కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి: ఎంపీ అవినాష్‌రెడ్డి
ఢిల్లీ: కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ కడప ఎంపీ అవినాష్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విభజన చట్టంలోని హామీలన్ని అమలు చేయాలని లోక్ సభలో డిమాండ్ చేశారు. రాయలసీమలో స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదనడం సరికాదన్నారు. రాయలసీమలో ముడి ఇనుము అందుబాటులో ఉందని పేర్కొన్నారు. దీంతో కడప యువతకు మేలు జరుగుతుందని సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన తెలిపారు.