండి వసూలు చేస్తున్న మొత్తం. అడిగినంత ఇవ్వకపోతే ఇక బూతులే. డబ్బులివ్వకపోతే నరకమే! సర్వజనాస్పత్రికి వచ్చే వారంతా నిరుపేదలే. అందకూ కూలినాలి పనులు చేసుకునేవారే. అలాంటి వారినీ ఆస్పత్రిలోని లేబర్, గైనిక్ విభాగంలోని సిబ్బంది పీడిస్తున్నారు. ఆస్పత్రిలోని లేబర్‌వార్డులో రోజూ 30 నుంచి 40 ప్రసవాలు జరుగుతుండగా... వీటితో 10 నుంచి 12 సిజేరియన్లు ఉంటాయి. సిజేరియన్ అయిన వారి నుంచి సిబ్బంది భారీగా వసూలు చేస్తున్నారు. పైగా ఆమాత్రం ఇవ్వలేనోళ్లు కడుపెందుకు తెచ్చుకోవాలని నీచంగా మాట్లాడుతున్నట్లు గర్భిణులు వాపోతున్నారు. చీర మారిస్తే రూ.50 ప్రతి దానికి యాభైలు, వందలు. మేము యాడనుంచి తీసుకురావాలి. మా కోడలు అశ్వినికి పొద్దున్నే డ్రస్ మార్చాలంటే రూ.50 ఇస్తేనే చేస్తామంటారు. ఆ డబ్బుల్లేకనే గదా గవర్నమెంట్ ఆస్పత్రికి వచ్చింది. ఉన్నోళ్లుంటారు.. పూట గడవనోళ్లు ఉంటారు... లేనోళ్లను ఇబ్బంది పెట్టకండయ్యా. మీకు దండం పెడతాం. – ఆదెమ్మ, దంతలూరు, బీకేఎస్ మగబిడ్డ పుట్టాడు కదా... ఆ మాత్రం ఇవ్వలేవా..? ‘‘మగ బిడ్డ పుట్టాడు కదా...? ప్రసవమైనప్పుడు ఏమీ ఇవ్వలేదు. కనీసం బిడ్డను శుభ్రం చేసిన దానికి, యూరిన్ పైప్ వేసినందుకైనా డబ్బులివ్వు’’ అని అడుగుతున్నారని కూడేరు మండలం కలగళ్ల గ్రామానికి చెందిన బాలింత ఆదిలక్ష్మి వాపోయింది. ఆమె జూన్ 25న ప్రసవం కాగా..డబ్బుకోసం సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పెట్టారని కన్నీటిపర్యంతమయ్యింది. డబ్బులివ్వకుంటే అందరి ముందే దూషిస్తున్నారని, పరువు పోతుందని భావించి డబ్బులిస్తున్నామని చెబుతోంది. కూలి పనులు చేసుకునే తమ లాంటి పేదోళ్లతో ఇలా డబ్బులు తీసుకోవడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తోంది. చర్యలు తీసుకుంటాం ఆస్పత్రిలో వైద్య సేవలన్నీ ఉచితం. ఇక్కడ సిబ్బందికి చిల్లిగవ్వ ఇవ్వాల్సిన పనిలేదు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినట్లయితే నా దృష్టికి తీసుకురావచ్చు. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. త్వరలోనే గైనిక్, లేబర్ తదితర విభాగాల వైద్యులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటి వాటికి ఫుల్స్టాప్ పెడతాం. – డాక్టర్ బాబూలాల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ఆదుకుంటామన్నారు.. పట్టించుకోలేదు
తాడేపల్లి రూరల్(మంగళగిరి): వైద్యుల నిర్లక్ష్యం వల్ల బిడ్డను పోగొట్టుకొని అన్ని విధాలా నష్టపోయిన తమను ఆదుకుంటామన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత పట్టించుకోలేదని.. