20న ఎస్‌బీఐ గ్రూపు బ్యాంకుల సమ్మె | State Bank of India Bank Group Strike on May20 | Sakshi
Sakshi News home page

20న ఎస్‌బీఐ గ్రూపు బ్యాంకుల సమ్మె

Published Wed, May 18 2016 9:29 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM

State Bank of India Bank Group Strike on May20

కర్నూలు(అగ్రికల్చర్): ఎస్‌బీఐలో స్టేట్ బ్యాంకు గ్రూపు బ్యాంకుల విలీన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 20న మెరుపు సమ్మెకు గ్రూపు బ్యాంకు లు నిర్ణయించాయి. స్టేట్‌బ్యాంకు గ్రూపులో జిల్లాకు సంబంధించి స్టేట్‌బ్యాంకు ఆఫ్ హైద్రాబాద్, స్టేట్‌బ్యాంకు ఆఫ్ మైసూర్ బ్రాంచిలున్నాయి. వీటిని ఎస్‌బీఐలో విలీనం చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయా బ్యాంకుల ఉద్యోగులు ఆందోళనకు నిర్ణయించారు. గురు, శుక్రవారాల్లో భోజన విరామ సమయాల్లో నల్లబ్యాడ్జిలతో నిరసన చేపడతారు. 20న ఆయా బ్యాంకుల అధికారులు, ఉద్యోగులు సమ్మె చేపట్టనున్నారు. సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఏఐబీఈఏ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు తెలిపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement