కలెక్టరేట్ , న్యూస్‌లైన్ : విద్యార్థి అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చిందని తెలంగాణ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు విద్యార్థులవే కాబట్టి ఫలి తా లు వారికే దక్కాలన్నారు.
టీఎస్‌జేఏసీ జిల్లా చైర్మన్ జక్కనపెల్లి గణేశ్ ఆధ్వర్యంలో స్థానిక రె వెన్యూ గార్డెన్‌లో శనివారం జరిగిన తెలంగాణ విద్యార్థి గర్జనకు ఆయన ముఖ్య అతిథిగా హాజ రై మాట్లాడారు. పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం జైలు జీవితం ఒక్కరోజైతే , ఒక్కో విద్యా ర్థి నాయకుడి జైలు జీవితం సరాసరి వంద రో జులన్నారు. రాజకీయ పార్టీలు, రాజకీయ జేఏ సీలు చేసిన ఉద్యమం వినోదం కోసం చూసే సినిమా లాంటిదన్నారు. 2009, డిసెంబర్ 9 ప్రకటనలా మరోమారు తెలంగాణ ప్రజలను మోసం చేస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కూడా విద్యార్థి ఉద్యమం నడుస్తుందని తెలి పారు. టీఎస్‌జేఏసీ జిల్లా చైర్మన్ జక్కనపెల్లి గణేశ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం నవతెలంగాణ నిర్మాణంలో విద్యార్థి జేఏసీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. టీఎస్‌జేఏసీ నాయకు లు కొంకటి శేఖర్, సంతోష్ రామగిరి, కడగండ్ల తిరుపతి, పండుగ శ్రీనివాస్, దైవాల వెంకట్, శ్రీకాంత్, సంపత్, ప్రవీణ్, రాజశేఖర్, హరీష్, రాము, రాజు, కుమార్ పాల్గొన్నారు.
రాష్ట్రం వచ్చేదాకా జాగ్రత్తగా ఉండాలి
శాతవాహన యూనివర్సిటీ : తెలంగాణ ఏర్పడే వరకు విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని ఉస్మానియా విద్యార్థి జేఏసీ నాయకులు పిడమర్తి రవి అన్నారు. శాతవాహన విద్యార్థులను శనివారం ఆయన కలిశారు. శాతావాహన వీసీ వీరారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ సుజాతను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎస్‌యూ జేఏసీ కన్వీనర్ బొల్లి సుభాష్, టీఆర్‌ఎస్‌వీ ఎస్‌యూ కన్వీనర్ పండుగ శ్రీనివాస్, కో-కన్వీనర్ రఘుపతి, అంతయ్య తదితరులు రవి వెంట ఉన్నారు.
రాష్ర్ట ఫలితాలు విద్యార్థులకే దక్కాలి
Published Sun, Nov 17 2013 3:20 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement
Advertisement