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినా న్యాయం జరగలేదంటూ గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఎలుకలు కొరకడంతో మృతి చెందిన పసికందు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు కోర్టులో పెట్టిన కేసును విత్ డ్రా చేసుకోవాలంటూ గుంటూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు బెదిరింపులకు దిగుతున్నారని వాపోయింది. డిసెంబర్ 6న కోర్టు వాయిదా ఉందని.. దానికి వెళ్లాలంటేనే భయమేస్తోందని తెలిపింది. వీటిపై తన గోడు వెళ్లబోసుకునేందుకు సోమవారం ఆమె ఉండవలి–అమరావతి కరకట్ట వెంట ఉన్న సీఎం చంద్రబాబు నివాసం వద్దకు వచ్చింది. అయితే ఆమెకు మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో అక్కడే ఉన్న మీడియా వద్ద బాధితురాలు చావలి లక్ష్మి తన బాధ చెప్పుకున్నారు. ‘2015 ఆగస్టు 20న విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో డెలివరీ అయ్యింది. మగబిడ్డ పుట్టగా.. సమస్య ఉందంటూ మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు పంపించారు. గుంటూరు వైద్యులు ఆపరేషన్ చేసి.. వార్డులోకి ఎవరినీ రానివ్వలేదు. 2015 ఆగస్టు 26న వార్డులో ఎలుకలు కొరకడంతో.. మా బిడ్డ చనిపోయాడు. దానిపై ప్రభుత్వం విచారణ చేయగా వైద్యులదే తప్పని తేలింది. అప్పటి వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు, కలెక్టర్ కాంతిలాల్ దండే మమ్మల్ని పరామర్శించి.. నష్టపరిహారంగా రూ.10 లక్షలు అందజేస్తామన్నారు. కానీ రూ.5 లక్షలే ఇచ్చారు. ప్రభుత్వం మాత్రం మాకు రూ.10 లక్షలు ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటోంది. అలాగే పక్కా నివాసం, ఉద్యోగం ఇస్తామన్నారు. వీటి గురించి కృష్ణా జిల్లా కలెక్టర్‌ను ఎన్నిసార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యమంత్రికి చెప్పుకుందామని ఏడుసార్లు ఆయన ఇంటి వద్దకు వచ్చాం. ఈ ఏడాది జూన్ 23న, ఆగస్టు 6న రెండు సార్లు సీఎంతో మాట్లాడాం. కలిసిన ప్రతిసారీ కలెక్టర్ దగ్గరకు వెళ్లాలని చెబుతున్నారు. కలెక్టర్‌ను కలిస్తే.. ఆయన తమకు ఉత్తర్వులేమీ రాలేదని చెబుతున్నారు. -
ఏసీబీకి చిక్కిన వైద్యాధికారి
ఆదిలాబాద్: ఓ ప్రభుత్వ వైద్యాధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోదకశాఖ(ఏసీబీ)కి చిక్కారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రి డాక్టర్ రవీందర్ ఓ వ్యక్తి నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
సిబ్బంది కావాలి
అనంతపురం మెడికల్ : జిల్లాలోని పేదలకు ఏదైనా జబ్బు వస్తే వెంటనే గుర్తుకొచ్చేది అనంతపురం పెద్దాస్పత్రి. ప్రైవేటు వైద్యం చేరుుంచుకునే స్తోమత లేనివారు నేరుగా ఇక్కడికొస్తుంటారు. నిత్యం వేలాదిమంది రోగులతో ఆస్పత్రి కిటకిటలాడుతూ ఉంటుంది. రోజూ 700 మంది ఇన్ పేషెంట్లు, 1,500 నుంచి రెండు వేల మంది ఔట్పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. బోధనాస్పత్రి (వైద్య కళాశాల, ఆస్పత్రి)గా ఉన్నప్పటికీ అందుకు తగ్గ వసతులు లేవు. పడకలు, వైద్యులు, సిబ్బంది కొరత.. వంటి సమస్యలు వేధిస్తున్నారుు. 