ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన సేద్యంపై ప్రకృతి చిన్నచూపు చూసింది. వరుణుడు కరుణించకపోవడంతో పచ్చనిపైరు కళ్లముందే ఎండుముఖం పట్టింది. పండగ నెల కూడా పెట్టేయడంతో ఇక వర్షం కురిసే పరిస్థితి లేదని భావించిన రైతులు వరినారును కోసి పశువులకు మేతగా వేస్తున్నారు.
డక్కిలి మండలం భీమవరానికి చెందిన మహిళా రైతు రమణమ్మ కౌలుకు తీసుకున్న తొమ్మిది ఎకరాల పొలంలో నాటేందుకు పోసుకున్న నారును పశుగ్రాసం కోసం కోస్తూ శుక్రవారం ఇలా క నిపించారు.
- న్యూస్‌లైన్, డక్కిలి