2010లో 500 పడకల ఆస్పత్రిగా రూపాంతరం చెందినా... ఆ స్థాయిలో సౌకర్యాలు మెరుగుపడలేదు. 124 జీవో కింద 510 పారామెడికల్ పోస్టులు భర్తీ కావాల్సి ఉండగా.. అందులో వంద వరకు మాత్రమే భర్తీకి నోచుకున్నారుు. ఉన్న సౌకర్యాలతోనే ‘సూపర్ స్పెషాలిటీ’ వైద్యాన్ని అందించడానికి కృషి చేస్తున్నామని చెబుతున్నారు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు. ఈయన ప్రముఖ జనరల్ ఫిజీషియన్‌గా, ప్రొఫెసర్‌గా పేరొందారు. సర్వజనాస్పత్రి ‘పెద్ద’గా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు. అక్యుట్ మెడికల్ కేర్(ఏఎంసీ), నవజాతి శిశు చికిత్స విభాగం (ఎస్ఎన్సీయూ), ఐసీయూ, గైనిక్, పీడియాట్రిక్స్ తదితర విభాగాలలో కార్పొరేట్ తరహా వైద్యం అందేలా చర్యలు చేపట్టారు. ఈయన ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారి.. ఆస్పత్రంతా కలియదిరిగారు. రోగులు, సిబ్బంది సమస్యలను తెలుసుకున్నారు. ఆ వివరాలిలా... ఐసీసీయూ వార్డులో... డాక్టర్ వెంకటేశ్వరరావు : బాబూ.. నీ పేరేంటి? ఏ సమస్యతో ఇక్కడికొచ్చావ్? సుధాకర్ నాయుడు సార్! యూంజియోప్లాస్టీ చేయించుకున్నా. మళ్లీ నొప్పిగా ఉంటే వచ్చా. వెంకటేశ్వరరావు : వైద్యం సకాలంలో అందుతోందా? బాగా చూస్తున్నారు సార్. వెంకటేశ్వరరావు : ఏం పేరమ్మా? ఎన్ని రోజులుగా ఆస్పత్రిలో ఉంటున్నారు? నా పేరు షాను సార్.. గుండె సమస్య ఉంది. నిన్ననే అడ్మిట్ అయ్యా. వేరే ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు. మళ్లీ నొప్పిగా ఉంటే ఇక్కడికొచ్చా. వెంకటేశ్వరరావు : డాక్టర్ గారూ.. మీపేరేంటి? ప్రొఫెసర్లు ఏవిధంగా సహకరిస్తున్నారు? నా పేరు రజిత. హౌస్‌సర్జన్‌ను. మార్చికి ఇంటర్నషిప్ అయిపోతుంది. ప్రొఫెసర్లు స్నేహపూర్వకంగా ఉంటారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే రియూక్ట్ అవుతారు. ఏఎంసీలో... వెంకటేశ్వరరావు : ఏం పేరమ్మా?.. ఏ సమస్యతో ఇక్కడికొచ్చారు? పుష్పలత సార్. మా తాతకు బాగోలేకపోతే అడ్మిట్ చేయించాం. పదహైదు దినాలైంది వచ్చి. మక్కి ఆపరేషన్ చేశారు. ఫెయిల్ అయ్యింది. వెంకటేశ్వరరావు : స్టాఫ్‌నర్స్.. ఇక్కడ సేవలు ఎలా అందుతున్నారుు? స్టాఫ్‌నర్సు మేరీ ప్రభావతి : బెస్ట్ ట్రీట్మెంట్ అందిస్తున్నాం. ప్రైవేట్ ఆస్పత్రులు తిరస్కరించిన కేసులను ఇక్కడ విజయవంతంగా చూస్తున్నాం. కోలుకున్నాక ఇతర వార్డుల్లోకి మార్చుతున్నాం. వెంకటేశ్వరరావు:మీ సమస్యలేమైనా ఉన్నాయా? మేరీ ప్రభావతి : స్టాఫ్‌నర్సుల కొరత చాలా ఉంది. పనిభారం అధికంగా ఉంది. సుమారు 150 పోస్టులు భర్తీ కావాలి. చాలా ఇబ్బందులు పడుతున్నాం. సెలవులు కూడా తీసుకోలేనంత ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం స్పందిస్తే బాగుంటుంది. గైనిక్ వార్డు (ఆరోగ్యశ్రీ విభాగం)లో.. వెంకటేశ్వరరావు : (రోగి వెంకటరమణమ్మతో..) ఇక్కడ డబ్బులేమైనా ఖర్చయ్యూయూ? వెంకటరమణమ్మ : గర్భసంచి సమస్యతో చేరా. ఫ్రీగానే చూస్తున్నారు. బాగా వైద్యం చేస్తున్నారు. వెంకటేశ్వరరావు : ఏం పేరమ్మా? ఎన్నో కాన్పు, బాగా చూశారా? నా పేరు నాగమణి సార్. మొదటి కాన్పు. నిన్ననే డెలివరీ అరుు్యంది. బాగా చూస్తున్నారు. వెంకటేశ్వరరావు : స్టాఫ్‌నర్సు.. ఇక్కడ సమస్యలేమైనా ఉన్నాయ? స్టాఫ్‌నర్సు యూస్మిన్ : ప్రతి 5 మంది రోగులకు ఒక్క స్టాఫ్‌నర్సు ఉండాలి. ఇక్కడేమో 50 మందికి ఒక్కరు చూసుకోవాల్సి వస్తోంది. చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఎస్‌ఎన్‌సీయూలో.. వెంకటేశ్వరరావు : ఏ తరహా కేసులు వస్తుంటాయ్ డాక్టర్ గారూ? డాక్టర్ శ్రీనివాసులు : ప్రీమెచ్యూర్డ్, జాండీస్, సెప్సిస్ కేసులు అధికంగా వస్తున్నారుు. మెరుగైన వైద్యం అందజేస్తున్నాం. ప్రైవేటుగా చూపించుకోవాలంటే రోజుకు రూ.3 వేలు అవుతుంది. ఇక్కడ పైసా ఖర్చు లేకుండా చూస్తున్నాం. వెంకటేశ్వరరావు : ఏమ్మా.. ఎవరికి బాగలేదు? ఇక్కడికొచ్చాక ఏమైనా ఇంప్రూవ్ అయ్యిందా? అరుణ : నాకు కవల పిల్లలు పుట్టారు సార్. పాపకు బాగోలేదు. ఇక్కడ అడ్మిట్ చేశాక ఆరోగ్యం మెరుగుపడింది. వెంకటేశ్వరరావు : మీదేం సమస్య? వెంకటేశ్వరరావు : పిల్లోడు ఉమ్మనీరు తాగాడు. ఇప్పుడు బాగున్నాడు. బ్లడ్‌బ్యాంకులో.. వెంకటేశ్వరరావు :రోజుకు ఎంత మందికి రక్తాన్ని అందిస్తున్నారు? స్టాఫ్‌నర్సు ఆంథోని మేరీ : ప్రతి రోజూ 30 బ్యాగులు ఇస్తున్నాం. 905 యూనిట్ల స్టోరేజీ ఉంది. బయటి వ్యక్తులకు బ్యాగు రూ.850లతో సరఫరా చేస్తున్నాం. చిన్నపిల్లల వార్డులో.. వెంకటేశ్వరరావు : ఏమ్మా..ఎవరికి బాగోలేదు? నా కొడుక్కు బాగోలేదు. ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంది సార్. వెంకటేశ్వరరావు : పాపకు ఏమైంది? మారక్క : జ్వరం వస్తుంటే ఇక్కడికి తెచ్చా. ఇప్పుడు మేలు. ఓపీ బ్లాక్‌లో... వెంకటేశ్వరరావు : రోజూ ఎంత మంది వస్తుంటారు? ఓపీ ఎన్ని గంటలకు తెరుస్తున్నారు? సిబ్బంది : వెరుు్య మందికి పైగానే వస్తుంటారు. ఉదయం 8.30 నుంచి ఓపీ చీటీలిస్తున్నాం. వెంకటేశ్వరరావు :రోగులు ఇబ్బందులు పడకుండా త్వరగా ఇవ్వండి. యూంటినేటల్ ఓపీలో.. వెంకటేశ్వరరావు :అమ్మా.. ఎన్నో కాన్పు ? భారతి : మూడో కాన్పు సార్. గతంలో రెండు కాన్పులు ఇక్కడే చేయించుకున్నా. ఎలాంటి ఇబ్బందీ రాలేదు. ఇప్పుడు కూడా బాగా చూస్తున్నారు. వెంకటేశ్వరరావు :హెచ్ఓడీ గారూ..మీ సమస్యలేమైనా ఉన్నాయూ? ఇన్చార్జ్ హెచ్ఓడీ షంషాద్ బేగం : ప్రతి రోజూ 50-60 కేసులు చూస్తున్నాం. గర్భిణులకు 5,7,9 నెలల్లో అల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తున్నాం. దీంతో పాటు రోటీన్ పరీక్షలు చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే కేసులతో సమస్య ఏర్పడుతోంది. చివరి క్షణంలో తెస్తున్నారు. హై రిస్క్ కేసులు వస్తున్నారుు. పీహెచ్‌సీలు, సీహెచ్సీలలో గర్భిణులకు కౌన్సెలింగ్ ఇప్పిస్తే బాగుంటుంది. చాలామంది గర్భిణులు అవగాహన లోపంతో సరైన పౌష్టికాహారం తీసుకోవడం లేదు. దీనివల్ల రక్తహీనతతో బాధపడుతున్నారు. వెంకటేశ్వరరావు : ఏమ్మా.. ఎందుకు ముఖానికి గుడ్డ కట్టుకున్నావ్? మహిళ : అదేందో స్వైన్‌ఫ్లూ అంట. అందరూ ముఖానికి గుడ్డ కట్టుకోవాలన్నారు. అందుకే కట్టాను. వెంకటేశ్వరరావు : స్వైన్‌ఫ్లూతో భయపడాల్సిన పనిలేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. -
మంత్రి కొల్లు ఆకస్మిక తనిఖీలు
మచిలీపట్నం టౌన్ : రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తొలుత పట్టణంలోని చేపల మార్కెట్ అంతా కలియతిరిగి పరిస్థితులను గమనించారు. చేపలను శుభ్రపరిచే స్థలంలో రేకుల షెడ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బేబీ సెంటర్‌ను సందర్శించి అక్కడి రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పసి పిల్లలతో ఉన్న బాలింతల గదిలో మూడు ఫ్యాన్లు తిరగనిస్థితిని ఆయన పరిశీలించారు. ఉద్యోగుల అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించి వైద్యాధికారిణి గీతామణిని వివరాలడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రి ఆవరణంలో 150 బెడ్ల చిన్నపిల్లల ప్రత్యేక వైద్యశాల నిర్మాణం జరుగుతోందని, బేబీ సెంటర్‌ను జిల్లా ప్రభుత్వాస్పత్రిలో కలిపే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. మున్సిపల్ కార్యాలయాన్ని మంత్రి చైర్మన్ మోటమర్రి వెంకటబాబాప్రసాద్తో కలసి పరిశీలించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ మోటమర్రి వెంకట బాబాప్రసాద్, వైస్‌చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీవీ కుమార్‌బాబు, బందరు జెడ్పీటీసీ సభ్యుడు లంకే నారాయణప్రసాద్ తదితరులున్నారు. -
ఆరోగ్యశ్రీ నిధుల గోల్మాల్
ఇష్టానుసారంగా మందులు, ఇంప్లాంట్స్ కొనుగోలు ప్రోత్సాహకాలు చెల్లింపులో అక్రమాలు సుమారు రూ.2కోట్ల మేర తారుమారు విచారణకు ఆదేశించిన కలెక్టర్ నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్. జిల్లా కేంద్ర ప్రభుతాస్పత్రి ఆరోగ్యశ్రీ వైద్యసేవలు అందించడంలో రాష్ట్రస్థాయిలో రెండోస్థానంలో ఉంది. గత ఏడాది రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ఆరోగ్యశ్రీ సేవల అవార్డును కూడా అందుకుంది. కానీ ఇదేస్థాయిలో ఆరోగ్యశ్రీ నిధులు కూడా గోల్మాల్ జరిగినట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయి. సుమారు రూ.2 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్టు సమాచారం. 2008 సంవత్సరంలో జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ వార్డును ఏర్పాటు చేశారు. క్రిటికల్‌కేర్, ఈఎన్టీ సర్జరీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్ సర్జరీ, పిడియాట్రిక్, ప్లాస్టిక్ సర్జరీ, పాలిట్రామా, పల్మనాలజీ విభాగాలలో రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 3 వేల మంది రోగులకు ఆరోగ్యశ్రీ వైద్యసేవలను అందించినందుకు గాను సుమారు రూ.7 కోట్ల అరోగ్యశ్రీ నిధులు విడుదల ఆయ్యాయి. వీటిని ఆరోగ్యశ్రీ వైద్యసేవలు పొందుతున్న రోగులకు అవసరమైన మందులు, ఇతర అవసరమైన పరికరాలు, ఆర్ధోపెడిక్ ఇంప్లాంట్స్(రాడ్లు)ను ఆస్పత్రి కొనుగోలు కమిటీ ద్వారా టెండర్లను ఆహ్వానించి కొనుగోలు చేయాలి. అదే విధంగా రోగులకు అవసరమైన భోజనాలను ఏర్పాటు చేయాలి. ఆరోగ్యశ్రీ వైద్యసేవలను అందించిన డాక్టర్లకు, నర్సులకు, టెక్నీషియన్లకు, ఇతర సిబ్బందికి ప్రోత్సహం కింద నగదును చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యహరించిన అధికారులు జిల్లా కేంద్ర ఆస్పత్రికి వచ్చిన ఆరోగ్యశ్రీ నిధులను ఆస్పత్రి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమకు అనుకూలంగా ఉన్న డాక్టర్లు, నర్సులు, సిబ్బందికి మాత్రమే ప్రోత్సాహకాల కింద నగదును కొంత మొత్తం చెల్లించి మిగతా లక్షలాది రూపాయలను చెల్లించకుండానే చెల్లించినట్లు రికార్డులో నమోదు చేసి నట్లు సమాచారం. అదే విధంగా రూ.ఐదు వేలకు మించి ఏదైనా మెటీరియల్‌ను కొనుగోలు చేయాలంటే టెండర్లను పిలిచి కొనుగోలు కమిటీ అనుమతితో కొనాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి నిబంధనలూ పాటించలేదని తెలిసింది. అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు ఆరోగ్యశ్రీ నిధుల దుర్వినియోగంపై ఇటీవల జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కలెక్టర్ చిరంజీవులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. నిధుల దుర్వినియోగంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తనకు నివేదికను అందించాలని కలెక్టర్ ఇటీవల ఇన్చార్జి డీసీహెచ్ఎస్ డాక్టర్ హరినాథ్‌ను ఆదేశించారు. దీంతో ఆయన జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ జయకుమార్‌ను విచారణాధికారిగా నియమించారు. మొదటిదఫాలో విచారణ జరిపిన ఆయన రెండవ దఫాలో విచారణను చేపట్టి త్వరలో జిల్లా కలెక్టర్‌కు నివేదికను అందించే పనిలో ఉన్నట్లు తెలిసింది. అయితే విచారణ అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ఈ అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది. -
సొమ్ముంటేనే... సేవలు
చీపురుపల్లి, న్యూస్‌లైన్: మెరకముడిదాం మండలం బిల్లల వలస గ్రామానికి చెందిన గర్భిణి వెంకటలక్ష్మికి జనవరి 12వ తేదీని డెలివరీ టైమ్‌గా వైద్యులు చెప్పారు. అయితే ఆమెను చెకప్ కోసం శుక్రవారం చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకువచ్చారు. పరీక్షలు నిర్వహించిన వైద్యుడు తక్షణమే ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలన్నారు. అందుకు ఆమె కుటుంబసభ్యులు సరేనన్నారు. సరే అంటే సరిపోదు. శస్త్రచికిత్స చేయాలంటే రూ.4 వేలు అవుతుందని వైద్యుడు చెప్పాడు. బిడ్డకు ఏమౌతుందోనని కుటుంబ సభ్యులు మళ్లీ సరే అన్నారు. అలాగే చీపురుపల్లి మండలంలోని పర్ల గ్రామానికి చెందిన పొదిలాపు సూరమ్మకు కడుపులో కాయకాసింది. మామూలుగా వైద్యునికి చూపిద్దామని ఆమె భర్త చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకు వచ్చారు. తక్షణమే ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు. దానికి రూ.4 వేలు అవుతుందన్నారు. పండగ తరువాత చేయించుకుంటామని భర్త చెప్పడంతో ఆ తరువాత అయితే ఏం జరుగుతుందో మాకు తెలియదని వైద్యుడు భయపెట్టడం తో అప్పుచేసి రూ.4 వేలు ఇచ్చి ఆపరేషన్ చేయించుకున్నారు. దానికి తోడు మరో రూ.400 పెట్టి మందులు కొనుక్కున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలోని బాతువ గ్రామానికి చెందిన గర్భిణి పద్మను కుటుంబసభ్యులు ఆస్పత్రి కి తీసుకొస్తే గర్భసంచి తీసెయ్యాలని డాక్టర్ చెప్పారు. అందుకు రూ.4 వేలు అవుతుందని చెప్పగానే ఇచ్చి ఆపరేషన్ చేయించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో అయితే రూ.10 వేలు అవుతుందన్నారు. ఇక్కడైతే రూ.4వేలని చేయించామని రోగి బం ధువులు చెబుతున్నారు. ఇదంతా చీపురుపల్లి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న తీరు.పేరుకే సర్కారు దవాఖానా..కానీ ఇక్కడి తీరు మాత్రం కార్పొరేట్ ఆస్పత్రులను తలపిస్తుంది. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వైద్య సేవలు అందించాల్సిన వైద్యులే డబ్బులు ఖర్చు పెట్టాలని చెబుతుంటే పేద, మధ్యతరగతి రోగులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. తమరిష్టం బాబూ..తమరెలా చెప్తే అలాగే..అంటూ చీపురుపల్లి సర్కార్ ఆస్పత్రికి వెళ్లే రోగులు, బంధువులు అక్కడి వైద్యుడు చెప్పిందానికి తలాడిస్తూ అతి కష్టం మీద అప్పులు చేసి డబ్బులు వదిలించుకుంటున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం ఆస్పత్రులకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. కానీ చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి వచ్చిన వారికి తక్షణమే ఆపరేషన్ చేయాలని అందుకు రూ.4 వేలు అవుతుందని, ముందే చెల్లించాలని అక్కడికి నూతనంగా వచ్చిన వైద్యుడు డిమాండ్ చేస్తుండడంతో సర్కారీ దవాఖానా కాస్తా వసూళ్ల కేంద్రంగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడాం, లావేరు తదితర మండలాలకు చెందిన ప్రజలు వైద్య సేవలకు చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రిపై ఆధారపడతారు. అత్యధికంగా గర్భిణులు ప్రసవం నిమిత్తం ఇక్కడకు వస్తుంటా రు. ఇదే అదునుగా తీసుకున్న వైద్యాధికారి క్యాష్ చేసుకోవాలని భావించారు. ప్రతి శస్త్ర చికిత్సకు ఓ రేటు ఖరారు చేశారు. శస్త్రచికిత్స చేయించాలంటే బయిట నుంచి వైద్యుడిని తీసుకురావాలని, అంతేకాకుండా ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుంటే రూ.పది వేలు నుంచి రూ.20 వేల వరకు ఖర్చు అవుతుందని రూ.4 వేలు ఇవ్వలేరా? అంటూ ప్రసవాల నిమిత్తం వస్తున్న గర్భిణుల కుటుంబ సభ్యులను మోటివేట్ చేసి మరీ ఒప్పిస్తున్నారు. స్థానిక ఆస్పత్రిలో నెలకు కనీసం 100 నుంచి 150 ప్రసవాలు జరుగుతున్నాయి. ఇందులో చాలా మంది గర్భిణులకు సాధారణ ప్రసవం జరగాల్సి ఉన్నప్పటికీ డబ్బుల కోసం శస్త్రచికిత్స తప్పదని భయపెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన నెలకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూళ్ల పర్వం నడుస్తోంది. శస్త్రచికిత్సల దందా ఇలా ఉండగా ఇక్కడ ప్రసవించేందుకు వస్తున్న గర్భిణులకు కనీసం మం దులు కూడా ఇవ్వకపోవడం దారుణం. ప్రసవ సమయంలో మందులు కొనుక్కోమని చెబుతూ, కనీసం బ్లేడు, సబ్బు కూడా ఆస్పత్రి వర్గాలు ఇవ్వడం లేదని రోగుల బంధువులు వాపోతున్నారు. అంతేకాకుండా ధనిక వర్గాల కు చెందిన వారు ఎవరైనా తగిలితే అలాంటి వారి నుంచి డబ్బులు తీసుకుని వివిధ రకాల ఆపరేషన్లు స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లో నిర్వహించి, మందులు కూడా అందజేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటున్నాం... ఈ విషయమై ప్రభుత్వాస్పత్రి ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్ సునీల్ ‘న్యూస్‌లైన్’తో మాట్లాడు తూ ప్రభుత్వాస్పత్రికి వచ్చిన రోగుల నుంచి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే తీసుకుంటున్నామని చెప్పారు. ఇక్కడ వైద్యులు లేరని, శస్త్రచికిత్స చేయించాలంటే బయట నుంచి వైద్యుడిని తీసుకురావాలని, ఆయన ఊరకనే రారుకదా అన్నారు. ఇవే శస్త్ర చికిత్సలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేయించాలంటే చాలా ఖర్చు అవుతుందన్నారు. తన సొంత నిధులతో ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్‌ను అభివృద్ధి చేశానని చెప్పారు. పత్రికల్లో రాస్తే ఇక్కడ ఎవ్వరూ పని చేసేందుకు ముందుకు రారని, అయినా వార్త రాసి చెడ్డ చేస్తే ఒక్కరోజు మాత్రమే ఉంటుంద ని, పత్రిక హైలెట్ అవ్వడం తప్ప అంతకన్నా ఉపయోగం ఉండదన్నారు. మందులు కూడా బయట కొనుక్కోమని రోగులకు చెబుతున్నారట అని ప్రశ్నించగా..ఆపరేషన్‌కు అవసరమ య్యే చాలా మందుల సరఫరా లేదని, అవి వారే కొనుక్కోవాలన్నారు.